iDreamPost
android-app
ios-app

OTTలో క్రేజీ సిరీస్ ‘క్లాస్’.. స్టూడెంట్స్ తప్పక చూడాల్సిందే..

  • Published Aug 29, 2024 | 12:45 AM Updated Updated Aug 29, 2024 | 12:45 AM

OTT Suggestions- Best Thriller Class Web Series: ఓటీటీల్లో మీరు ఒక బెస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక క్రేజీ వెబ్ సిరీస్ తీసుకొచ్చాం. ఇది కచ్చితంగా మీకు బుర్రపాడు చేస్తుంది. మరి.. ఆ సిరీస్ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

OTT Suggestions- Best Thriller Class Web Series: ఓటీటీల్లో మీరు ఒక బెస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక క్రేజీ వెబ్ సిరీస్ తీసుకొచ్చాం. ఇది కచ్చితంగా మీకు బుర్రపాడు చేస్తుంది. మరి.. ఆ సిరీస్ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

  • Published Aug 29, 2024 | 12:45 AMUpdated Aug 29, 2024 | 12:45 AM
OTTలో క్రేజీ సిరీస్ ‘క్లాస్’.. స్టూడెంట్స్ తప్పక చూడాల్సిందే..

ఓటీటీలో ఎన్ని వెబ్ సిరీస్లు ఉన్నా కూడా కొన్ని మాత్రమే ఆడియన్స్ నుంచి మంచి మార్కులు అందుకుంటాయి. అయితే అందులోనూ డ్రామా, యాక్షన్, ఎమోషన్ ఇలా చాలానే పాయింట్స్ ఉండాలి అని కోరుకుంటారు. అలాంటి ఎక్స్ పెక్టేషన్స్ మీకు కూడా ఉన్నాయా? అయితే ఈ వెబ్ సిరీస్ మీకోసమే. కథ, ట్విస్టులు అన్నీ నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. ఎక్కడా కూడా మీకు బోర్ కొట్టదు. అంతేకాకుండా.. ఒక్కో ఎపిసోడ్ కి రివీల్ అయ్యే ట్విస్టులు అయితే పిచ్చెక్కించేస్తాయి. ముఖ్యంగా ఇది యూత్ చుట్టూ తిరిగే వెబ్ సిరీస్. స్టూడెంట్స్ లో కూడా క్లాస్, అర్హత, ఎక్కువ, తక్కువలు ఉంటాయా? అనే ప్రశ్న మదిని తొలిచేస్తూ ఉంటుంది. మరి.. ఆ వెబ్ సిరీస్ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

విద్యార్థులు, యువకులు అనగానే సినిమాలు, సిరీస్లు కాస్త క్లాస్ గా.. లవ్ టచ్ తో ఉంటాయి. కానీ, ఈ సిరీస్ మాత్రం అందుకు చాలా భిన్నంగా ఉంటుంది. నిజానికి అసలు స్టూడెంట్స్ ఇలా ఆలోచిస్తారా? ఇంత వైలెంట్ గా ఉంటారా? అనే ప్రశ్నలు మీ మైండ్ లోకి రాకుండా మానవు. చదువుకునే పిల్లలు ఇలా ఎలా ప్రవర్తిస్తారు అని కాస్త మైండ్ డిస్టర్బ్ కూడా అవుతుంది. ఈ సిరీస్ కి ఆయువు పట్టు కథ, నరేషన్ అనే చెప్పాలి. ఒక సిరీస్ ని కదలకుండా చూసేలా చేయాలి అంటే చాలా పకడ్బందీగా ఉండాలి. అది ఈ సిరీస్లో మీకు కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ స్కూల్, అక్కడ జరిగే సినారియోస్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

సాధారణంగా చాలా సినిమాల్లో మీరు ధనిక వర్గం, పేద వర్గం అనే విషయాలను.. వాటి మధ్య తారతమ్యాన్ని చూసే ఉంటారు. ఎప్పుడైనా డబ్బు వెనకాల పరిగెత్తడం, ఒకరిని చూసి వారిలో డాబు పోవాలి అనుకోవడం చేస్తే అనర్థాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. అదే ఈ సిరీస్ లో చాలా బాగా చూపిస్తారు. ముగ్గురు విద్యార్థులు స్కాలర్ షిప్ ద్వారా ఢిల్లీలోనే అత్యంత ధనిక, టాప్ స్కూల్ కి వెళ్తారు. అక్కడ వాళ్ల జీవితాలు మారిపోతాయి అని ఎంతగానో కలలు కని వెళ్తారు. మారడం అయితే నిజమే.. అయితే వాళ్లు ఊహించుకున్నట్లు కాదు దారుణంగా మారిపోతాయి. ఆ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఉండే వాళ్లు ఎవరూ వీళ్లని కనీసం మనుషుల్లా చూడరు. దగ్గరకు రానివ్వరు. ప్రతి విషయంలో ఏడిపిస్తూనే ఉంటారు. ధనిక విద్యార్థులను చూసి వీళ్లు కూడా వారిలా ప్రవర్తించాలని ప్రయత్నించి భంగ పడతారు. అలాగే వాళ్లలో ఒక అమ్మాయితో ఏర్పడిన పరిచయం చాలానే మలుపులు తిరుగుతుంది. ఈ సిరీస్ పేరు ‘క్లాస్’. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet