Mana Sankara Varaprasad gaaru Movie Review : సరైన చిరంజీవిని ఎవరు వాడుకోడవం లేదనే టాక్ ఆ మధ్య వినిపించిన మాట వాస్తవం. దీనితో అసలు ఫ్లాప్ అకౌంట్స్ ఏ లేని అనిల్ రావిపూడి ఓ మంచి కథతో ఎంట్రీ ఇచ్చాడు. సంక్రాంతి అంటే పక్కాగా అనిల్ రావిపూడి సినిమా ఉండాల్సిందే. అలా మన శంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి వచ్చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
Mana Sankara Varaprasad gaaru Movie Review : సరైన చిరంజీవిని ఎవరు వాడుకోడవం లేదనే టాక్ ఆ మధ్య వినిపించిన మాట వాస్తవం. దీనితో అసలు ఫ్లాప్ అకౌంట్స్ ఏ లేని అనిల్ రావిపూడి ఓ మంచి కథతో ఎంట్రీ ఇచ్చాడు. సంక్రాంతి అంటే పక్కాగా అనిల్ రావిపూడి సినిమా ఉండాల్సిందే. అలా మన శంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి వచ్చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
Swetha
చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సరైన చిరంజీవిని ఎవరు వాడుకోడవం లేదనే టాక్ ఆ మధ్య వినిపించిన మాట వాస్తవం. దీనితో అసలు ఫ్లాప్ అకౌంట్స్ ఏ లేని అనిల్ రావిపూడి ఓ మంచి కథతో ఎంట్రీ ఇచ్చాడు. సంక్రాంతి అంటే పక్కాగా అనిల్ రావిపూడి సినిమా ఉండాల్సిందే. అలా మన శంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి వచ్చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
కథ :
ఈ సినిమాలో చిరంజీవి ఓ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. అతను కొన్ని కారణాల వలన తన భార్య శశిరేఖతో విడిపోతాడు. దీనితో ఆమెను , అతని పిల్లల్ని బాగా మిస్ అవుతూ ఉంటాడు. పిల్లలకు దగ్గరకావాలని భార్య శశిరేఖకు తెలియకుండా పిల్లలను కలిసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ వాటిలో ఒక్కటి కూడా సఫలం కావు. కట్ చేస్తే ఓసారి శశిరేఖ తండ్రి జివిఆర్ మీద ఓ ఎటాక్ జరుగుతుంది. దీనితో వారికి సెక్యూరిటీ ఆఫీసర్ గా చిరంజీవి రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏమైంది ? అసలు శశిరేఖ , శంకర వరప్రసాద్ ఎలా ప్రేమించుకున్నారు ? ఎందుకు విడిపోయారు ? ఆ ఎటాక్ కు కారణం ఎవరు ? ఇవన్నీ తెలియాలంటే వెండితెరమీద సినిమా చూడాల్సిందే.
నటీ నటులు , టెక్నికల్ టీం పనితీరు :
నటీ నటుల విషయంలో చిరంజీవి యాక్టింగ్ కు పేరు పెట్టడానికి లేదు . అనిల్ రావిపూడి ముందే చెప్పినట్టే ఘరానా మొగుడు లాంటి చిరుని మరోసారి తెరమీద చూపించారు. ఎప్పుడో ఇరవై ఏళ్ళ నాటి చిరులోని మ్యానరిజం , కామిడి టైమింగ్ ను ఇప్పుడు తెరమీద చూస్తూనే వింటేజ్ ఫ్యాన్స్ అంతా మైమరచిపోయిన మాట వాస్తవం. సినిమా మొత్తాన్ని ఆయన భుజాల మీద నడిపించేసారు. ఇక క్యామియో గా నటించిన వెంకటేష్ ఉన్నది కాసేపైన.. ఆ కాసేపు అందరి యాట్రక్షన్ గ్రాబ్ చేసాడు. అలాగే నయనతార తన పాత్రలో పూర్తిగా లీనం అయిపోయింది. సచిన్ ఖేడేకర్ , హర్ష, అభినవ్ గోమఠం, క్యాథరిన్ , చిరంజీవి తల్లి పాత్రలో నటించిన జరీనా వహాబ్ లాంటి వారంతా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
అలాగే టెక్నికల్ టీం విషయానికొస్తే.. ఈ సినిమా భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ ఎసెట్. ఎక్కడా ఏ మాత్రం ఎక్కువ కాకుండా అలా అని తక్కువ కాకుండా.. సినిమా సీన్స్ కు తగ్గట్టు పెట్టారు . ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కొన్ని నెగెటివిటి వచ్చిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు సినిమా మొత్తం చూస్తే అదంతా తుడిచిపెట్టుకుపోతోంది. సినిమాటోగ్రఫీ కూడా కంప్లీట్ గా అందరికి మెప్పిస్తుంది.
విశ్లేషణ :
అనిల్ రావిపూడి నుంచి సినిమా వస్తుంది అంటేనే.. మెయిన్ టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ అని ఈజీగా తెలిసిపోతుంది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ నుంచి రిలీజ్ ముందు వరకు వచ్చిన అన్ని వీడియోస్ కూడా అలానే ఉన్నాయి. అయితే సినిమా చూసిన తర్వాత మాత్రం కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాకుండా ఇటు మెగా ఫ్యాన్స్ , అటు మూవీ లవర్స్ ను కూడా కవర్ చేసేసాడు అనిల్ రావిపూడి. చిరంజీవిలో ఉన్న కామిక్ సెన్స్ ను , డ్యాన్స్ ను కంప్లీట్ గా వాడేసుకున్నాడు. నిజానికి సినిమా కథేమీ కొత్తది కాదు. అలా అని అంతకముందు చూసింది కాదు. అలా అని బుర్ర బద్దలుకొట్టేసుకుని ఇదేంటి అని ఆలోచించాల్సిన అవసరం కూడా పడదు.
ఓ సాధారణ విడిపోయిన భార్య భర్తల కథ. విడాకుల తర్వాత భర్త తన భార్య పిల్లలను ఎలా కలిసాడు . ఆ కలిసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసాడు. అనే ఓ లైన్ తో స్టోరీ రాసుకుని దాని చుట్టూ క్యారెక్టర్స్ వరల్డ్ బిల్డింగ్ చేసుకుని సినిమా కథను కంప్లీట్ చేసాడు అనిల్. సినిమా మొదటి హాఫ్ అంతా కూడా చిరంజీవి పాస్ట్ , ప్రేమ , పెళ్లి , విడాకుల గురించి నవ్విస్తూ చెప్పేస్తాడు. ఇక సెకండ్ ఆఫ్ కు వచ్చేసరికి మొదటి హాఫ్ లో ప్రశ్నలకు సమాధానాలు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ రూపంలో అందించాడు. ఈ మధ్య సోషల్ మీడియాలో విడాకులు ట్రెండ్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో తెలియనిది కాదు.
అలాంటి వారినందరికి దృష్టిలో ఉంచుకుని అనిల్ ఈ కథను రాసుకున్నాడో ఏమో తెలియదు కానీ.. థియేటర్లో మాత్రం మన శంకర వరప్రసాద్ గారు అందరితో విజిల్స్ వేయిస్తున్నారు. అనిల్ సినిమాలో కామిడి , ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంటుందో.. సినిమా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఓ మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అది కచ్చితంగా అందరికి టచ్ చేస్తుంది. ఈ సినిమాలో కూడా అలాంటి మెసేజ్ ఉంది. మొత్తానికి మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చి.. అందరికి శాటిస్ఫై చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్లస్ లు :
చిరంజీవి
పంచ్ లైన్స్, సాంగ్స్
కథనం
మైనస్ లు :
ల్యాగ్ సీన్స్ ( కొన్ని)
రేటింగ్ : 3/5
చివరిగా : మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి కళని ఇంకాస్త పెంచేశారు..