iDreamPost
android-app
ios-app

శ్రద్ధా కపూర్ బెస్ట్ హారర్ కామెడీ ‘స్త్రీ 2’.. వచ్చేది ఆ OTTలోకే..!

  • Published Aug 17, 2024 | 3:21 PM Updated Updated Aug 17, 2024 | 3:21 PM

Stree 2 Movie OTT New Release Details: శ్రద్ధా కపూర్ చేసిన బెస్ట్ హారర్ కామెడీ చిత్రం స్త్రీకి సీక్వెల్ గా వచ్చిన స్త్రీ 2 మూవీ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. మరి.. ఈ స్త్రీ 2 మూవీ ఓటీటీ వివరాలు చూద్దాం.

Stree 2 Movie OTT New Release Details: శ్రద్ధా కపూర్ చేసిన బెస్ట్ హారర్ కామెడీ చిత్రం స్త్రీకి సీక్వెల్ గా వచ్చిన స్త్రీ 2 మూవీ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. మరి.. ఈ స్త్రీ 2 మూవీ ఓటీటీ వివరాలు చూద్దాం.

  • Published Aug 17, 2024 | 3:21 PMUpdated Aug 17, 2024 | 3:21 PM
శ్రద్ధా కపూర్ బెస్ట్ హారర్ కామెడీ ‘స్త్రీ 2’.. వచ్చేది ఆ OTTలోకే..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో బాగా వినిపిస్తున్న సినిమా పేరు స్త్రీ 2. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా లీడ్ రోల్స్ ప్లే చేసిన స్త్రీ 2 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన కేవలం రెడ్రోజులకే స్త్రీ 2 ఏకంగా రూ.118 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాకి సీక్వెల్ కావడంతో సినిమా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తొలి పార్ట్ కంటే ఈసారి కామెడీ, యాక్షన్, డ్రామాని రెట్టింపు చేయడంతో సినిమాకి ఆదరణ మరింత పెరిగింది. ఇప్పుడు స్త్రీ 2 ఓటీటీకి సంబంధించిన సమాచారం కూడా వచ్చేసింది. ఈ సినిమా ఏ ఓటీటీలోకి రాబోతోందో చూద్దాం.

శ్రద్ధా కపూర్ స్త్రీ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి అప్లాజ్ లభించింది. ఓటీటీలో ఆ సినిమా చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. స్త్రీ 2 సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. హైదరాబాద్ లో షోస్ అన్నీ ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. కొన్నిచోట్ల హౌస్ ఫుల్ కూడా పడుతోంది. మొత్తానికి స్త్రీ మూవీకి మించిన రెస్పాన్స్ స్త్రీ2కి వస్తోంది. ఇంక స్త్రీ 2 సినిమా ఓటీటీ విషయానికి వస్తే.. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ సినిమా విడుదలై రెండ్రోజులే అయ్యింది కాబట్టి.. అప్పుడే ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పే పరిస్థితిలేదు. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. కానీ, సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తే కచ్చితంగా 6 నుంచి 8 వారాలు ఆగాల్సి రావచ్చు. ఒకవేళ ముందు తీసుకొచ్చినా కూడా అది రెంట్ బేసిస్ లో తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Maddock Films (@maddockfilms)

స్త్రీ 2 కథ ఏంటంటే?:

స్త్రీ పార్ట్ 1 కథ ఎక్కడ ముగిసిందో.. స్త్రీ 2 కథ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. స్త్రీకి శిలా విగ్రహం కట్టించడం, ఆమెను గౌరవించి.. తమని రక్షించాల్సిందిగా కోరడంతో స్త్రీ ఆ గ్రామాన్ని వదిలి వెళ్లిపోతుంది. అయితే ఎప్పుడైతే స్త్రీ వెళ్లిపోతుందో.. అప్పుడు అతను వస్తాడు. అతడిని సర్ కటా(తలలేని వ్యక్తి) అంటారు. ఇతను ఊరిలో ఉన్న మోడ్రన్ అమ్మాయిలను అపహరిస్తూ ఉంటాడు. ఇతని కోసం మరోసారి హీరోయిన్ తిరిగి ఆ గ్రామానికి వస్తుంది. మరి.. ఈ టీమ్ సర్ కటాను ఎలా ఎదుర్కొన్నారు? స్త్రీని మళ్లీ వెనక్కి పిలిపించారా? అసలు సర్ కటాని ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి? స్త్రీ జడను తీసుకున్న శ్రద్ధా కపూర్ మ్యాజికల్ పవర్స్ ఉపయోగపడ్డాయా? అనేదే మిగిలిన కథ. ఒకవేళ స్త్రీ సినిమా చూడకపోతే.. చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş