ఓటీటీ పోటీ నుంచి బైటపడేందుకు తెలుగు సినీ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై థియేటర్లో విడుదలైన భారీ సినిమాలను పదివారల తర్వాతే, ఓటీటీకి ఇవ్వాలన్నది తేల్చేసింది. టాలీవుడ్ సమస్యలను పరిష్కరించడానికి ఆగస్ట్ 1 నుంచి షూటింగ్ లను నిలిపివేయాలన్నది నిర్మాతల మండలి నిర్ణయం. అందుకే తెలుగు ఫిల్మ్ చాంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగ్గా, తుది నిర్ణయాన్ని మాత్రం కమిటీకి అప్పగించారు. అంతలోనే సీన్ మారింది. నిర్మాతల మండలే కీలక నిర్ణయాలను ప్రకటించింది. […]
గత నెల 5న థియేటర్లలో భారీగా విడుదలైన బాలీవుడ్ మల్టీ స్టారర్ ‘సూర్యవంశీ’ నిన్న అర్ధరాత్రి నుంచే నెట్ ఫ్లిక్స్ లో ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నెల కూడా పూర్తి కాకుండానే డిజిటల్ కు ఇచ్చేశారు. ముందు రెండు నెలలు లేదా యాభై రోజుల తర్వాత స్ట్రీమింగ్ ఉంటుందన్నారు కానీ అనూహ్యంగా నిర్ణయం మార్చుకోవడం విశేషం. దీనికి హంగామా చేయకుండా కేవలం కొద్దిగంటల ముందే డేట్ ని రివీల్ చేయడం గమనార్హం. మరో ట్విస్ట్ […]