iDreamPost
android-app
ios-app

మలయాళం బెస్ట్ థ్రిల్లర్ ‘కాళరాత్రి’.. ఇప్పుడు తెలుగు OTTలో స్ట్రీమింగ్!

  • Published Aug 17, 2024 | 6:14 AM Updated Updated Aug 17, 2024 | 6:14 AM

Kala Ratri Movie OTT Streaming Details: మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మరో థ్రిల్లర్ వచ్చేసింది. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కానుంది? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Kala Ratri Movie OTT Streaming Details: మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మరో థ్రిల్లర్ వచ్చేసింది. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కానుంది? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 17, 2024 | 6:14 AMUpdated Aug 17, 2024 | 6:14 AM
మలయాళం బెస్ట్ థ్రిల్లర్ ‘కాళరాత్రి’.. ఇప్పుడు తెలుగు OTTలో స్ట్రీమింగ్!

మలయాళ చిత్ర పరిశ్రమ ప్రత్యేకత ఏంటో తెలిసిందే. కమర్షియల్ సినిమాల కంటే ప్రయోగాత్మక చిత్రాలకు అక్కడి మేకర్స్, యాక్టర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. మలయాళ ప్రేక్షకులు కూడా ఎక్స్​పెరిమెంట్ ఫిల్మ్స్​ను బాగా ఇష్టపడుతుంటారు. అదే సమయంలో మట్టి కథలకు కూడా అక్కడ ప్రాధాన్యత ఇస్తారు. అక్కడి ఆడియెన్స్ టేస్ట్​కు తగ్గట్లు డిఫరెంట్ మూవీస్ తీసేందుకు డైరెక్టర్స్ ప్రయత్నిస్తుంటారు. ఈ మధ్య అక్కడ సస్పెన్స్ థ్రిల్లర్స్ కూడా పెరిగాయి. చిన్న పాయింట్​ను తీసుకొని భావోద్వేగాలతో కథ అల్లుకునే అక్కడి మేకర్స్.. సస్పెన్స్ థ్రిల్లర్స్​లోనూ మనుషుల్లో ఉండే వికారాలు, స్వార్థం, దిగజారడాలు లాంటివి బాగా చూపిస్తున్నారు. ఈ కోవలోనే అక్కడి నుంచి ఈ తరహా మరో చిత్రం వచ్చేసింది.

‘నల్ల నిళవుల రాత్రి’ అనే మలయాళ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది జూన్​ ఆఖర్లో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. మిక్స్​డ్ రివ్యూస్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి బాగానే ఆదరణ దక్కింది. మలయాళ మూవీ లవర్స్​ను అలరించిన ఈ ఫిల్మ్ ఇప్పుడు తెలుగు నాట సందడి చేసేందుకు సిద్ధమైంది. గతేడాది రిలీజైన ఈ మూవీని ఇప్పుడు ‘కాళరాత్రి’ పేరుతో తెలుగులోకి తీసుకొస్తున్నారు. నేరుగా ఆహా ఓటీటీలోకి రానుందీ మలయాళ హిట్. కొందరు స్నేహితులు కలసి తక్కువ ధరకే 266 ఎకరాల తోటను కొనేందుకు వెళ్తారు. ఆ తోట మధ్యలో గెస్ట్ హౌస్ ఉండటంతో అక్కడ అందరూ పార్టీ చేసుకుంటారు. అయితే అనూహ్య ఘటనలతో వాళ్లలో ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు.

‘కాళరాత్రి’ ట్రైలర్ చూస్తే ఆ ఫ్రెండ్స్​ను ఎవరో ప్లాన్ చేసి చంపుతున్నట్లు అనిపిస్తోంది. అయితే మధ్యలో స్నేహితుంతా గొడవపడటం, ఒకరి మీద ఒకరు కుట్రలు పన్నడం, దాడులకు దిగడం కూడా చూడొచ్చు. హత్యకు నువ్వు కారణమంటే.. నువ్వు కారణమంటూ ఒకర్ని ఒకరు సందేహించడం కూడా చూడొచ్చు. ఒకవైపు సస్పెన్స్​తో భయపెడుతూనే మరోవైపు స్నేహితుల మధ్య ఉండే అనుబంధం, స్వార్థం చూపించడం, కొట్లాడుకోవడం లాంటివన్నీ ఇందులో చూడొచ్చు. హత్యలకు కారణం ఎవరు? ఎందుకు చనిపోతున్నారనేది మిగతా స్టోరీ. ఈ ‘కాళరాత్రి’ మూవీ ఆహా ఓటీటీలో ఆగస్టు 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవనుంది. థ్రిల్లర్స్​ను ఇష్టపడే వారికి ఈ వీకెండ్ ఇది మంచి ఆప్షన్ కావొచ్చు. మరి.. ‘కాళరాత్రి’ చూసేందుకు మీరెంత ఆసక్తిగా ఉన్నారో కామెంట్ చేయండి.