iDreamPost
android-app
ios-app

దేవిశ్రీ డేరింగ్ స్టెప్ ఇది ఎవరు ఊహించి ఉండరు..

  • Published Jan 16, 2026 | 11:06 AM Updated Updated Jan 16, 2026 | 12:04 PM

ఓ సినిమాలో హీరోగా కనిపించాలని చాలామందికి ఉండే ఉంటుంది. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా , కమిడియన్స్ గా వచ్చి హీరోలుగా మారిన వారు చాల మంది ఉన్నారు. కానీ మొదటిసారి ఓ మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా మారుతున్నాడు.

ఓ సినిమాలో హీరోగా కనిపించాలని చాలామందికి ఉండే ఉంటుంది. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా , కమిడియన్స్ గా వచ్చి హీరోలుగా మారిన వారు చాల మంది ఉన్నారు. కానీ మొదటిసారి ఓ మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా మారుతున్నాడు.

  • Published Jan 16, 2026 | 11:06 AMUpdated Jan 16, 2026 | 12:04 PM
దేవిశ్రీ డేరింగ్ స్టెప్ ఇది ఎవరు ఊహించి ఉండరు..

ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ అంటే అందరికి ఓ మ్యూజిక్ డైరెక్టర్ గానే పరిచయం. కానీ సడెన్ గా దేవిశ్రీ ప్రసాద్ ఊహించని షాక్ ఇచ్చాడు. ఓ సినిమాలో హీరోగా కనిపించాలని చాలామందికి ఉండే ఉంటుంది. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా , కమిడియన్స్ గా వచ్చి హీరోలుగా మారిన వారు చాల మంది ఉన్నారు. కానీ మొదటిసారి ఓ మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా మారుతున్నాడు. ఆ మధ్య వేణు డైరెక్షన్ లో నాని ఎల్లమ్మ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ అది ఎందుకో క్యాన్సిల్ అయింది అది కాస్త నితిన్ కు వెళ్లిందని అన్నారు. తర్వాత ఎందుకో అది నితిన్ నుంచి కూడా చేజారిపోయింది. కొంతకాలం ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడుకోలేదు.

అది అలా అలా ఎందరి దగ్గరకు వెళ్లిందో తెలియదు కానీ. చివరికి తెరమీద దేవిశ్రీ కనిపించబోతున్నాడని రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ తో బయటపడింది. ఇది రెండు నెలల క్రితమే లీక్ అయింది కానీ అంతగా వైరల్ అవ్వలేదు. ఇక ఇప్పుడు సంక్రాంతి సందర్బంగా ఎల్లమ్మ మూవీ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. చాలా వరకు విజువల్ ఎఫెక్ట్స్ , ఏఐ మోడ్ లోనే షాట్స్ ను వదిలారు. అక్కడ దేవిశ్రీ సర్ప్రైజ్ చేశారు. టీజర్ ను గమనిస్తే.. పొట్టేలు, గజ్జెల మువ్వలతో శబ్దం చేస్తూ, భుజానికి డప్పు కట్టుకుని, కాలికి రక్తం కారుతున్నా, పరుగులు పెడుతున్న ఓ వ్యక్తి పాదాలను రివీల్ చేస్తూ.. అక్కడ దేవిశ్రీని చూపించారు.

ఈ సినిమాలో దేవిశ్రీ ఓ జానపద కళాకారుడిగా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. సో మొత్తానికి దేవిశ్రీ ప్రసాద్ డేరింగ్ స్టెప్ తీసుకున్నట్లే. ఓ వైపు సంగీత దర్శకుడిగా బిజీగా ఉంటూ.. ఇప్పుడు ఇలా హీరోగా కూడా చేస్తూ రిస్క్ చేస్తున్నాడు దేవిశ్రీ. సో తెరమీద దేవిశ్రీ ఎలా మెప్పిస్తాడు అనేది ఇప్పుడు అందరిలో క్యూరియాసిటీ పెంచింది. అటు దర్శకుడు వేణుకు కూడా ఎల్లమ్మ సినిమా చాలా కీలకం. రా అండ్ రస్టిక్ డ్రామా గా రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో.. ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş