iDreamPost
android-app
ios-app

నేరుగా OTTలోకి ‘బాలు గాని టాకీస్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Aug 31, 2024 | 1:27 PM Updated Updated Aug 31, 2024 | 1:27 PM

Balu Gani Talkies OTT Release & Streaming Plotform: నేరుగా ఓటీటీలోకి మరో తెలుగు కామెడీ చిత్రం రాబోతోంది. అందుకు సంబంధించి ఇప్పటికే టీజర్ కూడా వచ్చేసింది. రిలీజ్ కి సంబంధించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు.

Balu Gani Talkies OTT Release & Streaming Plotform: నేరుగా ఓటీటీలోకి మరో తెలుగు కామెడీ చిత్రం రాబోతోంది. అందుకు సంబంధించి ఇప్పటికే టీజర్ కూడా వచ్చేసింది. రిలీజ్ కి సంబంధించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు.

  • Published Aug 31, 2024 | 1:27 PMUpdated Aug 31, 2024 | 1:27 PM
నేరుగా OTTలోకి ‘బాలు గాని టాకీస్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తెలుగు ప్రేక్షకులు ఓటీటీల్లో సినిమాలు చూడటానికి బాగా అలవాటు పడ్డారు. కుటుంబం మొత్తం కలిసి థియేటర్ కి వెళ్లడం కంటే.. ఇంటిల్లిపాది కూర్చుని చక్కగా ఓటీటీలోనే సినిమాలు చూసేస్తున్నారు. అందుకే ఓటీటీలు కూడా సొంతంగా సినిమాలు తీయడం.. నేరుగా ఓటీటీలో మూవీస్ ని రిలీజ్ చేయడం చేస్తుంటాయి. ముఖ్యంగా ప్రముఖ తెలుగు ఓటీటీగా పేరు పొందిన ఆహా ఈ పనిలో చాలా ముందు ఉంటోంది. ఇప్పటికే ఆహా ఒరిజినల్స్ పేరుతో చాలానే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరో కామెడీ ఎంటర్ టైనర్ నేరుగా ఆహాలో విడుదల కాబోతోంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఇప్పుడు చెప్పుకుంటున్న సినిమా పేరు ‘బాలు గాని టాకీస్’. ఈ మూవీలో శివ రామచంద్ర వరపు హీరోగా నటిస్తున్నాడు. నటుడు శివ రామచంద్రవరపు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో నోటబుల్ క్యారెక్టర్ చేశాడు. అలాగే టాలీవుడ్ లో చాలానే సపోర్టింగ్ రోల్స్ తో మెప్పించాడు. ఈ బాలు గాని టాకీస్ చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. హీరోయిన్ గా యువ హీరోయిన్ శ్రావ్యా శర్మ నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 13 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది అంటూ పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు. కచ్చితంగా హిట్టు చేయాలి అంటూ కోరారు. ఈ సినిమాలో రఘు కుంచె కూడా ప్రముఖ పాత్రలో కనిపిస్తున్నాడు. అలాగే వంశీ నెక్కంటి, సుధాకర్ రెడ్డి, సురేష్ పూజారి వంటి వాళ్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమా మొత్తం ఒక బాలకృష్ణ అభిమాని గురించే ఉంటుంది. అతనికి ఒక థియేటర్ ఉంటుంది. అందులో ఎలాగైన బాలయ్య సినిమా ఆడించాలి అనేది అతని కోరిక. అయితే అది తీరిందా? లేదా? అనేది ప్రధాన కథ. అతనికి ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. రఘు కుంచె ఈ సినిమాలో నెగిటివ్ రోల్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టీజర్ కూడా వచ్చింది. ఇప్పుడు రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా ప్రారంభించేశారు. నేరుగా ఓటీటీలోకి వస్తున్న ఈ బాలు గాని టాకీస్ సినిమా కోసం బాలకృష్ణ అభిమానులు మాత్రం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీలో కచ్చితంగా బాలకృష్ణ రిఫరెన్సులు ఎక్కువగానే ఉంటాయి. పైగా డైరెక్ట్ ఓటీటీ కాబట్టి కచ్చితంగా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ahavideoin (@ahavideoin)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş