iDreamPost
android-app
ios-app

బేబమ్మ దారిలో శ్రీలీల… వార్నింగ్ ఇస్తున్న ఫ్యాన్స్‌

  • Published Dec 06, 2023 | 1:07 PM Updated Updated Dec 06, 2023 | 3:12 PM

పెళ్లి సందడి సినిమాతో తెలుగు లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రీలీల ధమాకా సినిమాతో హిట్ కొట్టింది. హీరోయిన్‌ గా ధమాకా సినిమా తప్ప మరే సినిమా కూడా శ్రీ లీలకు హిట్ ను తెచ్చి పెట్టలేదు. ముందు ముందు రాబోతున్న సినిమాలైనా శ్రీలీలకు హిట్‌ అందిస్తాయా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పెళ్లి సందడి సినిమాతో తెలుగు లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రీలీల ధమాకా సినిమాతో హిట్ కొట్టింది. హీరోయిన్‌ గా ధమాకా సినిమా తప్ప మరే సినిమా కూడా శ్రీ లీలకు హిట్ ను తెచ్చి పెట్టలేదు. ముందు ముందు రాబోతున్న సినిమాలైనా శ్రీలీలకు హిట్‌ అందిస్తాయా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  • Published Dec 06, 2023 | 1:07 PMUpdated Dec 06, 2023 | 3:12 PM
బేబమ్మ దారిలో శ్రీలీల… వార్నింగ్ ఇస్తున్న ఫ్యాన్స్‌

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి ఉప్పెన సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది కృతి శెట్టి. టాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే సూపర్‌ హిట్ దక్కించుకుని స్టార్‌ డమ్‌ ను సొంతం చేసుకుంది. ఉప్పెన వల్ల వచ్చిన క్రేజ్‌తో ఆమె వరుస సినిమాల్లో నటించే ఛాన్స్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. కృతి శెట్టి వచ్చిన ప్రతి ఆఫర్‌ని కాదనకుండా కమిట్ అవ్వడంతో ఎలాగైతే వరుస హిట్స్ పడ్డాయో.. అదే మాదిరిగా వరుస ఫ్లాప్స్ పడ్డాయి.

దీంతో ఒక్కసారిగా ఆమె డౌన్ ఫాల్‌ షురూ అయ్యింది. టాలీవుడ్‌ లో ప్రస్తుతం కృతి శెట్టి చేస్తున్న సినిమాలు ఏంటి అంటే వెంటనే చెప్పలేని పరిస్థితి నెలకొంది. కృతి శెట్టి చేసిన తప్పిదమే ఇప్పుడు శ్రీలీల కూడా చేస్తుంది అంటూ ఆమె ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీల జోరు కంటిన్యూ అవ్వాలంటే కాస్త జాగ్రత్తలు అవసరం.

పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు శ్రీలీల పరిచయం అయింది. రాఘవేంద్ర రావు హీరోయిన్‌ అంటూ ముద్ర పడటంతో మొదటి సినిమా నిరాశ పరిచినా కూడా ఈమెకు ఆఫర్లు దక్కాయి. ధమాకా సినిమాతో శ్రీలీల మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. టాలీవుడ్‌ లో శ్రీలీలకి ఇప్పటి వరకు హీరోయిన్‌ గా దక్కిన ఒకే ఒక్క విజయం ధమాకా. ఆ సినిమా సక్సెస్‌ మరియు అందం అభినయం ఇంకా అదృష్టం కలిసి రావడంతో అర డజను తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలను ఈ అమ్మడు దక్కించుకుంది.

రామ్‌ తో నటించిన స్కంద సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత భగవంత్‌ కేసరి సినిమా తో వచ్చింది. ఆ సినిమా విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా అందులో హీరోయిన్‌ పాత్ర కాదనే విషయం తెల్సిందే. ఆ మధ్య మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ తో కలిసి ఆదికేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో ఫ్లాప్‌ ను మూట కట్టుకుంది. స్కంద, ఆదికేశవ సినిమాలు ఫ్లాప్‌ అవ్వడంతో శ్రీలీల ఈ వారం రాబోతున్న ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది.

నితిన్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిట్‌ అయ్యేనా అంటూ శ్రీలీల ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు, పవన్‌ కళ్యాణ్ వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్న సమయంలో చిన్న సినిమాల్లో నటించడం అనేది తప్పుడు నిర్ణయం. గుంటూరు కారం సినిమాలో చేస్తున్న ఈ అమ్మడు పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ లో కూడా ఎంపిక అయింది. కాస్త వెయిట్‌ చేసి స్టార్‌ హీరోల సినిమాల్లో, ప్రముఖ దర్శకుల సినిమాల్లో నటిస్తే కెరీర్‌ లో ముందుకు సాగుతావు.

లేదంటే శ్రీలీల మాదిరిగా తక్కువ సమయంలోనే డౌన్ ఫాల్‌ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవ్వడం పట్ల మీ స్పందన ఏంటి? చిన్న హీరోలతో సినిమాలు చేస్తే పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రావని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet