iDreamPost
android-app
ios-app

వైష్ణవ్ తేజ్ లక్కీ.. “ఆదికేశవ”కి అన్ని మంచి శకునములే!

  • Published Nov 23, 2023 | 9:18 PM Updated Updated Nov 23, 2023 | 9:21 PM

తను నటించిన తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ ఖాతాలో వేసుకున్నారు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న చిత్రం ఆదికేశవ. ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల కాగా ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

తను నటించిన తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ ఖాతాలో వేసుకున్నారు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న చిత్రం ఆదికేశవ. ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల కాగా ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

  • Published Nov 23, 2023 | 9:18 PMUpdated Nov 23, 2023 | 9:21 PM
వైష్ణవ్ తేజ్ లక్కీ.. “ఆదికేశవ”కి అన్ని మంచి శకునములే!

మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన మరో హీరో ‘వైష్ణవ్ తేజ్’. తన మొదటి సినిమా ‘ఉప్పెన’తో సూపర్ సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన నాలుగో చిత్రం “ఆదికేశవ”. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఇక ‘నవంబర్ 24’ న “ఆదికేశవ” థియేటర్ లలో సందడి చేయనుంది. అయితే టీజర్ చూసిన తర్వాత వైష్ణవ్ మీద అంచనాలు భారీగానే పెరిగాయి. ఈ చిత్రంతో మరో హిట్ ను కొడతాడని అభిమానులు భావిస్తున్నారు. మరి ‘ఆదికేశవ’కు అన్ని మంచి శకునములేనా!

శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వంలో “ఆదికేశవ” చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్, శ్రీ లీల జంటగా నటించారు. ఈ మూవీకి నిర్మాతగా ‘నాగ వంశి’ వ్యవహరించాడు . తాజాగా రిలీజైన ట్రైలర్ లో వైష్ణవ్ తేజ్ క్లాస్ లుక్ తో పాటు మాస్ లుక్ లో కూడా కనిపించాడు. ఫ్యామిలీతో ఉంటూ కాసేపు నవ్వులు కురిపించాడు. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా బాగానే ఉంది. వెంటనే ట్రైలర్ మాస్ యాక్షన్ వైపు మలుపు తిరిగింది. అక్కడ వైష్ణవ్ కొత్త లుక్ లో ప్రేక్షకులకు కనిపించాడు. ఇప్పటివరకు వైష్ణవ్ తేజ్ చేయని పాత్ర ఇది. ట్రైలర్ లో “నేను అయోధ్యలో వుండే రాముడ్ని కాదు.. ఆ రాముడు కొలిచే రుద్రకాలేశ్వరుడిని” అంటూ హీరో చెప్పిన డైలాగ్ వైష్ణవ్ కు మంచి హైప్ ఇచ్చింది.

అయితే ఉప్పెన తర్వాత వైష్ణవ్ నటించిన రెండు చిత్రాలు తనకు అంత క్రేజ్ ని తెచ్చిపెట్టలేకపోయాయి. దీనితో ఎలాగైనా తిరిగి తన క్రేజ్ ను సంపాదించుకోవాలి అనుకున్నాడు. అనుకున్నట్టే ట్రైలర్ తో తన మాస్ యాంగిల్ ను పరిచయం చేసాడు ఈ హీరో. ఈ ఏడాది పూర్తి స్థాయి మాస్ యాంగిల్లో కేవలం రెండు చిత్రాలు మాత్రమే విడుదల అయ్యాయి. చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన ‘వీర సింహరెడ్డి’. దీనితో ప్రేక్షకులు మాస్ చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి వైష్ణవ్ తేజ్ నటించిన ఈ మాస్ యాంగిల్ ఆడియన్స్ ను కచ్చితంగా ఆకట్టుకోనుంది. ఈ విషయంలో వైష్ణవ్ కాస్త అదుష్టవంతుడనే చెప్పొచ్చు. ట్రైలర్ తర్వాత ఆడియన్స్ లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇలా ఏ వైపు చూసిన “ఆదికేశవ” చిత్రానికి అన్ని మంచిశకునాలే కనిపిస్తున్నాయి.

ఇక ఈ వారంలో విడుదలకు సిద్ధంగా ఉన్న “ఆదికేశవ” చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా… మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని మెప్పించే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయని దర్శకుడు పేర్కొన్నాడు. మొత్తానికి 2023 లో చిరు, బాలయ్య తర్వాత వైష్ణవ్ తేజ్ మాస్ సినిమాతో హిట్ కొట్టబోతున్నాడా! . ఇది తెల్సుకోవాలంటే మరో రెండు రోజులు వేచి ఉండాల్సిందే మరి. ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet