Swetha
మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా అందరు హిట్స్ ఇస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ , చిరంజీవి వంతు అయిపోయింది. అటు రామ్ చరణ్ పెద్ది సినిమా మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు అందరు దీనికోసమే ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈసారి వరుణ్ తేజ్ పక్కా ప్లానింగ్ తో కొరియన్ కనకరాజు అంటూ వచ్చేస్తున్నాడు.

మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా అందరు హిట్స్ ఇస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ , చిరంజీవి వంతు అయిపోయింది. అటు రామ్ చరణ్ పెద్ది సినిమా మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు అందరు దీనికోసమే ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈసారి వరుణ్ తేజ్ పక్కా ప్లానింగ్ తో కొరియన్ కనకరాజు అంటూ వచ్చేస్తున్నాడు. ఇప్పటివరకు వరుణ్ తేజ్ రెండు సార్లు డేర్ చేసి తన కెరీర్ ను రిస్క్ లో పెట్టుకున్నాడు. ఇక ఈసారి ఎలా అయినా హిట్ కొట్టే ఉద్దేశంతో ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చేస్తున్నాడు.
ఈ కొత్త సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లిమ్ప్స్ లో కథ ఏంటి అనేది చెప్పలేదులే కానీ ఓ చిన్న క్లూ ఇచ్చి వదిలేసారు. కమిడియన్ సత్య ఓసారి కొరియాలో ఇరుక్కుపోతాడు. అతడిని కనకరాజు జాడ చెప్పమని పోలీసులు వేధిస్తూ ఉంటారు. కట్ చేస్తే ఎవరు ఊహించని విధంగా కనకరాజు అక్కడికి వచ్చి భీభత్సము సృష్టిస్తాడు. అందరిని భయపెడతాడు. తీరా చూస్తే అసలు అతను డూప్లికేట్ కనకరాజ్ అని సత్య గుర్తిస్తాడు. ఇలా కాస్త హర్రర్ కామిడి జోనర్ లో ఈ టీజర్ సాగిపోయింది.
విజువల్స్ వరకు సింపుల్ గానే అనిపించినా… బ్యాక్గ్రౌండ్ మాత్రం భపెట్టేలా గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఈ మధ్య కాలంలో హర్రర్ సినిమాలు ప్రేక్షకులను బాగానే భయపెడుతున్నాయి. కాకపోతే ఇండియన్ దెయ్యాలు అలవాటు పడిన వారికి కాస్త వెరైటీగా కొరియన్ దెయ్యాలను పరిచయం చేసాడు దర్శకుడు. మాస్ యాంగిల్ నుంచి ఇటు సైడ్ వచ్చేసిన వరుణ్ కు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్స్ ను అందిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.