iDreamPost
android-app
ios-app

Munjya OTT: 100 కోట్ల హారర్ కామెడీ ముంజ్యా OTTలోకి వచ్చేసింది.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

  • Published Aug 25, 2024 | 1:34 PM Updated Updated Aug 25, 2024 | 1:34 PM

Munjya OTT Release & Streaming Platform: బాలీవుడ్ నుంచి వచ్చిన రూ.100 కోట్ల హారర్ కామెడీ ముంజ్యా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మరి.. ఆ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

Munjya OTT Release & Streaming Platform: బాలీవుడ్ నుంచి వచ్చిన రూ.100 కోట్ల హారర్ కామెడీ ముంజ్యా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మరి.. ఆ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

  • Published Aug 25, 2024 | 1:34 PMUpdated Aug 25, 2024 | 1:34 PM
Munjya OTT: 100 కోట్ల హారర్ కామెడీ ముంజ్యా OTTలోకి వచ్చేసింది.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

ఇప్పుడు హారర్ కామెడీ హవా నడుస్తోంది. అది కూడా బాలీవుడ్ నుంచి వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం శ్రద్ధాకపూర్ చేసిన స్త్రీ 2 చిత్రం పాన్ ఇండియా లెవల్లో ఎంతటి రికార్డులు క్రియేట్ చేస్తోందో చూస్తూనే ఉన్నాం. అద్భుతమైన కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అయితే అంతకన్నా ముందే బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక క్రేజీ హారర్ కామెడీ చిత్రమే ఈ ముంజ్యా. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమిగ్ కూడా అవుతోంది.

ముంజ్యా సినిమా ఒక్క బాలీవుడ్ లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దూసుకుపోయింది. ఈ మూవీ నిజంగానే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది. కానీ, ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయ్యిందో.. అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఒకసారి థియేటర్లో రిలీజ్ అయ్యాక.. పాజిటివ్ టాక్ తో కోట్లు కురిపించింది. ఈ సినిమాని థియేటర్లో చూసిన ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వచ్చిందా అని ఎదురు చూశారు. ఇప్పుడు ఈ ముంజ్యా మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ముంజ్యా సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు డబ్బింగ్ తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తారేమో చూడాలి.

ముంజ్యా కథ ఏంటి?:

ముంజ్యా కథ మొత్తం అభయ్ జీవింత ఆధారంగా నడుస్తూ ఉంటుంది. అభయ్ ని తన తల్లి ఎంతో జాగ్రత్తగా పెంచుతూ ఉంటుంది. అయితే ఆమె అతి జాగ్రత్త వల్ల అభయ్ ని తనకు నచ్చినట్లు అస్సలు జీవించనివ్వదు. వాళ్లు ఒక పెళ్లి కోసం తమ సొంతూరుకు వెళ్లారు. అక్కడే అభయ్ జీవితంలోకి ఈ ముంజ్యా అనే బ్రహ్మ రాక్షసుడు ప్రవేశిస్తాడు. కేవలం అభయ్ కి మాత్రమే కనిపిస్తాడు. అయితే ఆ ముంజ్యా మరెవరో కాదు.. వాళ్ల నానమ్మకు స్వయానా అన్న. అంటే అభయ్ కు తాత అవుతాడు. ఆ ముంజ్యా తన శక్తుల కోసం అభయ్ ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అందుకోసం ఒక పెద్ద కోరిక కూడా కోరతాడు. అసలు ముంజ్యా కోరిన కోరిక ఏంటి? అభయ్ కి ఒక్కడికే ఎందుకు కనిపిస్తాడు? ముంజ్యా అనుకున్నది సాధించాడా? అనేదే మిగిలిన కథ. ఈ ముంజ్యా సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom