iDreamPost
android-app
ios-app

మా ఇంటి బంగారం.. ఈసారి సమంత అదరగొట్టడం ఖాయం

  • Published Jan 10, 2026 | 1:09 PM Updated Updated Jan 10, 2026 | 1:09 PM

టాలీవుడ్ లో సమంత నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఇక ఇప్పుడు ఇన్నాళ్లకు మా ఇంటి బంగారంతో కంబ్యాక్ ఇస్తుంది. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలాకాలం అయింది. నందిని రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కథను చాలా ఓపెన్ గా చెప్పడానికే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మూవీ టీజర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

  • Published Jan 10, 2026 | 1:09 PMUpdated Jan 10, 2026 | 1:09 PM
మా ఇంటి బంగారం.. ఈసారి సమంత అదరగొట్టడం ఖాయం

టాలీవుడ్ లో సమంత నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఇక ఇప్పుడు ఇన్నాళ్లకు మా ఇంటి బంగారంతో కంబ్యాక్ ఇస్తుంది. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలాకాలం అయింది. నందిని రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కథను చాలా ఓపెన్ గా చెప్పడానికే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మూవీ టీజర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తుంది.

టీజర్ విషయానికొస్తే.. కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయ సమంత. తన భర్త వద్దంటున్నా సరే అత్తారింటికి వెళ్తుంది. ఆమె అక్కడ వారందరితో ఈజీగా కలిసిపోతుందని అనుకుంది . కానీ వారంతా పైకి మాములుగా పద్దతిగా కనిపిస్తూనే.. అదో రకంగా ఉండేవారు. వారు కూడా ముందు ఈ కొత్త కోడలిని తక్కువ అంచనా వేస్తారు. తర్వాత ఈ కొత్త కోడలిలోని అమ్మోరు బయటకు వస్తుంది. ఆమె అక్కడికి వచ్చింది భర్తతో కుటుంబంతో కలిసి ఉండడం కోసం కాదని .. దాని వెనుక ఎదో పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని తెలుస్తుంది. అదేంటో తెలియాలంటే మాత్రం సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

మొన్నీమధ్యనే ఘాటీ అంటూ వచ్చి అనుష్క తనలోని మాస్ యాంగిల్ ను బయటపెట్టింది . ఇక ఇప్పుడు సామ్ ను చూస్తే కూడా ఇదే ఫీలింగ్ కాస్త కలుగుతుంది. కాకపోతే హీరోయిన్ పద్దతిగా ఉంటూ వెనుక వైలెంట్ బ్యాక్గ్రౌండ్ పెట్టడం అనేది కొత్త పాయింట్ కాదు కానీ.. ఇక్కడ ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ కు ఈ ప్లాట్ పెట్టడం కాస్త కొత్తగానే ఉంది . ఇక ముందు ముందు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో అవి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .