iDreamPost
android-app
ios-app

Mahesh Babu: శ్రీలీలపై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ విషయంలో హీరోలకు తాట ఊడిపోద్దంటూ..!

  • Published Jan 09, 2024 | 10:17 PM Updated Updated Jan 09, 2024 | 10:17 PM

గుంటూరులో జరిగిన 'గుంటూరు కారం' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తనదైన మాటలతో నవ్వులు పూయించాడు సూపర్ స్టార్ మహేష్. హీరోయిన్ శ్రీలీలను పొగుడుతూనే సరదాగా ఓ ఆటాడుకున్నాడు.

గుంటూరులో జరిగిన 'గుంటూరు కారం' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తనదైన మాటలతో నవ్వులు పూయించాడు సూపర్ స్టార్ మహేష్. హీరోయిన్ శ్రీలీలను పొగుడుతూనే సరదాగా ఓ ఆటాడుకున్నాడు.

Mahesh Babu: శ్రీలీలపై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ విషయంలో హీరోలకు తాట ఊడిపోద్దంటూ..!

సూపర్ స్టార్ మహేష్ బాబు.. సినిమా ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో కనిపించడం చాలా అరుదు. తన సినిమాలకు సంబంధించిన వేడుకల్లో పాల్గొని, తనదైన స్పీచ్ తో అలరిస్తుంటాడు ప్రిన్స్. ఇక తన మాటల్లో ఉండే చమత్కారంతో స్టేజిపై నవ్వులు పూయిస్తాడు ఈ బుర్రిపాలెం బుల్లోడు. తాజాగా గుంటూరులో జరిగిన ‘గుంటూరు కారం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సైతం తనదైన మాటలతో నవ్వులు పూయించాడు. హీరోయిన్ శ్రీలీలను పొగుడుతూనే ఓ ఆటాడుకున్నాడు మహేష్.

‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ స్పీచ్ హైలెట్ అని చెప్పాలి. సాధారణంగా డైరెక్టర్ త్రివిక్రమ్ ఉంటే.. అక్కడ ఆయన స్పీచ్ అట్రాక్షన్ అవుతూ ఉంటుంది. కానీ ఈ వేడుకలో గురూజీ తక్కువ మాటలు మాట్లాడి ముగించారు. ఆ తర్వాత మాట్లాడిన మహేష్ అభిమానులు అలరించాడు. ఈ క్రమంలోనే హీరోయిన్ శ్రీలీల గురించి మాట్లాడుతూ.. స్టేజిపై నవ్వులు పూయించాడు.”శ్రీలీల నిన్ను మర్చిపోలేదు. నీ దగ్గరకే వస్తున్నా. ఒక తెలుగు అమ్మాయి ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ లో తన షాట్ ఉన్నా, లేకున్నా కూడా క్యారవ్యాన్ లోకి వెళ్లదు. అక్కడే ఉండి అంతా చూస్తుంటుంది. ఇక నేను పని చేసిన వన్ ఆఫ్ ది డెడికేటెడ్ హీరోయిన్ శ్రీలీల. ఆమె డ్యాన్స్ గురించి చెప్పాలంటే.. ఈ అమ్మాయితో డ్యాన్స్ చేయడం చాలా కష్టం.. అదేం డ్యాన్స్.. ఆమెతో డ్యాన్స్ చేయాలంటే హీరోలందరికి తాట ఊడిపోద్ది” అంటూ చెప్పుకొచ్చాడు మహేష్. ఇక ఈ మాటలకు స్టేజిపై ఉన్న అందరూ నవ్వులు చిందించారు.

ఇక మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి కూడా సూపర్ స్టార్ చెప్పుకొచ్చారు. మూవీలో కీ రోల్ చేసిందని, ఆ పాత్రకు ఆమె న్యాయం చేసిందని పేర్కొన్నాడు. కాగా.. జనవరి 12న వరల్డ్ వైడ్ గా గుంటూరు కారం మూవీ రిలీజ్ అవ్వబోతోంది. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీగా హైప్ ను పెంచాయి. తమన్ ఇచ్చిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా మారాయి. ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టాడు మహేష్. ఇక సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో వేచిచూడాలి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/