iDreamPost
android-app
ios-app

అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగా.. శ్రీలీల, కృతిశెట్టిలా నేనూ చేయాల్సింది: ఇనయా సుల్తానా

  • Author Soma Sekhar Published - 04:50 PM, Thu - 9 November 23

సినిమా ఛాన్స్ ల కోసం ఎన్నో ఆఫీస్ ల చుట్టూ తిరిగానని.. అయితే శ్రీలీల, కృతిశెట్టి చేసిన పని నేనుకూడా చేసి ఉంటే.. ఇప్పుడు నా రేంజ్ వేరే లెవల్లో ఉండేదని చెప్పుకొచ్చింది బిగ్ బాస్ సీజన్ 6 బ్యూటీ ఇనయా సుల్తానా.

సినిమా ఛాన్స్ ల కోసం ఎన్నో ఆఫీస్ ల చుట్టూ తిరిగానని.. అయితే శ్రీలీల, కృతిశెట్టి చేసిన పని నేనుకూడా చేసి ఉంటే.. ఇప్పుడు నా రేంజ్ వేరే లెవల్లో ఉండేదని చెప్పుకొచ్చింది బిగ్ బాస్ సీజన్ 6 బ్యూటీ ఇనయా సుల్తానా.

  • Author Soma Sekhar Published - 04:50 PM, Thu - 9 November 23
అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగా.. శ్రీలీల, కృతిశెట్టిలా నేనూ చేయాల్సింది: ఇనయా సుల్తానా

ఇండస్ట్రీలోకి ఎంతో మంది యువతీ యువకులు తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి వస్తూ ఉంటారు. అయితే ఇలా వచ్చే వారిలో కొందరికి మాత్రమే పరిశ్రమ ఛాన్స్ లు ఇస్తుంది. వారి ప్రతిభను, అందాన్ని, నటన ఆధారంగా వారికి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఇక కొంత మంది నటీ, నటులకు అందం, అభినయం, టాలెంట్ అన్నీ ఉన్నా.. అవకాశాలు మాత్రం అనుకున్నంత మేరరావు. ప్రస్తుతం తన పరిస్థితి ఇలాగే ఉందంటూ చెప్పుకొచ్చింది బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా. RGV వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ప్రతీ ఒక్కరికి సుపరిచితురాలే. తన గ్లామర్ వీడియోలు, ఫొటోలతో సోషల్ మీడియాలో రచ్చ లేపుతూ ఉంటుంది ఇనయా. కాగా.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అవకాశాల కోసం ఎన్నో ఆఫీస్ ల చుట్టూ, నిర్మాతల చుట్టూ తిరిగానని కానీ అవకాశాలు మాత్రం రాలేదని చెప్పుకొచ్చింది. తాను కూడా శ్రీలీల, కృతిశెట్టిలా చేయాల్సిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇనయా సుల్తానా.. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ వీడియోలను, ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ.. వారి గుండెలను గిల్లుతూ ఉంటుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 6లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. హౌస్ లో ఉన్నప్పుడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆమెకు సపోర్ట్ చేసి.. ఆమె రేంజ్ ను పెంచిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక ఆమెకు అవకాశాలు క్యూ కడతాయని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. బిగ్ బాస్ నుంచి వచ్చాక అవకాశాల సినిమా అవకాశాల కోసం ఆఫీస్ ల చుట్టూ.. నిర్మాతల చుట్టూ తిరిగానని కానీ ఛాన్స్ లు మాత్రం రాలేదని చెప్పుకొచ్చింది.

ఓ ఇంటర్వ్యూలో ఇనయా సుల్తానా మాట్లాడుతూ..”ఇండస్ట్రీలో 16-17 ఏళ్లకే అమ్మాయిలు స్టార్ హీరోయిన్లుగా ఎదిగిపోతున్నారు. ఇలాంటి వారిలో శ్రీలీల, కృతిశెట్టి ఉన్నారు. వారు టీనేజ్ లోనే హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. కానీ నేను 22 సంవత్సరాలకు ఇండస్ట్రీలోకి వచ్చాను. వాళ్లతో పోలిస్తే దాదాపు 7 ఏళ్లు టైమ్ వేస్ట్ చేసుకున్నాను. నేనూ కూడా వాళ్లలా చేస్తే.. ఇప్పుడు మరో స్థాయిలో ఉండేదాన్నేమో? అయితే ఇప్పడు ఈ విషయాల గురించి ఆలోచించి నా సమయాన్ని వృథా చేసుకోదలచుకోలేదు. అందుకే లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నా” అంటూ చెప్పుకొచ్చింది ఇనయా సుల్తానా. ఇప్పుడున్న కాలంలో మనం 60 సంవత్సరాలు బతకడమే కష్టం.. ప్రస్తుతం నా ఏజ్ 25, మహా అయితే నేను ఇంకో 25 ఏళ్లు బతుకుతాను, అందుకే లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాను అని తెలిపింది ఇనయా. ప్రస్తుతం డైరెక్టర్లు ఆఫర్లు ఇస్తున్నారని పేర్కొంది. మరి ఇనయా సుల్తానా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/