iDreamPost
android-app
ios-app

గుంటూరు కారంకు శ్రీలీల టెన్షన్! ఆందోళనలో మహేశ్ ఫ్యాన్స్!

Sreeleela in Guntur Kaaram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబుకు కాంబినేషన్లో రాబోతున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గుంటూరు కారం సినిమాకు శ్రీలీల టెన్షన్ పట్టుకుందనే టాక్ వినిపిస్తోంది.

Sreeleela in Guntur Kaaram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబుకు కాంబినేషన్లో రాబోతున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గుంటూరు కారం సినిమాకు శ్రీలీల టెన్షన్ పట్టుకుందనే టాక్ వినిపిస్తోంది.

గుంటూరు కారంకు శ్రీలీల టెన్షన్! ఆందోళనలో మహేశ్ ఫ్యాన్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తోన్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నారు. ఇక ఈ సినిమాపై మహేష్ ఫ్యాన్ తో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మహేష్ అభిమానులకు ఫుల్ మీల్స్ అందించే విధంగా సినిమాను తెరెకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు కారం మూవీలో శ్రీలీలకు సంబంధించిన ఓ అంశం ఆసక్తిగా మారింది.

కన్నడ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైంది. తొలి సినిమాలోనే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి మార్కులు సంపాదించింది. ఆ సినిమాతో వచ్చిన ఫేమ్ తో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. రవితేజ, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ధమాకా, భగవంత్ కేసరి సినిమాలు సూపర్ హీట్ గా నిలిచాయి. దీంతో ఈ అమ్మడని  లక్కీ హ్యాండ్ గా అందరూ భావించారు.

అయితే ఇటీవల ఈ అమ్మడు నటించిన సినిమాలు ప్లాప్ ను మూటగడుకుంటున్నాయి. స్కంధ, ఆదికేశవ, ఎక్స్ ఆర్డీనరి మ్యాన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. ఇదే  సమయంలో ఈ అమ్మడు మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో నటించింది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తమ హీరో సినిమాకు ఏమైనా ప్రభావం ఉంటుందేమో అని మహేశ్ ఫ్యాన్స్ అందోళన వ్యక్తం చేస్తున్నారని టాక్. వరుస ప్లాప్ లతో ఉన్న శ్రీలీల.. గుంటూరు కారం విషయంలో ఎలా ఉంటుందో అనే టెన్షన్ మహేష్ అభిమానుల్లో ఉంది. అయితే త్రివిక్రమ్ మార్క్, మహేష్ బాబు యాక్టింగ్ తో శ్రీలీల టెన్షన్ పటాపంచలు కావొచ్చని మరికొందరు అభిప్రాయా పడుతున్నారు.

ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కన్నడ భామ శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి నటిస్తోంది. అలానే ఈ సినిమా టైటిల్ తగ్గట్టుగానే మహేష్ లుక్ ఉండడంతో ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ కు కొదవ లేదని ఇట్టే తెలిసిపోతోంది. ఇక.. ఈసినిమాతో అయినా శ్రీలీల ప్లాప్ లకి బ్రేక్ వేస్తుందా, మహేష్ బాబు మ్యానరిజంతో సినిమా సూపర్ హిట్ అందుకుంటుందా?.  ఈ విషయాలు తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. మరి.. శ్రీలీల విషయంలో మహేష్ బాబు అభిమానులు పడుతున్న టెన్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş