iDreamPost
android-app
ios-app

రియల్ రాజాసాబ్ రిటర్న్స్.. ఈరోజు సాయంత్రం నుంచి.. !

  • Published Jan 10, 2026 | 3:23 PM Updated Updated Jan 10, 2026 | 3:23 PM

ట్రైలర్ లో చూపించిన చాలా సీన్స్ సినిమాలో లేవని.. సోషల్ మీడియాలో అభిమానులు , కామన్ ఆడియన్స్ ప్రశ్నల వర్షం కురిపించారు . దీనితో రాజాసాబ్ టీం ఎక్కువ ల్యాగ్ చేయకుండా.. కట్ చేసిన సీన్స్ ను ఈరోజు నుంచే యాడ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసాడు మారుతి

ట్రైలర్ లో చూపించిన చాలా సీన్స్ సినిమాలో లేవని.. సోషల్ మీడియాలో అభిమానులు , కామన్ ఆడియన్స్ ప్రశ్నల వర్షం కురిపించారు . దీనితో రాజాసాబ్ టీం ఎక్కువ ల్యాగ్ చేయకుండా.. కట్ చేసిన సీన్స్ ను ఈరోజు నుంచే యాడ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసాడు మారుతి

  • Published Jan 10, 2026 | 3:23 PMUpdated Jan 10, 2026 | 3:23 PM
రియల్ రాజాసాబ్ రిటర్న్స్.. ఈరోజు సాయంత్రం నుంచి.. !

ఎన్నో ఆశలతో రిలీజ్ అయిన రాజాసాబ్ కు ఊహించని టాక్ ఎదురైంది. ప్రభాస్ అభిమానులైతే ఇది మెప్పించింది కానీ ఇంకా ఎక్కడో సినిమా కామన్ ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. అదేంటో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో మొదటి సినిమా రిలీజ్ చేసినప్పుడు కొన్ని సీన్స్ కానీ ఏదైనా సాంగ్ కానీ కట్ చేసి .. ఓ వారం పది రోజుల తర్వాత ఫ్యాన్స్ డిమాండ్ మేరకో లేదా సినిమాలో ఇంకా ఎదో కొత్తదనం ఉందని చూపించడం కోసమో కట్ చేసిన సీన్స్ ను యాడ్ చేస్తున్నారు. ఒకటి రెండు సినిమాలకు ఇలా జరిగితే బానే ఉంటుంది కానీ.. అన్నిటికి ఇలా జరిగితే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఆఖరికి రాజాసాబ్ కూడా దీని నుంచి తప్పించుకోలేకపోయాడు.

ట్రైలర్ లో చూపించిన చాలా సీన్స్ సినిమాలో లేవని.. సోషల్ మీడియాలో అభిమానులు , కామన్ ఆడియన్స్ ప్రశ్నల వర్షం కురిపించారు . దీనితో రాజాసాబ్ టీం ఎక్కువ ల్యాగ్ చేయకుండా.. కట్ చేసిన సీన్స్ ను ఈరోజు నుంచే యాడ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసాడు మారుతి. రాజాసాబ్ టీం అంతా ఓ సక్సెస్ మీట్ ను ఎరేంజ్ చేసుకుని ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. మొదటి రోజు 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఆశించగా ఏకంగా 112 కోట్ల కలెక్షన్స్ ప్రభాస్ కొల్లగొట్టాడని.. నిర్మాత విశ్వ ప్రసాద్ సక్సెస్ మీట్ లో అనౌన్స్ చేశారు.

సో ఇప్పుడు డార్లింగ్ అభిమానుల డౌట్స్ అన్నీ తీరిపోయాయి. అంతే కాకుండా టికెట్ ధరలు కూడా సోమవారం నుంచి యదావిదిగా ఉండబోతున్నాయని చెప్పుకొచ్చారు. ఆదివారం వరకు మాత్రం ఉన్న ధరలతో అడ్జస్ట్ అవ్వాలని అన్నారు. ఇక ఇప్పుడు చెప్పిన టికెట్ ధరల విషయాలు డిస్ట్రిబ్యూటర్స్ పాటించడమే బ్యాలెన్స్ . ఈ రెండు రోజుల్లో డార్లింగ్ ఎంత రాబట్టలో అంత రాబట్టాల్సిన అవసరం ఉంది. ఎంఎదుకంటే సోమవారం నుంచి కాంపిటీషన్ పెరుగుతుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.