iDreamPost
android-app
ios-app

విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీ నుంచి శ్రీలీల ఔట్? కారణం అదేనా!

  • Published Jan 19, 2024 | 9:49 PM Updated Updated Jan 19, 2024 | 9:49 PM

ఈ మద్య కాలంలో ఒక సినిమా ముహూర్తం మొదలు ధియేటర్లో రిలీజ్ అయ్యే వరకు రక రకాల రూమర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. దీంతో చిత్ర యూనిట్ ఇదంతా పుకార్లు.. అసలు విషయం ఇదీ అని చెప్పాల్సి వస్తుంది.

ఈ మద్య కాలంలో ఒక సినిమా ముహూర్తం మొదలు ధియేటర్లో రిలీజ్ అయ్యే వరకు రక రకాల రూమర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. దీంతో చిత్ర యూనిట్ ఇదంతా పుకార్లు.. అసలు విషయం ఇదీ అని చెప్పాల్సి వస్తుంది.

  • Published Jan 19, 2024 | 9:49 PMUpdated Jan 19, 2024 | 9:49 PM
విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీ నుంచి శ్రీలీల ఔట్? కారణం అదేనా!

ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు, వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు సంబంధించిన న్యూస్ లు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. నటీనటులు, దర్శక, నిర్మాతలు, సినిమా అప్‌డేట్స్, రిలీజింగ్ తేదీలకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత వచ్చే సినిమాలపై నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీపై ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు #VD12 పేరుతో ఈ మూవీ ప్రచారంలో కొనసాగుతుంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగి ఇప్పటికీ ఎనిమిది నెలలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క విషయం క్లారిటీగా అప్ డేట్ చేయలేకపోయింది చిత్ర యూనిట్. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ క్యాన్సిల్ అయ్యిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఈ రూమర్లపై టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ బిజీగా ఉననారని.. అది పూర్తయ్యాకమార్చిలో ఈ మూవీ షూటింగ్ మొదలు కావొచ్చని క్లారిటీ ఇచ్చారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై ఈ చిత్రం రానుంది.. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోయే ఈ మూవీలో విజయ్ దేవరకొండ గూఢాచారి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన సోషల్ మీడియాలో మరో కొత్త వార్త చక్కర్లు కొడుతుంది. మొన్నటి వరకు ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా శ్రీలీల ప్లేస్ లో యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రి, రుక్మిణి వసంత్ లను హీరోయిన్లుగా తీసుకుంటున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల శ్రీలీల వరుస డిజాస్టర్స్ తో ఇబ్బంది పడుతుంది.. ఈ ఎఫెక్ట్ వల్లనే ఆమెను తప్పించి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş