iDreamPost
android-app
ios-app

భారీ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న రాజాసాబ్

  • Published Jan 08, 2026 | 12:02 PM Updated Updated Jan 08, 2026 | 12:02 PM

రాజాసాబ్ ప్రీమియర్స్ పడడానికి ఇంకా కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంది. ఎప్పుడెప్పుడు రాజాసాబ్ మూడ్ ని ఎంజాయ్ చేద్దామా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ రాత్రికే ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఏపీలో ప్రీమియర్స్ కు రూ.1000 గా నిర్ణ‌యించారు. అటు సింగిల్ స్క్రీన్ కు రూ.290, మ‌ల్టీప్లెక్స్ రేటు రూ.375 రేట్ ఉంది.

రాజాసాబ్ ప్రీమియర్స్ పడడానికి ఇంకా కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంది. ఎప్పుడెప్పుడు రాజాసాబ్ మూడ్ ని ఎంజాయ్ చేద్దామా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ రాత్రికే ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఏపీలో ప్రీమియర్స్ కు రూ.1000 గా నిర్ణ‌యించారు. అటు సింగిల్ స్క్రీన్ కు రూ.290, మ‌ల్టీప్లెక్స్ రేటు రూ.375 రేట్ ఉంది.

  • Published Jan 08, 2026 | 12:02 PMUpdated Jan 08, 2026 | 12:02 PM
భారీ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న రాజాసాబ్

రాజాసాబ్ ప్రీమియర్స్ పడడానికి ఇంకా కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంది. ఎప్పుడెప్పుడు రాజాసాబ్ మూడ్ ని ఎంజాయ్ చేద్దామా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ రాత్రికే ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఏపీలో ప్రీమియర్స్ కు రూ.1000 గా నిర్ణ‌యించారు. అటు సింగిల్ స్క్రీన్ కు రూ.290, మ‌ల్టీప్లెక్స్ రేటు రూ.375 రేట్ ఉంది. ఈ రేట్స్ ఉన్నప్పుడే భారీ ఓపెనింగ్స్ దక్కితే కనుక ఇక రాజాసాబ్ కు తిరుగుండదు. కచ్చితంగా సినిమాకు పోజిటివ్ టాక్ వస్తుందని అంతా బలంగా నమ్ముతున్నారు. పైగా ఈ మధ్య కాలంలో హర్రర్ కథలకు డిమాండ్ బాగ పెరిగింది . అదీ కాకుండా డార్లింగ్ ఈ హర్రర్ జోనర్ ను టచ్ చేయడం ఇదే మొదటిసారి.. పైగా వింటేజ్ ప్రభాస్ లోని కామిడి యాంగిల్ ను బయటకు తీసాడు మారుతి .

ఇలా ఏ యాంగిల్ లో చూసుకున్నావా రాజాసాబ్ కు కలిసొచ్చేలానే ఉంది. ఇలా రాజాసాబ్ మొదటి రోజు వంద కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్నాడని నిర్మాత టిజి విశ్వప్రసాద్ అనౌన్స్ చేశారు. ప్రభాస్ సినిమాకు ఈ టార్గెట్ అంత పెద్ద మ్యాటర్ ఏమి కాదు. నార్త్ లో వసూళ్లు బాగా వస్తాయని అంత అంటుకున్నారు. సౌత్ లో కూడా వస్తాయిలే కానీ సంక్రాంతి సినిమాల హడావిడి ఉంది కాబట్టి కాస్త తగ్గితే తగ్గొచ్చు. కానీ వీటిలా రాజాసాబ్ ఒక్కటే పాన్ ఇండియా సినిమా. అటు విజయ్ ‘జ‌న నాయ‌కుడు’ కూడా వాయిదా ప‌డింది. సో ఇలా ఎలా చేసుకున్నా రాజాసాబ్ కు కలిసివచ్చే పాయింట్స్ చాలానే ఉన్నాయి.

ఈ సినిమా కోసం దాదాపు రూ.450 కోట్లు ఖ‌ర్చు పెట్టార‌ని ఇన్సైడ్ టాక్. నార్త్ లో కనుక బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంటే ఈజీగా 1000 కోట్లు వచ్చేస్తాయి. సో ఎంతలేదన్నా సినిమాకు లాంగ్ రన్ చాలా అవసరం. ఎదో వీకెండ్ మాత్రమే కాకుండా కనీసం మూడు వారాల పాటైనా సినిమా థియేటర్స్ లో కొనసాగాలి. అలా కనుక కొనసాగితే డార్లింగ్ ఖాతాలో మరో వెయ్యి కోట్ల సినిమా పడడం ఖాయం. ఏమి జరుగుతుందో చూడాలంటే ఇంకా కొద్దీ గంటలు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.