iDreamPost
android-app
ios-app

Nithiin: ‘యానిమల్’ ను ఫాలో అవుతున్న నితిన్.. రిస్క్ చేస్తున్నాడా?

  • Author Soma Sekhar Published - 09:57 PM, Wed - 6 December 23

యానిమల్ మూవీకి సందీప్ రెడ్డి వంగా తీసుకున్న డేరింగ్ స్టెప్ ను 'ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్' మూవీ విషయంలో నితిన్ కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు రిస్క్ తీసుకుంటున్నాడా? అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఆ రిస్క్ ఏంటి?

యానిమల్ మూవీకి సందీప్ రెడ్డి వంగా తీసుకున్న డేరింగ్ స్టెప్ ను 'ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్' మూవీ విషయంలో నితిన్ కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు రిస్క్ తీసుకుంటున్నాడా? అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఆ రిస్క్ ఏంటి?

  • Author Soma Sekhar Published - 09:57 PM, Wed - 6 December 23
Nithiin: ‘యానిమల్’ ను ఫాలో అవుతున్న నితిన్.. రిస్క్ చేస్తున్నాడా?

‘యానిమల్’ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో వసూళ్లను సాధిస్తూ.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాను ఫాలో అవుతున్నట్లున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్’ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నితిన్ కు జోడీగా టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల నటిస్తోంది. అయితే ఈ మూవీ విషయంలో సందీప్ రెడ్డి వంగా తీసుకున్న డేరింగ్ స్టెప్ ను నితిన్ కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు రిస్క్ తీసుకుంటున్నాడా? అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరి ఇంతకీ నితిన్ తీసుకునే ఆ రిస్క్ ఏంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ స్టార్ రైటర్ వక్కంతం వంశీ మరోసారి మెగాఫోన్ పట్టుకున్నారు. ఫస్ట్ మూవీ అల్లు అర్జున్ తో తీసి.. డైరెక్టర్ గా మంచి మార్కులే కొట్టేశాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. అతడి టేకింగ్ కు మాత్రం ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని నితిన్ హీరోగా ‘ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్’ అనే మూవీతో డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ చిత్రంలో నితిన్ కు జోడీగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. షూటింగ్ మెుత్తం పూర్తి చేసుకుని తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ రాగా.. రన్ టైమ్ 3 గంటల 36 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే నితిన్ ఫ్యాన్స్ కు నిద్రపట్టనివ్వట్లేదు. ఇంత సమయం ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టడం అంటే మాటలు కాదు.

అయితే ఈ విషయంలో నితిన్ యానిమల్ మూవీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా కూడా 3 గంటల 21నిమిషాల నిడివి ఉంది. సందీప్ రెడ్డి వంగా టేకింగ్, రణ్ బీర్ కపూర్ యాక్టింగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వన్నీ ప్రేక్షకులను పిచ్చెక్కించాయి. దీంతో మూవీ లవర్స్ రన్ టైమ్ ను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు నితిన్ కూడా సందీప్ లాగే డేరింగ్ స్టెప్ వేస్తున్నాడు. అయితే ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ మూవీ పూర్తిగా అవుటండ్ అవుట్ కామెడీ మూవీ. వక్కంతం వంశీ స్ట్రాటజీ వర్కౌట్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అందులో నో డౌట్. కానీ ఏ మాత్రం తేడా కొట్టినా.. భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. కానీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించిన వక్కంతం వంశీ పెన్నును ఇక్కడ తక్కువ అంచనా వేయలేం. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో మూవీ యూనిట్ డేర్ చేసి.. రిస్క్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో నితిన్ రిస్క్ చేస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio