iDreamPost
android-app
ios-app

OTTలో క్రేజీ థ్రిల్లర్ ‘లేడీ వోయర్’.. పక్కింట్లోకి తొంగి చూస్తే ఇలాగే ఉంటుంది!

  • Published Aug 24, 2024 | 2:30 AM Updated Updated Aug 24, 2024 | 7:08 AM

OTT Suggestions- Watch Alone Movie Lady Voyeurs: ఓటీటీలో చాలానే క్రేజీ థ్రిల్లర్స్ ఉంటాయి. వాటి నుంచి ఒక సరైన థ్రిల్లింగ్ సిరీస్ ని మీకోసం తీసుకొచ్చాం.

OTT Suggestions- Watch Alone Movie Lady Voyeurs: ఓటీటీలో చాలానే క్రేజీ థ్రిల్లర్స్ ఉంటాయి. వాటి నుంచి ఒక సరైన థ్రిల్లింగ్ సిరీస్ ని మీకోసం తీసుకొచ్చాం.

  • Published Aug 24, 2024 | 2:30 AMUpdated Aug 24, 2024 | 7:08 AM
OTTలో క్రేజీ థ్రిల్లర్ ‘లేడీ వోయర్’.. పక్కింట్లోకి తొంగి చూస్తే ఇలాగే ఉంటుంది!

ఓటీటీలో లెక్కకు మించిన క్రేజీ థ్రిల్లర్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని అయితే మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెట్టేస్తాయి. అలాంటి థ్రిల్లర్స్ చూస్తే రెండ్రోజుల వరకు మైండ్ లో నుంచి పోదు. అందుకే మీకోసం అలాంటి ఒక క్రేజీ థ్రిల్లర్ తీసుకొచ్చాం. ఇందులో ఉండే స్టోరీ, ట్విస్టులు, గ్రిప్పింగ్ నరేషన్ కి మీరు పిచ్చెక్కిపోతారు. పైగా ఇందులో ఉన్న మోస్ట్ ఎంగేజింగ్ పాయింట్ ఏంటి అంటే.. అందరికి ఉన్న బలహీనత మీదే ఈ సినిమా తీశారు. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ చూస్తుంటే.. అందరికీ ఎవరినీ వాళ్లే చూసుకున్నట్లు ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఆ బలహీనత ఉంది కాబట్టి. అదే అండి పక్కవాళ్ల జీవితాల్లోకి తొంగిచూడటం. అలాంటి ఒక అలవాటు ఉన్న హీరోయిన్ చేసిన తప్పు వల్ల ఆమె జీవితం మొత్తం ప్రమాదంలో పడిపోతుంది. అసలు ఏం జరిగిందో చూద్దాం.

ఏదైనా బెస్ట్ సినిమాలో ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే.. సినిమా చూసినంతసేపు మనల్ని మనం మర్చిపోవాలి. అలాంటి సినిమా కేటగిరీలోకే ఈ సిరీస్ వస్తుంది. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే.. మన అందరికీ ఉన్న వీక్ నెస్. అదే పక్కవాళ్ల జీవితాల్లోకి తొంగిచూడటం, పక్కవాళ్లు ఏం చేస్తున్నారు అని ఒక కన్నేసి ఉంచడం, మనకన్నా కూడా అవతళి వాళ్ల గురించి ఎక్కువ తెలుసుకోవాలి అనుకోవడం.. వంటి అలవాట్లు ఎంత ప్రమాదం అనే విషయాన్ని ఈ సిరీస్ లో స్పష్టంగా చూపించారు. హీరోయిన్ కి అవతలి అపార్ట్మెంట్లో ఉండే అన్నీ ఫ్లాట్స్ లోకి తొంగి చూస్తూ ఉంటుంది. బైనాక్యులర్ తీసుకుని చూస్తూనే ఉంటుంది. అలాగే సీసీ కెమెరాల నుంచి కూడా అందరినీ ఫాలో అవుతూ ఉంటుంది.

కొన్నిరోజుల వరకు అలా పక్క అపార్టుమెంట్లలోకి చూడటం చాలా బాగా అనిపిస్తుంది. కానీ, ఆ తర్వాతే తనకు అసలు కష్టాలు ఎదురవుతాయి. పైకి ఎంతో అందంగా కనిపించే అందరి జీవితాల్లో ఎన్నో చెప్పుకోలేని రహస్యాలు దాగుంటాయి. ప్రతి ఒక్కరికి ఒక డార్క్ సైడ్ ఉంటుంది. అలా తనకు తెలియకుండానే కొందరి గురించి మరీ ఎక్కువ తెలుసుకుంటుంది. అదే ఆమెను చిక్కుల్లోకి నెడుతుంది. అసలు అలా ఎందుకు చూస్తుంది? ఆమెకు అసలు అంత చిక్కులు తెచ్చిన సంఘటన ఏంటి? ఆమెకు నిజంగానే హాని జరిగిందా? ఇలాంటి చాలానే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఈ వెబ్ సిరీస్లో ఉంటాయి. పైగా ఇది కాస్త బో*గా కూడా ఉంటుంది. ఈ సిరీస్ పేరు ‘లేడీ వోయర్(Lady Voyeur)’. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş