iDreamPost
android-app
ios-app

OTTలో బెస్ట్ కొరియన్ థ్రిల్లర్ ‘మై నేమ్’.. తండ్రి హత్యకు కూతురు ప్రతీకారం!

  • Published Aug 25, 2024 | 10:14 AM Updated Updated Aug 25, 2024 | 10:14 AM

OTT Suggestions- Best K Drama My Name TV Series: కొరియన్ డ్రామాలు అంటే తెలుగు ప్రేక్షకులు కూడా చెవి కోసేసుకుంటున్నారు. అందుకే తెలుగు ప్రేక్షకుల కోసం ఒక అదిరిపోయే కొరియన్ డ్రామా సిరీస్ తీసుకొచ్చాం.

OTT Suggestions- Best K Drama My Name TV Series: కొరియన్ డ్రామాలు అంటే తెలుగు ప్రేక్షకులు కూడా చెవి కోసేసుకుంటున్నారు. అందుకే తెలుగు ప్రేక్షకుల కోసం ఒక అదిరిపోయే కొరియన్ డ్రామా సిరీస్ తీసుకొచ్చాం.

  • Published Aug 25, 2024 | 10:14 AMUpdated Aug 25, 2024 | 10:14 AM
OTTలో బెస్ట్ కొరియన్ థ్రిల్లర్ ‘మై నేమ్’.. తండ్రి హత్యకు కూతురు ప్రతీకారం!

కొరియన్ డ్రామాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. భాష రాకపోయినా వాళ్లు చెప్పే కథలకు ఇండియాలో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే కొరియన్ సిరీస్ల కోసం చెవి కోసుకునే వాళ్లు కూడా ఉండటం విశేషం. ఒక సినిమా మీద, ఒక ఇండస్ట్రీ మీద అంత ప్రేమ పెంచుకున్నారు అంటే.. కచ్చితంగా వాళ్లు అద్భుతమైన సినిమాలు అందిస్తున్నారు అనే అర్థం. అందుకే తెలుగు ప్రేక్షకులు కూడా ఓటీటీల్లో కొరియన్ డ్రామాలు ఎగబడి చూసేస్తున్నారు. మీరు కూడా కే డ్రామా లవర్స్ అయితే మీకోసం ఒక క్రేజీ థ్రిల్లర్ తీసుకొచ్చాం. ఇది అలాంటి ఇలాంటి సిరీస్ కాదండోయ్.. స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం. మరి.. ఆ సిరీస్ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

సాధారణంగా యాక్షన్ థ్రిల్లర్స్ కు మంచి డిమాండ్ ఉంటుంది. అందులోనూ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి కోవకు చెందిన ఒక యాక్షన్ థ్రిల్లరే ఇది కూడా. ఇందులో మీకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక పర్పస్ ఉంటుంది. ఒక రివేంజ్ ఉంటుంది. ఒక డ్రామా ఉంటుంది. అన్నింటికంటే మించిన ట్విస్టులు, యాక్షన్ ఉంటుంది. ఇందులో ఒక కూతురు తన తండ్రి కోసం ప్రతీకారం తీర్చుకోవడం అసలు కథ. హీరోయిన్ తండ్రి ఒక డ్రగ్ లార్డ్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అయితే తన పుట్టినరోజు నాడు.. తన తండ్రిని ఇంటి వద్దే హత్య చేస్తారు. అది ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటుంది.

తన తండ్రి హత్యకు సంబంధించి ప్రతీకారం తీర్చుకోవాలి అని ఫిక్స్ అయిన హీరోయిన్ డ్రగ్ లార్డ్ ని సహాయం కోరుతుంది. అయితే అతను హీరోయిన్ ని పోలీసు కావాలని సూచిస్తాడు. ఎందుకంటే తన తండ్రిని చంపింది ఒక పోలీస్ అని చెప్తాడు. అతను చెప్పిన దాని ప్రకారం హీరోయిన్ పోలీస్ అయిపోతుంది. తండ్రిని చంపిన వాళ్లను ఎలాగైనా కనుక్కోవాలి అని వేట మొదలు పెడుతుంది. ఆ వేటలో ఆమె సక్సెస్ అయ్యిందా? అసలు తన తండ్రిని పోలీసులే చంపారా? తండ్రి మృతికి ఆమె ప్రతీకారం తీర్చుకుందా? అనేదే అసలు కథ. ఈ వెబ్ సిరీస్ లో చాలానే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఒక పోలీసుగా హీరోయిన్ నటించే విధానం మెప్పిస్తుంది. ఇంక ఆమె చేసిన యాక్షన్ కు మీరు కచ్చితంగా ఫిదా అయిపోతారు. ఈ సిరీస్ పేరు ‘మై నేమ్‘. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş