iDreamPost
android-app
ios-app

Mokshagna Teja: నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. మోక్షజ్ఞ ఎంట్రీకి మాస్ డైరెక్టర్ ఫిక్స్!

  • Author Soma Sekhar Published - 08:36 PM, Mon - 4 December 23

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఓ మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అతడిని పరిశ్రమకు పరిచయం చేయనున్నాడట. ఆ వివరాలు..

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఓ మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అతడిని పరిశ్రమకు పరిచయం చేయనున్నాడట. ఆ వివరాలు..

  • Author Soma Sekhar Published - 08:36 PM, Mon - 4 December 23
Mokshagna Teja: నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. మోక్షజ్ఞ ఎంట్రీకి మాస్ డైరెక్టర్ ఫిక్స్!

వెండితెరపైకి ఎంతో మంది నటవారసులు ఎంట్రీ ఇచ్చారు.. ఇస్తున్నారు కూడా. ఇక తండ్రి లేదా తల్లి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొందరు తమదైన నటనతో పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక ఇప్పుడు మరో వారసుడు ఇండస్ట్రీకి రాబోతున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. అతడు ఎవరో కాదు.. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. గత రెండేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తొలుత బోయపాటి శ్రీను, జాగర్లమూడి రాధాకృష్ణ లాంటి స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి చేరాడు మాస్ డైరెక్టర్. వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

పూరీ జగన్నాథ్.. టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోలను పూరీలా ఏ డైరెక్టర్ కూడా చూపించలేడిని ఎంతో మంది నటులు మూవీ వేడుకల్లో చెప్పిన విషయం మనకు తెలిసిందే. మాస్, యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా సినిమాలను తెరకెక్కించడంలో పూరీ సిద్ధహస్తుడు. అందుకే చాలా మంది సీనియర్ హీరోలు తమ వారసులను అతడి చేత లాంఛ్ చేయాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ సైతం తన కొడుకు మోక్షజ్ఞను పూరీ డైరెక్షన్ లోనే ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తున్నారట.

పూరీ-బాలయ్య కాంబోలో ‘పైసా వసూల్’ సినిమా రాగా.. అందులో బాలయ్యను డిఫరెంట్ గా చూపించడంలో విజయవంతమైయ్యాడు. మాస్, యూత్ ను ఆకట్టుకునేలా మూవీలు తెరకెక్కించడంలో దిట్ట పూరీ. అందుకే మాస్ సినిమాతోనే మోక్షజ్ఞను పరిశ్రమకు పరిచయం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో మోక్షజ్ఞకు జోడీగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవలే భగవంత్ కేసరి మూవీలో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య ఏర్పడిన బాండింగ్ తోనే ఈ మూవీకి యంగ్ బ్యూటీ ఓకే చెప్పినట్లు ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది.

ఇక ఈ న్యూస్ వైరల్ కావడంతో.. నందమూరి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. పూరీ లాంటి డాషింగ్ డైరెక్టర్ చేతిలో బాలయ్య కొడుకు పడితే.. ఆ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. గత కొంతకాలంగా పూరీ ట్రాక్ రికార్డు ఆందోళనగా ఉంది. ‘లైగర్’ మూవీ డిజాస్టర్ తో ఈ మాస్ డైరెక్టర్ కాస్త నిరాశకు లోనైయ్యాడు. కాగా.. మళ్లీ జోష్ నింపుకొని రామ్ డబుల్ ఇస్మార్ట్ మూవీని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş