Swetha
ప్రభాస్ నుంచి ఏదైనా సినిమా అనౌన్సమెంట్ వచ్చిందంటే.. ఇటు ప్రేక్షకులతో పాటు అటు ఇండస్ట్రీ మొత్తం ఆ సినిమా కోసం , ఆ సినిమా కొల్లగొట్టే రికార్డ్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గతంలో ఈ కట్ అవుట్ తో ప్రభాస్ టాలీవుడ్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టాడు. కాబట్టి ఈసారి వచ్చే సినిమా ఇంతకముందు కంటే ఓ మెట్టు ఎక్కువే ఉండాలని ఆశిస్తారు కానీ తక్కువ ఉండాలని అనుకోరు.
ప్రభాస్ నుంచి ఏదైనా సినిమా అనౌన్సమెంట్ వచ్చిందంటే.. ఇటు ప్రేక్షకులతో పాటు అటు ఇండస్ట్రీ మొత్తం ఆ సినిమా కోసం , ఆ సినిమా కొల్లగొట్టే రికార్డ్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గతంలో ఈ కట్ అవుట్ తో ప్రభాస్ టాలీవుడ్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టాడు. కాబట్టి ఈసారి వచ్చే సినిమా ఇంతకముందు కంటే ఓ మెట్టు ఎక్కువే ఉండాలని ఆశిస్తారు కానీ తక్కువ ఉండాలని అనుకోరు.
Swetha
ప్రభాస్ నుంచి ఏదైనా సినిమా అనౌన్సమెంట్ వచ్చిందంటే.. ఇటు ప్రేక్షకులతో పాటు అటు ఇండస్ట్రీ మొత్తం ఆ సినిమా కోసం , ఆ సినిమా కొల్లగొట్టే రికార్డ్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గతంలో ఈ కట్ అవుట్ తో ప్రభాస్ టాలీవుడ్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టాడు. కాబట్టి ఈసారి వచ్చే సినిమా ఇంతకముందు కంటే ఓ మెట్టు ఎక్కువే ఉండాలని ఆశిస్తారు కానీ తక్కువ ఉండాలని అనుకోరు. అలానే మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసినప్పుడు కూడా అనుకున్నారు. పైగా మొదటిసారి ప్రభాస్ హర్రర్ జోనర్ ను టచ్ చేయడం.. వింటేజ్ డార్లింగ్ ను పరిచయం చేస్తానని మారుతి చెప్పడం. ఇవన్నీ నిన్నటివరకు విన్న రామాయణాలే. ఇక ఇప్పుడు సినిమా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి అనే విషయానికొస్తే..
ఊహించిన దానికి మించి ఎవరి ఊహలకు అందని విధంగా మారుతి సినిమా తీసాడని అంటున్నారు. ఇది పాజిటివ్ గా అర్థంచేసుకోవాలా నెగిటివ్ గా అర్థంచేసుకోవాలా అనేది సినిమా చూసిన వారికి అర్ధమౌతుంది. కథ , కథనం గురించి కాసేపు పక్కన పెట్టేస్తే డార్లింగ్ మాత్రం చాలా స్టైలిస్ట్ గా కనిపించాడు. సినిమా అంతా ప్రభాస్ వన్ మ్యాన్ షో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆఖరి 30 నిముషాలు పక్కా గూస్బంప్స్ వచ్చే సీన్స్ ను చూపించాడు మారుతి . VFX , సినిమా కోసం వేసిన కొన్ని సెట్స్ , బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ , కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ ఇలా కొన్ని అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. ఇక్కడ రాజాసాబ్ రాజసం అయితే ప్రేక్షకులకు నచ్చింది కానీ..
రాజా లాంటి డార్లింగ్ కటౌట్ కు సెట్ అయ్యే కథ ఇది కాదని కొంతమంది ప్రేక్షకుల అభిప్రాయం. ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టు స్క్రిప్ట్ అందించడంలో మారుతి ఎక్కడో ఫెయిల్ అయ్యాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాలో సైకాలజీ, మెటా ఫిజిక్స్, ఆకల్ట్, హిప్నాటిజం, షట్ చక్రాలు, ప్యారలెల్ వరల్డ్.. ఇలా ఒకటి కాదు చాలానే ఇంక్లూడ్ చేసి ఓ ఫిక్షన్ ను కుక్ చేసాడు మారుతి. కాకపోతే వాటిని సమపాళ్లలో వడ్డిస్తే కథకు , కథనానికి పూర్తి స్థాయి న్యాయం జరిగేదేమో అనే ఫీలింగ్ కలుగక మానదు. మొత్తానికి రాజాసాబ్ అభిమానులను అలరించాడు.సాధారణ ఆడియన్స్ కు ఓ కొత్త ఫీలింగ్ ను కలిగించాడు. ఇక ఈ వీకెండ్ కంప్లీట్ అయితే కానీ కలెక్షన్స్ వివరాలు బయటకు రావు. ముందు ముందు రాజాసాబ్ ఎలాంటి టాక్ సంపాదించుకుంటాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.