iDreamPost
android-app
ios-app

OTTలో క్రేజీ థ్రిల్లర్ ‘క్యామ్’.. సున్నితంగా ఉండే వాళ్లు అస్సలు చూడొద్దు..

  • Published Aug 26, 2024 | 5:30 AM Updated Updated Aug 26, 2024 | 5:30 AM

OTT Suggestions- Watch Alone Movie Cam: ఓటీటీల్లో మీరు చాలానే థ్రిల్లర్స్ చూసుంటారు. చాలానే హారర్ సినిమాలు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక క్రేజీ హారర్ థ్రిల్లర్ ని మాత్రం అస్సలు చూసుండరు.

OTT Suggestions- Watch Alone Movie Cam: ఓటీటీల్లో మీరు చాలానే థ్రిల్లర్స్ చూసుంటారు. చాలానే హారర్ సినిమాలు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక క్రేజీ హారర్ థ్రిల్లర్ ని మాత్రం అస్సలు చూసుండరు.

  • Published Aug 26, 2024 | 5:30 AMUpdated Aug 26, 2024 | 5:30 AM
OTTలో క్రేజీ థ్రిల్లర్ ‘క్యామ్’.. సున్నితంగా ఉండే వాళ్లు అస్సలు చూడొద్దు..

ఓటీటీలో మీరు ఇప్పటివరకు చాలానే థ్రిల్లర్స్ చూసుంటారు. అలాగే హారర్ చిత్రాలు కూడా చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక క్రేజీ హారర్ థ్రిల్లర్ మాత్రం అస్సలు చూసుండరు. ఈ సినిమా స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం. కథలో కాస్త బో* సన్నివేశాలు ఎక్కువే ఉంటాయి. కానీ, కాన్సెప్ట్ మాత్రం అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే కథ, గ్రిప్పింగ్ నరేషన్ అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. ఒక విధంగా ఈ సినిమా ది బెస్ట్ హారర్ థ్రిల్లర్ అని కూడా చెప్పచ్చు. హారర్ అంటే దెయ్యాలు ఉండి భయపెట్టేది అని కాదు. ఇది వైలెన్స్ తో భయపెట్టే హారర్ చిత్రం. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

సాధారణంగా హారర్ చిత్రాలు చూసే వారికి కూడా ఈ థ్రిల్లర్ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ఈ సినిమా మనల్ని ఒకరంగా కంగారు కూడా పెట్టేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ వల్ల మనకు కూడా ఇలాంటివి జరిగే ప్రమాదం ఉంది. అంటే ఒకరి ఐడెంటిటీని కాజేయడం. ఏఐ వచ్చిన తర్వాత చాలామంది చెప్పిన కంప్లైయింట్ ఇదే. ఈ సినిమాలో కూడా అలాంటి తరహా ఘటనలనే చూపించారు. అయితే ఈ సినిమా కాస్త్ బో*గా ఉంటుంది. ఇందులో హీరోయిన్ ఒక క్యామ్ గర్ల్ గా చేస్తుంది. తనకు ఎంతో మంది ఫాలోవర్స్ కూడా ఉంటారు. రోజూ వింత వింత ఘటనలు, పనులతో తన ఫాలోవర్స్ ని అలరిస్తూ ఉంటుంది. అలాగే తన యూజర్స్ అడిగిన క్రేజీ విషయాలను కూడా చేసి చూపిస్తూ ఉంటుంది.

తనకు చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఫాలోవర్స్ వచ్చేస్తారు. అలాగే తన వీడియోలకు మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది. అయితే ఒకరోజు నిద్రలేచి చూసేసరికి తన అకౌంట్ లాక్ అయిపోయి ఉంటుంది. తన అకౌంట్ ని వేరే వాళ్లు యాక్సెస్ చేసి ఉంటారు. తన అకౌంట్లో లైవ్ వీడియో కూడా నడుస్తూ ఉంటుంది. కొన్నిరోజులకు ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే.. ఆ అకౌంట్ ని ఎవరో అచ్చు తనలా ఉన్న వాళ్లే హ్యాండిల్ చేస్తున్నారు.

అంతేకాదు.. ఆమెకన్నా కూడా బాగా యూజర్స్ ని ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్న హీరోయిన్ ఎలాగైనా తన అకౌంట్ ని వెనక్కి తెచ్చుకోవాలి అనుకుంటుంది. అంతేకాకుండా.. అలా చేసిన వారికి బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. మరి.. తను అనుకున్నది జరిగిందా? అసలు తన అకౌంట్ ని ఎవరు లాగేసుకున్నారు అనే విషయాలు తెలియాలి అంటే మీరు ఈ ‘క్యామ్’ అనే సినిమాని నెట్ ఫ్లిక్స్ లో చూడాల్సిందే. కానీ, సినిమా కాస్త బో*గానే ఉంటుంది. కాబట్టి ఒంటరిగా చూస్తే బెటర్. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibombetcio girişiptv satın al