Swetha
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంక్రాంతి సందడి ముగిసిపోయింది. ఎక్కడివారంతా అక్కడికి చేరుకుంటున్నారు. అలాగే టాలీవుడ్ లో సంక్రాంతి సందడి కూడా దాదాపు ఎండ్ కి వచ్చినట్టే. ఈ ఏడాది సంక్రాంతికి చాలానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్టార్ హీరోల సినిమాల నుంచి మిడ్ రేంజ్ హీరోల సినిమాల వరకు అన్నీ పరవాలేదనే టాక్ ని అయితే సంపాదించుకున్నాయి.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంక్రాంతి సందడి ముగిసిపోయింది. ఎక్కడివారంతా అక్కడికి చేరుకుంటున్నారు. అలాగే టాలీవుడ్ లో సంక్రాంతి సందడి కూడా దాదాపు ఎండ్ కి వచ్చినట్టే. ఈ ఏడాది సంక్రాంతికి చాలానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్టార్ హీరోల సినిమాల నుంచి మిడ్ రేంజ్ హీరోల సినిమాల వరకు అన్నీ పరవాలేదనే టాక్ ని అయితే సంపాదించుకున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా స్టామినా ఏంటో ప్రేక్షకులకు ఏ సినిమా నచ్చింది అనేది ఈపాటికే అందరికి ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇక ఈరోజు నుంచి వర్కింగ్ డేస్ కావడంతో అసలు లెక్కలు మొదలవుతున్నాయి.
ఈరోజు కంప్లీట్ అయ్యాక ఈ సంక్రాంతి అసలు విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఇప్పటివరకు అత్యధిక పాజిటివ్ టాక్ ఏ సినిమా సంపాదించుకుందో ఆ సినిమాకు ఎక్కువ థియేటర్స్ ను కేటాయించుకున్నారట డిస్ట్రిబ్యూటర్లు . ప్రస్తుతానికైతే మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేస్తున్నారట. దీనితో ఈరోజు నుంచి ఈ సినిమాకు ఎక్స్ట్రా స్క్రీన్స్ ను యాడ్ చేస్తున్నారు. ఇక శర్వానంద్ నారి నారి నడుమ మురారికి ఈసారి టాక్ బాగానే వచినా .. సరిపడా స్క్రీన్స్ లేకపోవడంతో సంక్రాంతి క్రేజ్ ను ఎక్కువగా క్యాష్ చేసుకోలేకపోయింది. ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి కాబట్టి.. ఈ సినిమాకు స్క్రీన్స్ పెరిగే అవకాశం ఉంది.
ఈ రెండు ఇలా ఉంటె డివైడ్ టాక్ వచ్చిన సినిమాలకు అసలైన కష్టం మొదలైంది. ఈరోజు నుంచి వీటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇలా సంక్రాంతి సినిమాలు క్రేజ్ కు ఎండ్ కార్డ్ పడినట్టే.. సెలవలు అయిపోయాయి కాబట్టి ఇక సినిమాలను కాపాడాల్సింది ఆ సినిమాలోని కంటెంట్ ఏ. ఇంకో రెండు మూడు రోజుల్లో సంక్రాంతి విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.