iDreamPost
android-app
ios-app

లిప్ లాక్‌పై శ్రీలీల ఇంట్రస్టింగ్ కామెంట్స్.. ఆయనతోనే..

శ్రీలీల.. టాలీవుడ్ కు దొరికిన మరొక అందం. ఆమె నామ స్మరణే చేస్తున్నారు దర్శక నిర్మాతలు, హీరోలు. ఇప్పుడు ఆమె చేతినిండా సినిమాలే. మరో రెండు, మూడేళ్ల వరకు ఆమె హవా నడిచేటట్లు కనిపిస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లీల.. లిప్ లాక్ పై ఆసక్తికర కామెంట్లు చేసింది.

శ్రీలీల.. టాలీవుడ్ కు దొరికిన మరొక అందం. ఆమె నామ స్మరణే చేస్తున్నారు దర్శక నిర్మాతలు, హీరోలు. ఇప్పుడు ఆమె చేతినిండా సినిమాలే. మరో రెండు, మూడేళ్ల వరకు ఆమె హవా నడిచేటట్లు కనిపిస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లీల.. లిప్ లాక్ పై ఆసక్తికర కామెంట్లు చేసింది.

లిప్ లాక్‌పై శ్రీలీల ఇంట్రస్టింగ్ కామెంట్స్.. ఆయనతోనే..

టాలీవుడ్‌లో హీరోయిన్లకు కొదవ ఉండదు. అయితే ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్లిపోతుంటారు కొందరు నటీమణులు. ఆ కోవలో చాలా మంది ఉండగా.. తాజాగా జాబితాలోకి  చేరిపోయింది అందాల సుందరి శ్రీలీల. తన నటనా లీలతో తెలుగు కుర్రకారు హృదయాలను దోచేస్తూ.. తన డ్యాన్సులతో మెలికలు పెడుతోంది ఈ చిన్నది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజియెస్ట్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. మిగిలిన హీరోయిన్లకు అవకాశాలున్నాయా అనేంతలా ఉంది శ్రీలల సినిమాల లైనప్స్. ఈ దసరా పండుగకు భగవంత్ కేసరితో ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. ప్రమోషన్లలో, ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న లీల లిప్ లాక్ పై ఆమె ఇంట్రస్టింగ్ కామెంట్ చేసింది.

బాల కృష్ణ హీరోగా కాజల్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ దసరాకు విడుదలైన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో శ్రీలీలకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా కలెక్షన్ల పరంగా ముందుకు దూసుకెళుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీలల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో యాంకర్.. ఒక వేళ లిప్ లాక్ చేయాల్సి వస్తే.. ఏ స్టార్‌తో చేస్తారని ప్రశ్నించింది. దానికి శ్రీలీల.. ఎవ్వరితోనూ లిప్ లాక్ చేయనని చెప్పింది. ఒక వేళ చేయాల్సి వస్తే డైరెక్ట్ గా తనకు కాబోయే భర్తతోనే చేస్తానంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఇంకా డేట్లు సర్దుబాటు చేసుకోలేక.. విజయ్ దేవరకొండ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక పోతే పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్‌తో గుంటూరు కారం, వైష్ణవ్ తేజ్‌తో ఆదికేశవ, నితిన్ తో ఎక్స్ట్సా ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలు లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఆమె నటించిన సినిమాల్లో స్కంద గత నెలలో రిలీజ్ అయితే.. ఈ నెలలో భగవంత్ కేసరి విడుదలైంది. మొత్తానికి వచ్చే రెండు, మూడేళ్లు ఆమె హవా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. చూడాలి లిప్ లాక్ విషయంలో తను పెట్టుకున్న కండిషన్లకు కట్టుబడి ఉంటుందో లేక గీత దాటేస్తుందో.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet