iDreamPost
android-app
ios-app

స్కంద OTT స్ట్రీమింగ్ వాయిదా! కారణం ఏంటంటే?

  • Author Soma Sekhar Updated - 11:32 PM, Thu - 2 November 23

రామ్ పోతినేని అభిమానులకు ఇది ఓ బ్యాడ్ న్యూసనే చెప్పాలి. స్కంద ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా పడినట్లు సమాచారం. ఈ ఊరమాస్ యాక్షన్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి వాయిదాకు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రామ్ పోతినేని అభిమానులకు ఇది ఓ బ్యాడ్ న్యూసనే చెప్పాలి. స్కంద ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా పడినట్లు సమాచారం. ఈ ఊరమాస్ యాక్షన్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి వాయిదాకు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Updated - 11:32 PM, Thu - 2 November 23
స్కంద OTT స్ట్రీమింగ్ వాయిదా! కారణం ఏంటంటే?

రామ్ పోతినేని-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఊర మాస్ యాక్షన్ మూవీ ‘స్కంద’. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల రామ్ కు జతగా నటించింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్కంద థియేటర్ల దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ల పరంగా పర్వాలేదనిపించిన రామ్.. మాస్ ప్రేక్షకులను మాత్రం మెస్మరైజ్ చేశాడు. బోయపాటి టేకింగ్, రామ్ యాక్షన్ ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చాయి. ఇక థియేటర్లలో సినిమా చూడ్డం మిస్ అయిన అభిమానులు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అక్టోబర్ 27(శుక్రవారం) నుంచి స్కంద మూవీ స్ట్రీమింగ్ అవుతున్నట్లు సమాచారం. కానీ తాజాగా అందుతున్న న్యూస్ ప్రకారం స్కంద ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రామ్ పోతినేని-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఊర మాస్ యాక్షన్ మూవీ’స్కంద’. విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. అక్టోబర్ 27న స్కంద డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వాలి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ కొన్ని అనివార్య కారణాల దృష్ట్య స్కంద ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా పడినట్లు సమాచారం. అయితే ఈ వాయిదాపై ఇప్పటి వరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

ఇక స్కంద స్ట్రీమింగ్ వాయిదాకు కారణం.. టెక్నికల్ ప్రాబ్లెమ్ అని తెలుస్తోంది. ఈ విషయంపై అఫీషియల్ గా సమాచారం లేదు. కాగా.. ఈ విషయం తెలిసిన రామ్ ఫ్యాన్స్ అసంతృప్తికి గురవుతున్నారు. మా హీరో ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఒక అప్డేట్ ఇవ్వండి అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ.. అర్దరాత్రి తర్వాత గాని స్కంద ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ క్లారిటీ రాదు. ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసిన రామ్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూసనే చెప్పాలి. ఇక ఈ మూవీలో రామ్ కు జంటగా శ్రీలీల నటించగా.. సెకండ్ హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ యాక్ట్ చేసింది. శ్రీకాంత్, ప్రిన్స్, దగ్గుబాటి రాజా, ఇంద్రజ, ప్రభాకర్, గౌతమి, శరత్ లోహితస్వ కీలక పాత్రలు పోషించారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabet