iDreamPost
android-app
ios-app

OTTలో మోస్ట్ డిస్టర్బింగ్ డ్రామా వైట్ గర్ల్.. యూత్ చూడాల్సిందే!

OTT Suggestions- Watch Alone Movie White Girl: ఓటీటీలో మీరు చాలా సినిమాలు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక మైండ్ డిస్టర్బింగ్ మూవీ చూసుండరు. ఈ చిత్రాన్ని స్టార్ట్ చేస్తే కాసేపటికే పిచ్చెక్కిపోతారు. ఈ మూవీ పిల్లలతో కలిసి చూసేది అయితే కాదు.

OTT Suggestions- Watch Alone Movie White Girl: ఓటీటీలో మీరు చాలా సినిమాలు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక మైండ్ డిస్టర్బింగ్ మూవీ చూసుండరు. ఈ చిత్రాన్ని స్టార్ట్ చేస్తే కాసేపటికే పిచ్చెక్కిపోతారు. ఈ మూవీ పిల్లలతో కలిసి చూసేది అయితే కాదు.

OTTలో మోస్ట్ డిస్టర్బింగ్ డ్రామా వైట్ గర్ల్.. యూత్ చూడాల్సిందే!

కొన్ని సినిమాలు అరె భలే ఉన్నాయే అనిపిస్తాయి. మరికొన్ని సినిమాలు ఏం తీశారు అనిపిస్తాయి. ఇంకొన్ని సినిమాలు OMG అనిపిస్తాయి. ఇవి మాత్రమే కాకుండా.. ఇంకో కేటగిరీ కూడా ఉంటుంది. వాటిని మైండ్ డిస్టర్బింగ్ సినిమాలు అంటారు. అంటే బాగా తీయరు అని కాదు. ఆ సినిమాలు చూస్తే ఒక పట్టాన మన మైండ్ నుంచి పోవు. ఎక్కువగా ఈ చిత్రాలు సోషల్ బిహేవియర్, సోషల్ హ్యాపనింగ్స్ పైనే ఉంటాయి. అలాంటి ఒక క్రేజీ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ చిత్రాన్ని పిల్లలతో అస్సలు చూడకూడదు. కానీ, యువత మాత్రం కచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఇందులో ఎలా ఉంటే చెడిపోతారు అనే విషయాన్ని స్పష్టంగా చూపించారు.

సాధారణంగా కొన్ని సినిమాల్లో యువత పెడదోవ పట్టేలా సీన్స్ ఉన్నాయి అని ఫిర్యాదు చేస్తూ ఉంటారు. అయితే మీరు అక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ఏం చేస్తే చెడిపోతారు అనే విషయాన్ని సినిమాల్లో స్పష్టంగా చూపిస్తారు. అయితే చాలామంది అసలు విషయాన్ని పక్కన పెట్టి పెడదోవ పట్టించే అంశాలనే తలకెక్కించుకుంటున్నారు. ఈ మూవీలో కూడా అదే చూపించారు. యువత ఎలా చెడిపోతున్నారు? ఒకరి నిర్ణయాలు మరికొంత మంది జీవితాలను ఎలా బలి చేసుకుంటాయి? వంటి అంశాలను సవిరంగా చూపించారు. ముఖ్యంగా ఇప్పుడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాలకు సంబంధించి ఈ సినిమాలో చాలానే కథ ఉంటుంది.

ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె లండన్ వీధుల్లో కొ*న్ కోసం తిరుగుతూ ఉంటుంది. అయితే ఆమెకు ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అతను వచ్చిన తర్వాత ఆమె జీవితమే మారిపోతుంది. ఆమె తాను రంగుల ప్రపంచంలో ఉన్నాను అనుకుంటుంది. కానీ, అధః పాతాళానికి కూరుకుపోతోందని గ్రహించలేదు. ఇందులో ఎక్కువ శాతం కథ మొత్తం మాదక ద్రవ్యాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ మత్తులో ఆమె తన జీవితాన్ని కోల్పోతోంది అనే విషయాన్ని పట్టించుకోదు. మనం ఇప్పుడు తరచూ అలాంటి వార్తలు చాలానే చూస్తున్నాం. యువతి ఈ సినిమా చూస్తే ఎలాంటి పనులు చేయకూడదు.. ఎలాంటి తప్పులు చేయకూడదు.. ఎలా చేస్తే జీవితాలు నాశనం అవుతాయి అనే విషయాలు తెలుస్తాయి. ఈ సినిమా పేరు ‘వైట్ గర్ల్’. ఈ సినిమాలో చాలానే సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెడతాయి. అందుకే ఒంటరిగా చూస్తే మంచిది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.