iDreamPost
android-app
ios-app

OTTలో డిస్టర్బ్ చేసే హారర్ ఫిల్మ్ ‘ది షైనింగ్’.. ఒంటరిగా చూడొద్దు!

  • Published Aug 18, 2024 | 11:35 AM Updated Updated Aug 18, 2024 | 11:35 AM

OTT Suggestions Best Horror Movie The Shining: ఓటీటీలో మీరు ఒక మంచి హారర్ చిత్రం కోసం ఎదురు చూస్తుంటే మాత్రం మీకోసం ఒక క్రేజీ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇది కాస్త డిస్టర్బింగ్ గానే ఉంటుంది.

OTT Suggestions Best Horror Movie The Shining: ఓటీటీలో మీరు ఒక మంచి హారర్ చిత్రం కోసం ఎదురు చూస్తుంటే మాత్రం మీకోసం ఒక క్రేజీ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇది కాస్త డిస్టర్బింగ్ గానే ఉంటుంది.

  • Published Aug 18, 2024 | 11:35 AMUpdated Aug 18, 2024 | 11:35 AM
OTTలో డిస్టర్బ్ చేసే హారర్ ఫిల్మ్ ‘ది షైనింగ్’.. ఒంటరిగా చూడొద్దు!

కొంతమందికి హారర్ సినిమాలు చూడటం అలవాటు కూడా కాదు.. వ్యసనం అనే చెప్పాలి. వాళ్లకి ఎంత చెప్పినా ఆ అలవాటును మార్చుకోలేరు. ఇంకొంతమంది అయితే వణికిపోతూ కూడా హారర్ సినిమాలే చూడాలి అంటారు. అలాంటి చెడు అలవాటు మీకు కూడా ఉంటే.. మీకోసం ఒక క్రేజీ హారర్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇది స్టార్ట్ చేశాక కాసేపటికి మీకు పిచ్చెక్కిపోతుంది. సాధారణంగా హారర్ లో రెండు రకాలు ఉంటాయి. ఒక సూపర్ న్యూచురల్ స్పిరిట్స్ తో భయపెట్టడం. రెండోది వైలెన్స్ తో కంగారు పెట్టేయడం. మీకు గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో ఆ రెండు ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. మరి.. ఆ మూవీ ఏదో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న హారర్ చిత్రం చాలా సాధారణమైన చిత్రం అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇందులో వెన్నులో వణుకు పుట్టించే అంశాలు చాలానే ఉన్నాయి. అందులోనూ కట్టుకున్న భర్త తన భార్యను చంపేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. అలా చేయడం వెనుక చాలా పెద్ద కారణాలే ఉన్నాయి. ఎంతో ఆనందంగా ఉన్న వారి కుటుంబంలో అనుకోకుండా కష్టాలు వస్తాయి. భార్యాభర్త వారికి ఒక కుమారుడు ఉంటారు. వాల్లు ఆనందంగా గడిపేందుకు వింటర్ వెకేషన్ కి వెళ్తారు. అందుకోసం ఒక పాత బంగ్లాని ఎంచుకుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి.

ఆ పాత బంగ్లాకి పెద్ద చరిత్రే ఉంటుంది. అక్కడ కొన్ని భయానక సంఘటనలు జరిగి ఉంటాయి. ఆ సంఘటనల పరిణామాలు తర్వాత కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఆ భర్త పిచ్చివాడిగా మారిపోతాడు. తన భార్యను చంపాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే వారి కుమారుడుకి ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తూ ఉంటారు. ఆ పిల్లాడు గతం మాత్రమే కాకుండా.. భవిష్యత్ కూడా చూడగలుగుతాడు. అలా వారి కుటుంబంలో ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతాయి. అయితే ఆ బంగ్లాకి ఉన్న కథ ఏంటి? వాళ్లు ఎందుకు అలా అయ్యారు? అనేది తెలియాలి అంటే మీరు ఈ ది షైనింగ్ అనే సినిమా చూడాల్సిందే. ఈ మూవీ కాస్త డిస్టర్బింగ్ గానే ఉంటుంది. కాబట్టి పిల్లలతో చూడకండి. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. రూ.119కు రెటంట్ బేసిస్ లో ఉంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş