iDreamPost
android-app
ios-app

ఈ ఇద్దరు ఈసారి ఏదైనా మ్యాజిక్ చేయాల్సిందే

  • Published Jan 13, 2026 | 2:22 PM Updated Updated Jan 13, 2026 | 2:22 PM

ఏ హీరోకైనా సరే కెరీర్ లో ప్లాపులు తప్పవు. అయితే అలా అని వరుసగా ఫ్లాపులు వస్తే మాత్రం ఇంకా ఆ హీరోను దాదాపు అందరు మర్చిపోతూ ఉంటారు. హిట్ హీరోస్ ఆ హీరోస్ ప్లేస్ ని రిప్లేస్ చేస్తూ ఉంటారు. ఇలా ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపుల బాట పట్టిన హీరోలు రవితేజ , శర్వానంద్

ఏ హీరోకైనా సరే కెరీర్ లో ప్లాపులు తప్పవు. అయితే అలా అని వరుసగా ఫ్లాపులు వస్తే మాత్రం ఇంకా ఆ హీరోను దాదాపు అందరు మర్చిపోతూ ఉంటారు. హిట్ హీరోస్ ఆ హీరోస్ ప్లేస్ ని రిప్లేస్ చేస్తూ ఉంటారు. ఇలా ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపుల బాట పట్టిన హీరోలు రవితేజ , శర్వానంద్

  • Published Jan 13, 2026 | 2:22 PMUpdated Jan 13, 2026 | 2:22 PM
ఈ ఇద్దరు ఈసారి ఏదైనా మ్యాజిక్ చేయాల్సిందే

ఏ హీరోకైనా సరే కెరీర్ లో ప్లాపులు తప్పవు. అయితే అలా అని వరుసగా ఫ్లాపులు వస్తే మాత్రం ఇంకా ఆ హీరోను దాదాపు అందరు మర్చిపోతూ ఉంటారు. హిట్ హీరోస్ ఆ హీరోస్ ప్లేస్ ని రిప్లేస్ చేస్తూ ఉంటారు. ఇలా ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపుల బాట పట్టిన హీరోలు రవితేజ , శర్వానంద్. రవితేజ సెకండ్ ఇన్నింగ్స్ లో ధమాకా సినిమా తర్వాత దాదాపు పది సినిమాలు తీసాడు. కానీ వాటిలో ఒక్కటి కూడా ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ పండగకు టఫ్ కాంపిటీషన్ లోను ఎంట్రీ ఇచ్చాడు రవితేజ.

ఈసారి కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని బరిలోకి దిగుతున్నాడు. ఇద్దరి పడచుల మధ్యన చిక్కుకున్న పెళ్ళైన పాత్రతో భర్త మహాశేయులకు విజ్ఞప్తి అనే సినిమాతో వస్తున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్. యుఎస్ లో ప్రీమియర్స్ టాక్ అన్నీ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఓపెనింగ్ మాత్రం ఇంకా పుంజుకోలేదు. దీనికి పాత ఫ్లాపుల ప్రభావమే కారణం. ఒక్కసారి సినిమాకు కనుక పాజిటివ్ టాక్ వస్తే.. ఇక మెల్లగా అదే పుంజుకుని ఆశించిన కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

ఇక శర్వానంద్ విషయానికొస్తే .. అప్పుడెప్పుడో శతమానం భవతి తో బ్లాక్ బస్టర్ కొట్టినట్టు గుర్తు అంటూ సినీ లవర్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నారి నారి నడుమ మురారి అంటూ శర్వా కూడా ఇద్దరు అమ్మాయిల మధ్య ఇరుకున్న కుర్రాడి కథతో వస్తున్నాడు. సో ఇది కనుక హిట్ కొడితే తర్వాత తర్వాత శర్వకు మంచి సినిమాలు చేసే అవకాశం వస్తుంది. కాకపోతే ఇక్కడ కూడా ఓపెనింగ్స్ సమస్యే. సో ఇప్పుడు ఇద్దరు ఈసారి ఏదైనా మ్యాజిక్ చేయాల్సిందే. పాజిటివ్ టాక్ తెచ్చుకోవాల్సిందే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.