iDreamPost
android-app
ios-app

OTTలో క్రేజీ రివేంజ్ డ్రామా సిరీస్ ‘గుణ’.. స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం!

  • Published Aug 26, 2024 | 11:15 PM Updated Updated Aug 27, 2024 | 7:06 AM

OTT Suggestions- Best Revenge Drama Gunaah: ఓటీటీలో ఉన్న ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్, రివేంజ్ డ్రామా చూడాలి అని మీరు అనుకుంటే.. ఇదే మీకు బెస్ట్ ఛాయింస్. ఈ సిరీస్ ని స్టార్ట్ చేస్తే ఆపడం మాత్రం చాలా కష్టం.

OTT Suggestions- Best Revenge Drama Gunaah: ఓటీటీలో ఉన్న ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్, రివేంజ్ డ్రామా చూడాలి అని మీరు అనుకుంటే.. ఇదే మీకు బెస్ట్ ఛాయింస్. ఈ సిరీస్ ని స్టార్ట్ చేస్తే ఆపడం మాత్రం చాలా కష్టం.

  • Published Aug 26, 2024 | 11:15 PMUpdated Aug 27, 2024 | 7:06 AM
OTTలో క్రేజీ రివేంజ్ డ్రామా సిరీస్ ‘గుణ’.. స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం!

ఓటీటీలో వెబ్ సిరీస్ల హవా నడుస్తూ ఉంటుంది. ఈమధ్య తెలుగు ప్రేక్షకులు కూడా ఎక్కువగా వెబ్ సిరీస్లే చూస్తున్నారు. అయితే వాటిలో అన్నీ జానర్స్ అందరికీ నచ్చవు. కానీ, మంచి డ్రామా, రివేంజ్, మైండ్ గేమ్స్ ఉన్న సిరీస్లు అంటే చాలామంది ఇష్టపడతారు. మీరు కూడా అలాంటి అభిరుచి కలిగిన వాళ్లే అయితే మీకోసమే ఈ సిరీస్. ఇది మామూలు వెబ్ సిరీస్ కాదు ఇందులో ఉండే ప్రతి సీన్, ప్రతి ట్విస్టు మీకు పిచ్చెక్కిస్తుంది. పైగా ఇందులో ప్రేమ ఉంటుంది, మోసం ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది, అలాగే అంతకు మించిన మైండ్ గేమ్స్ కూడా ఉంటాయి. మరి.. ఆ సిరీస్ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అసలు ఆ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.

ఈ వెబ్ సిరీస్ ని అభిమన్యు అనే పాత్రతో స్టార్ట్ చేస్తారు. అతను కోట్లకు పడగలెత్తిన యువకుడు. అతను తారా క్యాసినో అనే చోటుకు వెళ్తాడు. అయితే అభిమన్యుకు ఒక పెద్ద ఫ్లాష్య్ బ్యాక్ ఉంది. ఆ గతంలో అతను అభిమన్యు కాదు.. శివ. ఆ శివ అనే యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి చేతిలో ఎంతో దారుణంగా మోసపోతాడు. అలాగే అతను తన కుటుంబానికి దూరమయ్యి.. జైలుకు వెళ్తాడు. జైలు నుంచి తిరిగొచ్చి అభిమన్యుగా మారిపోతాడు. అతని గెటప్ నే కాదు.. ముఖాన్ని కూడా మార్చేసుకుంటాడు. రూ.25 కోట్లు బ్యాంకు నుంచి దోజేసిన కేసులో జైలుకెళ్తాడు. అయితే అతను అభిమన్యుగా ఎలా మారాడు అనే విషయం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది.

శివ ప్రేమించిన తారా జీవితం కూడా ఎంతో మారిపోతుంది. ఆమె తన పేరిట ఒక పెద్ద క్యాసినోని ప్రారంభిస్తుంది. అయితే అభిమన్యు తనకు జరిగిన మోసాన్ని మర్చిపోలేడు. తనను మోసం చేసిన ప్రియురాలు, ప్రాణ స్నేహితుల మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని తిరిగి గోవాకి వస్తాడు. ఆర్మీలో చేసే శివను బ్యాంకు దొంగతనంలో ఎలా ఇరికించారు? అసలు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తారా ఎందుకు మోసం చేసింది? ప్రాణ స్నేహితులే శివాకి ఎందుకు అన్యాయం చేశారు? అసలు శివ.. అభిమన్యుగా ఎలా మారాడు? జైలు నుంచి బయటకు వచ్చిన వాడికి చార్టెడ్ ఫ్లైట్ లో తిరిగే అన్ని కోట్లు ఎలా వస్తాయి? ఇలాంటి చాలానే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ సిరీస్ లో ఉంటాయి. ఈ సిరీస్ పేరు ‘గుణ’. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet