iDreamPost
android-app
ios-app

మా ఇంటి బంగారం మూవీ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే !

  • Published Jan 07, 2026 | 11:33 AM Updated Updated Jan 07, 2026 | 11:33 AM

ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలుగులో సమంత ఓ సినిమా తీసి చాలా కాలం అయింది. మొన్నామధ్యన శుభం అనే సినిమాను ప్రొడ్యూస్ చేయడంతో పాటు.. సినిమాలో ఓ పాత్రలో కూడా నటించి అలరించింది . ఆ తర్వాత సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వార్తల్లో నిలిచింది . ప్రస్తుతం రాజ్ నిడమొరుని పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది సామ్.

  • Published Jan 07, 2026 | 11:33 AMUpdated Jan 07, 2026 | 11:33 AM
మా ఇంటి బంగారం మూవీ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే !

ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలుగులో సమంత ఓ సినిమా తీసి చాలా కాలం అయింది. మొన్నామధ్యన శుభం అనే సినిమాను ప్రొడ్యూస్ చేయడంతో పాటు.. సినిమాలో ఓ పాత్రలో కూడా నటించి అలరించింది . ఆ తర్వాత సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వార్తల్లో నిలిచింది . ప్రస్తుతం రాజ్ నిడమొరుని పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది సామ్. అలాగే అప్పుడెప్పుడో సామ్ తెలుగులో మా ఇంటి బంగారం అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దీని గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు కానీ.. ఇప్పుడు సడెన్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేసి ట్రైలర్ డేట్ ను అనౌన్స్ చేశారు టీమ్.

రీసెంట్ గానే ఈ సినిమాను నందిని రెడ్డితో పట్టాలెక్కించారట. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీ బిజిగా ఉన్నారు టీం. ఇక ఈ సినిమా టీజర్ ను జనవరి 9 న రిలీజ్ చేస్తున్నట్లు ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాను సమంత భర్త రాజ్ నిడుమోరు కథ అందించారు. స్వయంగా సమంతనే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. టైటిల్ ని బట్టే ఇది ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అని అర్దమైపోతుంది. కానీ కథ ఏంటి కథనం ఏంటి అనేది తెలియాలంటే ట్రైలర్ అయినా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. భార్య భర్తలు ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.