iDreamPost
android-app
ios-app

Meenakshi Chaudhary: ఆ సమయంలో చాలా కంగారు పడ్డా.. కానీ: మీనాక్షి చౌదరి

  • Author Soma Sekhar Published - 08:45 PM, Fri - 8 December 23

గుంటూరు కారంలో లక్కీగా ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ మీనాక్షి చౌదరి ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

గుంటూరు కారంలో లక్కీగా ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ మీనాక్షి చౌదరి ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

  • Author Soma Sekhar Published - 08:45 PM, Fri - 8 December 23
Meenakshi Chaudhary: ఆ సమయంలో చాలా కంగారు పడ్డా.. కానీ: మీనాక్షి చౌదరి

సాధారణంగా నటీ, నటులు షూటింగ్ లో భాగంగా కొన్ని కొన్ని సంఘటనలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఆ టైమ్ లో వారు ఏ విధంగా ఫేస్ చేశారో సందర్భాన్ని బట్టి మూవీ వేడుకలలో, ఇంటర్వ్యూలల్లో తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే గుంటూరు కారంలో లక్కీగా ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ మీనాక్షి చౌదరి ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘గుంటూరు కారం’ ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో శ్రీలీలతో పాటు మరో క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. మహేష్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మహేష్ రియల్ లైఫ్ లోనూ సూపర్ స్టారే అంటూ పొగిడింది. ఈ క్రమంలోనే తన మహేష్ తో తొలిరోజు షూటింగ్ అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.

meenakshi shocking comments

మీనాక్షి చౌదరి మాట్లాడుతూ..”మహేష్ బాబు చాలా స్పెషల్ వ్యక్తిత్వం కలవారు. సెట్ లో ప్రతీ ఒక్కరిని గౌరవిస్తారు. తొలిరోజు షూటింగ్ లో ఫస్ట్ సన్నివేశమే ఆయనతో కావడంతో.. చాలా టెన్షన్ పడ్డాను. అప్పుడు వెంటనే మహేష్ కంగారు పడకండి, కాస్త టైమ్ తీసుకోండి. అంటూ చాలా కూల్ గా మాట్లాడారు” అంటూ చెప్పింది. కాగా.. మహేష్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని, ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించింది మీనాక్షి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. మరి మహేష్ గురించి మీనాక్షి చౌదరి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet