sai
Extra Ordinary Man OTT Release & Streaming Platform: గత నెలలో విడుదలైన అతి పెద్ద సినిమాల్లో ఒకటి ఎక్స్‌ట్రా ఆర్డినరీ. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ మూవీని తెరకెక్కించాడు ప్రముఖ దర్శకుడు వక్కంతం వంశీ. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది . ఇంతకు ఎప్పుడు, ఎక్కడ అంటే..?
Extra Ordinary Man OTT Release & Streaming Platform: గత నెలలో విడుదలైన అతి పెద్ద సినిమాల్లో ఒకటి ఎక్స్‌ట్రా ఆర్డినరీ. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ మూవీని తెరకెక్కించాడు ప్రముఖ దర్శకుడు వక్కంతం వంశీ. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది . ఇంతకు ఎప్పుడు, ఎక్కడ అంటే..?
sai
గత ఏడాది డిసెంబర్‌లో అనేక చిత్రాలు థియేటరల్లో సందడి చేశాయి. యానిమల్, సలార్ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. నాని మూవీ హాయ్ నాన్న కూడా మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. అదే నెలలో విడుదలైన నితిన్ సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీగా నిలిచింది. డిసెంబర్ 8న విడుదలైన ఈ చిత్రంలో తండ్రి రావు రమేష్, నితిన్ యాక్టింగ్ నవ్వులు, పువ్వులు పూయించాయి. మాటల రచయితగా మంచి పేరు సంపాదించిన వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాజశేఖర్ కీలక పాత్ర పోషించాడు. డ్యాన్స్ క్వీన్ శ్రీలల హీరోయిన్‌గా నటించగా.. రావు రమేష్, పవిత్రా లోకేశ్, బ్రహ్మజీ, అజయ్, సంపత్ రాజ్‌లు నటించారు.
అనేక సినిమాలకు కథ, మాటలు అందించిన వక్కంతం వంశీ.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రంతో దర్శకుడిగా మారాడు. అయితే హిట్ కాకపోయినా.. ఓకే ఓకే అనిపించింది. అయితే ఐదేళ్ల గ్యాప్ తర్వాత.. మళ్లీ మెగా ఫోన్ పట్టి నితిన్ తో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీని తెరకెక్కించాడు. కేవలం 60 రోజుల్లోనే సినిమాను తీశాడు వంశీ. ఈ పిక్చర్ సక్సెస్ సాధిస్తుందని పలు ఇంటర్వ్యూల్లో ఆశాభావం వ్యక్తం చేశాడు డైరెక్టర్. గత నెలలో విడుదలైన ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. హరీష్ జై రాజ్ సంగీతం మాత్రం ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
కామెడీ ఎంటర్ టైనర్‌గా ఆకట్టుకున్న ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ జనవరి 19 అర్ధరాత్రి నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరించారు. థియేటర్లలో ఈ మూవీని మిస్ అయ్యామని భావించిన వాళ్లు.. ఇంకెందుకు ఆలస్యం.. హాట్ స్టార్ లో చూసేయండిక. నితిన్‌ను జూనియర్ ఆర్టిస్టుగా చూపించిన ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A pair that’s Extra-beautiful 💘#ExtraOrdinaryManonHotstar streaming from midnight only on #DisneyPlusHotstar@actor_nithiin @ActorRajasekhar @sreeleela14 @vamsivakkantham @Jharrisjayaraj pic.twitter.com/9q3gspqNjX
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) January 18, 2024