Swetha
ఎప్పుడు లేనట్టుగా ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందరికంటే ముందు రాజాసాబ్ వచ్చాడు కానీ మరీ అందరు అంచనాలు పెట్టుకున్న రేంజ్ లో టాక్ అయితే రాలేదు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం కనుల పండుగ అని చెప్పొచ్చు.
ఎప్పుడు లేనట్టుగా ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందరికంటే ముందు రాజాసాబ్ వచ్చాడు కానీ మరీ అందరు అంచనాలు పెట్టుకున్న రేంజ్ లో టాక్ అయితే రాలేదు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం కనుల పండుగ అని చెప్పొచ్చు.
Swetha
ఎప్పుడు లేనట్టుగా ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందరికంటే ముందు రాజాసాబ్ వచ్చాడు కానీ మరీ అందరు అంచనాలు పెట్టుకున్న రేంజ్ లో టాక్ అయితే రాలేదు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం కనుల పండుగ అని చెప్పొచ్చు. ఇక కాస్త గ్యాప్ తో మన శంకర వరప్రసాద్ గారు వచ్చారు. వింటేజ్ చిరు ఫ్యాన్స్ అంతా ఏకమయ్యి మరీ సినిమాను హిట్ చేశారు. సోషల్ మీడియాలో దీని గురించి ఎలాంటి టాక్ నడుస్తుందో తెలియనిది కాదు.
ఇక శర్వానంద్ , రవితేజ ఈసారి కూడా గట్టక్కనట్టే. సినిమాల ట్రైలర్ లు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసాయి కానీ థియేటర్లో బొమ్మ పడిన తర్వాత మాత్రం విజిల్స్ వేయించలేక పోయాయి. నవీన్ పోలిశెట్టి మాత్రం ఈసారి కూడా అదరగొట్టేసాడు. ఇంకా ఈ వీకెండ్ కంప్లీట్ అయితే లెక్కల వివరాలు బయటకు వస్తాయి. ఇక ఈ సినిమాల ఓటిటి ల వివరాల విషయానికొస్తే… వీటిలో ఓ రెండు సినిమాలు మాత్రం ఒకటే ఓటిటి లో రానున్నాయి. ప్రభాస్ నటించిన రాజాసాబ్ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందనే టాక్ వినిపిస్తుంది.
ఇక శంకర వరప్రసాద్ గారు అలాగే రవితేజ భర్త మహాసేయులకు విజ్ఞప్తి ఈ రెండు సినిమాలు కూడా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జీ 5 లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ సినిమాలను వాలెంటైన్స్ డే సందర్బంగా రిలీజ్ చేయనున్నారట. అటు శర్వానంద్ నారి నారి నడుమ మురారి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. నాలుగు వారాల తర్వాత ఎప్పుడైనా ఈ సినిమా ఓటిటి లోకి రావొచ్చు. ఇక ఫైనల్ గా నవీన్ పోలిశెట్టి అనగనగ ఓ రాజు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇది ఫిబ్రవరి మూడో వారంలో ఓటిటి లోకి వచ్చే అవకాశం ఉందట. త్వరలోనే వీటి స్ట్రీమింగ్ డేట్స్ గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.