iDreamPost
android-app
ios-app

OTTలో క్రేజీ కొరియన్ సిరీస్ జియోంగ్ సియోంగ్ క్రీచర్.. స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం!

OTT Suggestions- Best Korean Series Gyeongseong Creature: ఓటీటీలో మీరు ఒక మంచి కొరియన్ డ్రామా చూడాలి అనుకుంటే మాత్రం మీకు ఇది కరెక్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ సిరీస్ స్టార్ట్ చేస్తే మీరు ఆపడం చాలా కష్టం.

OTT Suggestions- Best Korean Series Gyeongseong Creature: ఓటీటీలో మీరు ఒక మంచి కొరియన్ డ్రామా చూడాలి అనుకుంటే మాత్రం మీకు ఇది కరెక్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ సిరీస్ స్టార్ట్ చేస్తే మీరు ఆపడం చాలా కష్టం.

OTTలో క్రేజీ కొరియన్ సిరీస్ జియోంగ్ సియోంగ్ క్రీచర్.. స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం!

చాలామంది ఓటీటీల్లో సినిమాలు చూస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది డాక్యుమెంటరీలు కూడా చూస్తారు. కానీ, ఎక్కువ మంది వెబ్ సిరీస్లకు అలవాటు పడ్డారు. నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థకు ఇండియాలో అంత మంచి పేరు, ఆదరణ వచ్చింది కూడా వెబ్ సిరీస్ల వల్లే. అలాంటి నెట్ ఫ్లిక్స్ లో మీరు ఒక క్రేజీ వెబ్ సిరీస్ ని మిస్ అయ్యారు. చాలామందికి ఈ సిరీస్ ఒకటి ఉంది అని కూడా తెలియకపోవచ్చు. ఈ కొరియన్ డ్రామాకి ఐఎండీబీలో 7.8/10 రేటింగ్ కూడా ఉంది. నిజానికి మీరు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ని ఇన్ని రోజులు చూడలేదు అనే చెప్పాలి. మరి.. ఆ క్రేజీ వెబ్ సిరీస్ ఏది? ఎందుకు ఆ కొరియన్ సిరీస్ అంత స్పెషల్ అనే విషయాలు చూద్దాం.

కొరియన్ వెబ్ సిరీస్ అన్నప్పుడే దీనికి కనీసం మీరు ఒక 50 మార్కులు వేసుంటారు. ఎందుకంటే కొరియన్ డ్రామాలు ఎప్పుడూ ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేయవు. అందుకే భాష రాకపోయినా కూడా సబ్ టైటిల్స్ పెట్టుకుని తెలుగు ఓటీటీ ప్రేక్షకులు కూడా ఈ కొరియన్ సిరీస్లను తెగ చూసేస్తున్నారు. పైగా ఇది పిరయాడికల్, యాక్షన్, సైంటిఫిక్ ఎలిమెంట్స్ ఉన్న ఒక వెబ్ సిరీస్. ఇప్పటికే మీకు ఈ సిరీస్ పై అంచనాలు భారీగానే వచ్చేసి ఉంటాయి. అయితే ఎన్ని అంచనాలు పెట్టుకున్నా కూడా వాటిని మించే ఈ సిరీస్ ఉంటుంది. ఇందులో ఒక్కో ఎపిసోడ్ గరిష్టంగా 70 నిమిషాల వరకు ఉంటుంది. మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. బాగా ఖాళీగా ఉన్నప్పుడే దీనిని చూడటం స్టార్ట్ చేయండి. ఎందుకంటే స్టార్ట్ చేశాక దీనిని ఆపడం చాలా కష్టం. మొత్తం కంప్లీట్ చేయాల్సిందే.

ఈ సిరీస్ 1945లో కొరియాని జపాన్ పాలిస్తున్న రోజుల్లో జరిగిన కథలా చూపిస్తారు. నిజానికి ఇది నిజంగా జరిగిన ట్రూ ఈవెంట్స్ బేస్డ్ గా చిత్రీకరించిన సిరీస్ అని చెబుతారు. గ్యాంగ్సన్ అనే ఊరిలో ఒక వింత ఆస్పత్రి ఉంటుంది. ఆ హాస్పిటల్ లోకి రోగులు వెళ్లడమే గానీ.. బయటకు రావడం ఉండదు. వెళ్లిన వాళ్లు అసలు ఏమౌతున్నారో కూడా ఎవరికీ తెలియదు. అలాంటి ఆస్పత్రిలోకి హీరో- హీరోయిన్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడకు వెళ్లిన తర్వాత వారికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు అక్కడ ఏం జరుగుతోంది అనే విషయం తెలిసిన తర్వాత వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అసలు వాళ్లు అక్కడికి ఎందుకు వెళ్లారు? అక్కడ అంత ఘోరంగా ఏం జరుగుతోంది? వీళ్లు అసలు ప్రాణాలతో బయటపడ్డారా? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలియాలి అంటే మీరు ఈ ‘జియోంగ్ సియోంగ్ క్రీచర్ (Gyeongseong Creature)’ అనే వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉండవు. కాకపోతే కాస్త భయపెట్టే సీన్స్ వస్తాయి. ఈ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.