iDreamPost
android-app
ios-app

ప్రేమ ముసుగులో మోసం.. OTTలో క్రేజీ థ్రిల్లర్ ‘క్లోజర్’..

  • Published Aug 31, 2024 | 11:45 PM Updated Updated Aug 31, 2024 | 11:45 PM

OTT Suggestions Watch Alone Movie Closer: ఓటీటీలో మీరు ఏదైనా ఒక క్రేజీ లవ్ స్టోరీ చూడాలి అనుకుంటుంటే మాత్రం.. మీకోసం ఒక స్కేరీ సినిమా తీసుకొచ్చాం. ఇది ఆహ్లాదంగానే కాదు.. భయానకంగా కూడా ఉంటుంది.

OTT Suggestions Watch Alone Movie Closer: ఓటీటీలో మీరు ఏదైనా ఒక క్రేజీ లవ్ స్టోరీ చూడాలి అనుకుంటుంటే మాత్రం.. మీకోసం ఒక స్కేరీ సినిమా తీసుకొచ్చాం. ఇది ఆహ్లాదంగానే కాదు.. భయానకంగా కూడా ఉంటుంది.

  • Published Aug 31, 2024 | 11:45 PMUpdated Aug 31, 2024 | 11:45 PM
ప్రేమ ముసుగులో మోసం.. OTTలో క్రేజీ థ్రిల్లర్ ‘క్లోజర్’..

మనం రెగ్యూలర్ గా ఒక మాట వింటూ ఉంటాం. అదేంటంటే.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అయితే చాలామంది ఇలా తొలి చూపులోనే ప్రేమలో కూడా పడే ఉంటారు. అలా వారి ప్రేమకథను ముందుకు తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకుని ఉండచ్చు. అయితే అలాంటి వాళ్లు.. సాధారణ లవర్స్ ఎవరైనా ఈ సినిమా చూస్తే మాత్రం వణికిపోవాల్సిందే. ఎందుకంటే ఇందులో కేవలం ప్రేమ మాత్రమే కాదు.. ఆ ముసుగులో జరిగే మోసాలను కూడా స్పష్టంగా చూపిస్తారు. ఎవరు అని కాదు.. ఎలా మోసం చేశారు అనేదే ముఖ్యం అన్నట్లుగా అబ్బాయి.. అమ్మాయిలు చేసే మోసాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. లవర్స్ చూస్తే కచ్చితంగా కాస్త కంగారు పడతారు.

ప్రస్తుతం సమాజంలో ప్రేమలు.. వాటి ముసుగులో జరిగే మోసాలు చాలా ఎక్కువయ్యాయి. ప్రాణంగా ప్రాణంగా ప్రేమిస్తున్నాం అని చెబుతూనే.. వెనుక మాత్రం దారణంగా మోసం చేస్తున్నారు. పెళ్లి అనే బంధం కూడా ఈ మోసాలను ఆపలేకపోవడం విచారకరం. అలాంటి కోణంలో 20 ఏళ్ల క్రితమే ఒక సినిమా వచ్చింది. ఆ మూవీ ఇప్పటి పరిస్థితులకు కూడా కచ్చితంగా నప్పేలాగే ఉంటుంది. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ ప్రేమ పేరిట మోసాలు పెరిగాయి కానీ.. తగ్గలేదు. ఇందులో ఒకటి కాదు.. రెండు జంటలను చూపిస్తారు. వాళ్లు ఒకరిని ఒకరు ఎలా కలిశారు? ఎలా ప్రేమలో పడ్డారు అన్నంత వరకు సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే ఆ తర్వాత వాళ్లు అసలు రంగులు బయట పెట్టిన తర్వాత మాత్రం కంగారు పెట్టిస్తుంది.

మూవీలో ప్రేమను మాత్రమే కాదు.. మోసాలను కూడా బాగా హైలెట్ చేశారు. అలాగే ఒకరి జీవితాల్లోకి మరొకరు వస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్ కాస్త భయపెట్టే కోణంలోనే చూపించారు. అలాగే ఈ సినిమాలో కాస్త బో* సీన్స్ కూడా ఉన్నాయి. ఒకరిని ట్రాప్ చేయాలి అంటే ప్రేమ అనే కాదు.. అందాన్ని కూడా ఎరగా వేయాలి కదా? అదే విషయాన్ని ఇక్కడ వివరించారు. అయితే వాళ్లు మోసపోతున్న విషయం, మోసం చేస్తున్న విషయం కూడా తెలియకుండా మ్యానేజ్ చేస్తుంటారు. కానీ, ఒకరు మరొకరిని కలిసినప్పుడు అసలు ట్విస్టులు వెలుగు చూస్తాయి. ఈ సినిమా మొత్తం ఆ ఇద్దరు జంటల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇంకా చాలానే టర్నింప్ పాయింట్లు, ట్విస్టులు ఉంటాయి. ఈ సినిమా పేరు క్లోజర్. ఇది ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాని చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet