iDreamPost
android-app
ios-app

అర్జున్ సీతా పయనం నుండి అస్సలు సినిమా సాంగ్ రిలీజ్

  • Published Jan 08, 2026 | 12:21 PM Updated Updated Jan 08, 2026 | 12:21 PM

మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా.. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా.. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

  • Published Jan 08, 2026 | 12:21 PMUpdated Jan 08, 2026 | 12:21 PM
అర్జున్ సీతా పయనం నుండి అస్సలు సినిమా సాంగ్ రిలీజ్

మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా.. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషిస్తున్నారు.

దీనికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా నుంచి అస్సలు సినిమా అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఆహా ఓహో అంటాడు.. అందం నీదే అంటాడు అనే పదాలతో మొదలైన ఈ సాంగ్ ఊపుతెప్పించే లిరిక్స్ తో ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రీయ ఘోషల్ పాడారు. ఈ పాటలో ఐశ్వర్య అర్జున్ అందాలు హైలైట్ అవుతుండగా.. అనూప్ రూబెన్స్ బాణీలు అదుర్స్ అనేలా ఉన్నాయి.

ఈ సాంగ్ విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ వైరల్ కావడమే గాక, అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణుల బృందం ప్రాణం పోస్తోంది. జి బాలమురుగన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. చిత్రంలోని స్టంట్ సన్నివేశాలకు యాక్షన్ కింగ్ అర్జున్ కొరియోగ్రఫీ అందించగా, నృత్యాలకు శ్రాస్తి కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది.

నటినటులు :
ఐశ్వర్య అర్జున్,నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ, యాక్షన్ కింగ్ అర్జున్, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా
సాంకేతిక బృందం:
బ్యానర్: శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్
స్టోరీ – స్క్రీన్ ప్లే – ప్రొడ్యూసర్, డైరెక్టర్: యాక్షన్ కింగ్ అర్జున్
డైలాగ్స్: Dr. సాయి మాధవ్ బుర్ర
మ్యూజిక్: మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: G. బలమురుగన్
ఎడిటర్: అయూబ్ ఖాన్
ఆర్ట్ డైరెక్టర్స్: మోహన్ బి కేరీ, శివ కామేష్ డి, CH కృష్ణ
ఫైట్స్: కిక్కాస్ ఖాళీ
కో-డైరెక్టర్: UL. మూర్తి
PRO: సాయి సతీష్
డిజిటల్ మార్కెటింగ్: స్టార్ సర్కిల్

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/