AadiKeshava Movie Review & Rating in Telugu: పంజా వైష్ణవ్ తేజ్- శ్రీలీల జంటగా.. శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించిన ఆదికేశవ సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
AadiKeshava Movie Review & Rating in Telugu: పంజా వైష్ణవ్ తేజ్- శ్రీలీల జంటగా.. శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించిన ఆదికేశవ సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
Tirupathi Rao
పంజా వైష్ణవ్ తేజ్ సినిమా అనగానే మెగా అభిమానుల్లో సందడి నెలకొంది. అలాగే ఈ సినిమా ఫలింత మీద కూడా కొన్ని భయాలు ఏర్పడ్డాయి. అసలు ఈ మూవీ ఎలా ఉంటుంది? వైష్ణవ్ తేజ్ ఖాతాలో హిట్టు పడుతుందా? అంటూ కొన్ని ప్రశ్నలు అయితే వారి మదిలో మెదిలాయి. మరి.. వైష్ణవ్ తేజ్- శ్రీలీల జంటగా.. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఆదికేశవ సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
ఈ సినిమా కథ మొత్తం బ్రహ్మసముద్రం అనే ఊరు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఊరిలో ఉండే చెంగారెడ్డి(జోజు జార్జ్) మైనింగ్ పేరుతో ఆ ఊరు మొత్తాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. కొండలను తవ్వుకుంటూ ఆ ఊరి శివాలయం వరకు వచ్చేస్తాడు. తనకు అడ్డుగా ఉందని ఆ గుడిని కూడా నేలమట్టం చేయాలని చూస్తాడు. అసలు ఆ ఊరితో ఏమాత్రం సంబంధంలేని బాలకోటయ్య అలియాస్ బాలు(వైష్ణవ్ తేజ్) ఆ ఊరి గొడవలోకి ఎలా వస్తాడు? బాలు రుద్రకాళేశ్వర రెడ్డిగా ఎలా మారాడు. అసలు ఆ ఊరికి బాలుకి సంబంధం ఏంటి? చివరికి ఆ ఊరిని, అక్కడి ప్రజలను చెంగారెడ్డి చెర నుంచి విడిపించాడా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మీరు థియేటర్లలో ఆదికేశవ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాలో ప్రేమ, కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్ అన్నీ సమపాళ్లలో ఉన్నాయి. యాక్షన్ కాసింత ఎక్కువగానే ఉంది. నిజానికి ట్రైలర్ చూసి వైష్ణవ్ తేజ్ ని అలాంటి పాత్రలో ఊహించుకోలమా అని అంతా భయపడ్డారు. కానీ, వైష్ణవ్ ఆ పాత్రలో ఒదిగిపోయాడనే చెప్పాలి. కథ చెప్పడంలో డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. పాయింట్ బై పాయింట్ ఆడియన్ ని కథలోకి తీసుకెళ్లిన విధానం నచ్చుతుంది. డైరెక్టర్ గా తొలి ప్రయత్నంలోనే మంచి మార్కలు కొట్టేశాడు. రొటీన్ స్టోరీలా అనిపించినా.. సినిమాలో ట్విస్టులకు ఎలాంటి కొదవ లేదు. ఒక సింపుల్ కథని ఎంతో థ్రిల్లింగ్ గా తెరకెక్కించాడు.
ఇంటర్వెల్ కి ముందు వరకు మీరు ఇదేంటి యాక్షన్ అనుకున్నాం.. కానీ, అంతా కామెడీ ఉందేంటి అనుకుంటారు. కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ లో మంచి ట్విస్ట్ ని ప్లాన్ చేశారు. ఆ తర్వాత నుంచి సినిమా పరుగులు పెడుతుంది. అలాగే యాక్షన్ పార్ట్ ఆడియన్స్ ని కాస్త భయపెడుతుంది కూడా. ఒకానొక సమయంలో శ్రీకాంత్ ని బోయపాటి పూనాడా? అనే అనుమానం రాకమానదు. క్లైమాక్స్ ఫైట్ చూసే సమయంలో అందరూ అదే అనుకుంటారు. సెకండాఫ్ చూస్తున్నప్పుడు.. క్యూట్ లవర్ బాయ్ లా చిత్ర(శ్రీలీల) చుట్టూ తిరిగిన బాలూనేనా ఇతను అని షాకవుతారు కూడా.
చైల్డ్ ల్యాబర్, చైల్డ్ అబ్యూస్ వంటి సున్నితమైన అంశాలను డైరెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం నచ్చుతుంది. ఆ సన్నివేశాలను హీరో క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి బాగా వాడుకున్నారు. ప్రథమార్థంలో మాత్రం కాస్త సాగదీత అనే భావన కలుగుతుంది. ఇంక పాటలు కూడా ఆడియన్స్ కి బాగా నచ్చేస్తాయి. ముఖ్యంగా వైష్ణవ్, శ్రీలీల స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ లో చూపించిన ట్విస్టుకు కంటిన్యూగా క్లైమాక్స్ లో మరో ట్విస్టు ఉంటుంది. అది చూశాక ఆడియన్స్ తెగ నవ్వేసుకుంటారు. బాలు- చెంగారెడ్డి ఫేసాఫ్ సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ యాక్టింగ్ లో మెచ్యూరిటీ కనిపిస్తుంది. నాలుగో సినిమాలోనే ఎంతో అనుభవమున్న హీరోగా కనిపిస్తాడు. సినిమా మొత్తాన్ని సింగిల్ హ్యాండ్ తో పుల్ చేశాడనే చెప్పాలి. ఇంక శ్రీలీల కూడా మంచి నటన, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, మంచి డాన్స్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది. హీరో తర్వాత ప్రతినాయకుడు జోజు జార్జ్ గురించి చెప్పుకోవాలి. మలయాళం సినిమాలు చూసే వారికి జోజు జార్జ్ సుపరిచితుడే. విలన్ పాత్రకు జార్జ్ ని ఎంపిక చేసినప్పుడే డైరెక్టర్ పాస్ అయిపోయాడు. కంటిచూపుతో, నోటి మాటతోనే ఊరుని, రాజకీయ నాయకులని బెదిరించేస్తాడు.
ఇంక రాధిక శరత్ కుమార్ తల్లి పాత్రలో మెప్పిస్తుంది. కొడుకుని వెనకేసుకొచ్చే తల్లిగా ఎంతో బాగా నటించారు. హీరో ఫ్రెండ్ గా సుదర్శన్ మంచి కామెడీని పండించాడు. సుదర్శన్ స్క్రీన్ మీద ఉన్నంతసేపు నవ్వుతునే ఉంటారు. వైష్ణవ్- సుదర్శన్ సంభాషణలు ఆకట్టుకుంటాయి. సుమన్ ది కీలకపాత్రే అయినా దాని పరిధి చాలా తక్కువగా ఉంటుంది. తనికెళ్ల భరణి, సదా, అపర్ణా దాస్ వంటి వాళ్లు వారి పాత్ర పరిధి మేరకు అలరిస్తారు. ఏ పాత్ర కూడా ఎక్కువ అనే భావన రాదు.
ఈ సినిమాకి క్యారెక్టర్స్ ని ఎంపిక చేసినప్పుడే డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి సగం సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కథ చెప్పిన తీరుతో ఆడియన్స్ దగ్గర మిగిలిన మార్కులు కొట్టేశాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లో మంచి బీజీఎం అందించాడు. డీవోపీ డడ్లీ కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఇంక నిర్మాణ విలువలు ఎంతో గొప్పగా ఉంటాయి. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా కూడా రాజీ పడకుండా ఎంతో గొప్పగా ఈ సినిమాని తెరకెక్కించారు.
చివరిగా.. ఆదికేశవ ఆడియన్స్ ని అలరిస్తాడు.
రేటింగ్: 2/5