iDreamPost
android-app
ios-app

OTTలో బెస్ట్ కొరియన్ థ్రిల్లర్ ‘మిడ్ నైట్’.. సీరియల్ కిల్లర్ కే చుక్కలు చూపిస్తారు!

  • Published Aug 18, 2024 | 10:00 PM Updated Updated Aug 18, 2024 | 10:00 PM

OTT Suggestions- Best Korean Thriller Midnight Movie: ఓటీటీలో కొరియన్ సినిమాలు చాలానే ఉంటాయి. కానీ ఇలాంటి ఒక థ్రిల్లర్ ని మాత్రం మీరు చూసుండరు. ఒక్కో సీన్ కి మీకు చెమటలు పట్టేస్తాయి.

OTT Suggestions- Best Korean Thriller Midnight Movie: ఓటీటీలో కొరియన్ సినిమాలు చాలానే ఉంటాయి. కానీ ఇలాంటి ఒక థ్రిల్లర్ ని మాత్రం మీరు చూసుండరు. ఒక్కో సీన్ కి మీకు చెమటలు పట్టేస్తాయి.

  • Published Aug 18, 2024 | 10:00 PMUpdated Aug 18, 2024 | 10:00 PM
OTTలో బెస్ట్ కొరియన్ థ్రిల్లర్ ‘మిడ్ నైట్’.. సీరియల్ కిల్లర్ కే చుక్కలు చూపిస్తారు!

కొరియన్ సిరీస్లు, సినిమాలు అంటే ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఓటీటీ వచ్చిన తర్వాత కొరియన్ సినిమాలకు ప్రేక్షకులు బాగా అలవాటు పడ్డారు. అయితే కొరియన్ అనగానే చాలా మంది లవ్ స్టోరీలు అనుకుని పొరపాటు పడుతూ ఉంటారు. నిజానికి కొరియన్ సినిమాల్లో లవ్ స్టోరీలు కంటే కూడా యాక్షన్, సస్పెన్స్, ఎమోషనల్ డ్రామాలే ఎక్కువగా ఉంటాయి. అలాంటి లిస్ట్ లో నుంచి మీకోసం ఒక బెస్ట్ కొరియన్ యాక్షన్ డ్రామా తీసుకొచ్చాం. ఇందులో వచ్చే ఒక్కో సీన్ కి మీకు చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఆ సినిమాలో మిమ్మల్ని మీరు ఊహించుకోవడం.. లేదంటే సహాయం చేయాలి అని కొట్టుమిట్టాడటం చేస్తుంటారు.

ఈ సినిమా ఒక తల్లీకూతుకు జీవితం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తల్లీకూతుళ్లు ఇద్దరూ కష్టపడి పని చేస్తూ ఉంటారు. కుమార్తె ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది. తల్లి కూడా ఓదో ఒక పని చేస్తూ ఉంటుంది. వాళ్లు ఇద్దరూ డబ్బులు కూడబెట్టి ఒక మంచి వెకేషన్ కి వెళ్లాలి అనుకుంటారు. అందుకోసం కావాల్సిన డబ్బులు కూడా సమకూర్చుకుంటారు. అయితే ఆ తల్లీ కూతుళ్లు ఇద్దరికీ వినిపించదు, మాట్లాడటం రాదు. కేవలం సైగలతోనే కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. కానీ, వాళ్లు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. తెల్లారితే వెకేషన్ కి వెళ్తాం అనుకున్న సమయంలో వారి జీవితాలు తలకిందులు అయిపోతాయి. వారి జీవితాల్లోకి ఒక సైకో కిల్లర్ ఎంటర్ అవుతాడు.

ఈ మూవీలో ముందు ఆ సైకో కిల్లర్ నే పరిచయం చేస్తారు. అతను రాత్రి పూట అమ్మాయిలను టార్గెట్ చేసుకుని తన వ్యాన్ లోనే హత్యలు చేస్తూ ఉంటాడు. అతను ఆ రాత్రి ఒక అమ్మాయిని అపహరిస్తాడు. ఆమెపై దాడి కూడా చేస్తాడు. అయితే అటుగా హీరోయిన్ వస్తుంది. అమ్మాయి సహాయం కోసం కోరుతుంది. ఆమెకు ఎలాగైనా సహాయం చేయాలి అని ఫిక్స్ అవుతుంది. అయితే ఆ సైకో కిల్లర్ కు హీరోయిన్ దొరికిపోతుంది. ఆమెకు సహాయం చేయాలి అని చూసిందని హీరోయిన్.. ఆమెతో ఉన్నదని తల్లిని కూడా చంపాలి అని ఫిక్స్ అవుతాడు. అరెస్టు చేయించాలని హీరోయిన్.. చంపాలని సైకో కిల్లర్.. వాళ్ల మధ్య జరిగే మైండ్ గేమ్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టకుంటాయి. అలాగే చాలా థ్రిల్లింగ్ గా కూడా ఉంటాయి. హీరోయిన్ సైకో కిల్లర్ ని పట్టించిందా? లేదంటే అతని చేతిలో ప్రాణాలు కోల్పోయిందా? అనే విషయం తెలియాలి అంటే మీరు ఈ ‘మిడ్ నైట్’ అనే సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడాల్సిందే. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio