రేపటి నుంచి మెరుపు సమ్మెకు దిగబోతున్నట్టు సినీ కార్మికులు ప్రకటించారు. అన్ని క్రాఫ్ట్స్ కు సంబంధించిన వాళ్ళు ఇందులో పాల్గొంటారు. వీళ్ళ ప్రధాన డిమాండ్ వేతన సవరింపు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్న ఈ విషయాన్ని ఇప్పుడు తేల్చేయాలని కోరుతున్నారు. మెత్తగా అడిగితే పనులు జరగవు కాబట్టి షూటింగులను స్థంబింపజేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇది నిర్మాతలకు పెద్ద ఝలక్. ఎందుకంటే చాలా సినిమాలు కీలక దశలో ఉన్నాయి. ఆర్టిస్టుల కాల్ షీట్స్ తీసుకుని షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని […]
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నమోదవుతున్న ఫలితాలు దర్శకనిర్మాతలకు సరికొత్త పాఠాలు నేర్పిస్తున్నాయి. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా చెబుతున్నాయి. బ్రేక్ ఈవెన్ కు కొత్త సవాళ్లు చూపిస్తున్నాయి. మొన్న విడుదలైన విరాట పర్వంకు ఎన్ని ప్రశంసలు వచ్చినా అవి వసూళ్ల రూపంలోకి మారడం లేదు. 12 కోట్లకు పైగా జరిగిన బిజినెస్ లో సగం తేవడం కూడా గగనమే అనిపిస్తోంది. సాయిపల్లవి ఇమేజ్, విస్తృతంగా చేసిన ప్రమోషన్లు ఇవేవి నిలబెట్టలేకపోతున్నాయి. ఇక అంటే సుందరానికి నష్టాల బారిన […]
తాజాగా టాలీవుడ్, బాలీవుడ్ లో ఎంతోమందికి ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసిన ప్రత్యూష గరిమెళ్ళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు షాక్ కి గురయ్యారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యుష గరిమెళ్ళ డిజైనర్ గా ఎదిగి తన పేరుతోనే బొటిక్ ని స్థాపించి చాలా పెద్ద ఫ్యాషన్ డిజైనర్ గా ఎదిగింది. 2013 నుంచి ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తుంది. కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్, దీపికా […]
సౌత్ లో నజ్రియాకు ఉన్న క్రేజే వేరు. ఏ భాషలో సినిమా చేసినా అక్కడ ఆమెకంటూ ఫ్యాన్స్ ఉంటారు. సహజ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయితే దాదాపుగా పదేళ్ళ నుంచి హీరోయిన్ గా చేసినా, సినిమాల సంఖ్య చాలా తక్కువ. పైగా మధ్యలో బ్రేక్ లు ఎక్కువ. దీనికి గల కారణాన్ని చెప్పింది నజ్రియా. ప్రతి సినిమా తరువాత బ్రేక్ తీసుకోవాలని ఫిక్స్ అవుతుందట నజ్రియా. పాపం అది కాస్తా రండేళ్ళు అయిపోతుందట. బ్రేక్ తీసుకున్న […]
ఆయన స్వరం భాస్వరం.. ఆయన సర్వస్వము సంగీతమయం. పదుల తరాలు గుర్తుపెట్టుకునే చరిత్ర ఆయన ప్రస్థానం. నటనలోని నవరసాల్ని గొంతులో పలికించగల గాన గంధర్వులు, “బాలు” అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే మన శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం. ప్రతిఒక్కరూ “మా వాడు” అనిపించుకున్న బాలు మనల్ని విడిచి వెళ్ళినప్పటికీ.. స్వరం, సాహిత్యం ఉన్నంత కాలం గతించిపోని గాత్రం ఆయనది. పాడుతా తీయగా అంటూ తెలుగువాళ్ళ మనసుల్లో చెరిగిపోని మద్ర వేసుకున్న మహానుభావుడికి వందనాలు సమర్పిస్తూ, ఆయన పాడిన […]
ఇటీవల సినిమా కలెక్షన్స్ పెంచాలని, పెట్టిన బడ్జెట్ ని ఎలాగైనా వసూలు చేయాలని చాలా సినిమాలకి టికెట్ రేట్లు పెంచారు. ఆఖరికి డబ్బింగ్ సినిమాల టికెట్ రేట్లు కూడా పెంచారు. దీంతో సామాన్య, మధ్య తరగతి వాళ్ళు థియేటర్ కి వెళ్లడం మానేశారు. అలాగే సినిమా రిలీజ్ అవ్వగానే నెల రోజులకే ఓటీటీలోకి వస్తుండటంతో కొంతమంది అందులో వచ్చాక చూసుకోవచ్చు అని థియేటర్ కి వెళ్లడం లేదు. దీంతో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలకి కూడా కలెక్షన్స్ […]
టాలీవుడ్ లో ‘మా’ ఎన్నికలు ఎంత రచ్చ సృష్టించాయో మన అందరం చూశాం. 900 మంది ఉన్న చిన్న అసోసియేషన్ కోసం టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరి పరస్పర వ్యక్తిగత దూషణ దాకా వెళ్లారు. మొత్తానికి ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచారు. ఎన్నికల్లో మంచు విష్ణు ‘మా’కి సొంత బిల్డింగ్ కడతాను అనే ముఖ్యమైన హామీతో వెళ్లారు. తాజాగా దీనిపై మాట్లాడారు మంచు విష్ణు. ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆదివారం ఉదయం […]
ఎంతసేపూ మన హీరోలు తమిళ దర్శకుల వెంటపడటమే కానీ టాలీవుడ్ డైరెక్టర్లతో తమిళ స్టార్లు సినిమాలు చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. చరిత్రను తవ్వినా మణిరత్నం, కె బాలచందర్, కెఎస్ రవికుమార్, సురేష్ కృష్ణ, కరుణాకరన్, ధరణి, మణివణ్ణన్ ఇలా ఎందరో ఇక్కడ చెప్పుకోదగ్గ చిత్రాలు చేశారు కానీ ఇక్కడి నుంచి వెళ్లి ఆరవ కథానాయకులను మెప్పించిన వాళ్ళు తక్కువ. సదరు ప్రాంతీయాభిమానం అలాంటిది మరి. ఇప్పటికీ రామ్ లాంటి యంగ్ స్టర్స్ లింగుస్వామితో చేస్తున్న సంగతి […]
నిన్నంతా హైదరాబాద్ రాడిసన్ బ్లూ పబ్బులో జరిగిన వ్యవహారం గురించి మీడియా హోరెత్తిపోయింది. ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీల పేర్లు బయటికి రావడం, కొందరిని స్టేషన్ కు తీసుకెళ్లి వదిలేసిన వీడియోలు వైరల్ కావడం, వాళ్ళ కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం రచ్చ మాములుగా జరగలేదు. న్యూస్ ఛానల్స్ రోజు మొత్తం ఈ పనిమీదే ఉన్నాయి. నిజానికి ఎవరూ డ్రగ్స్ తీసుకున్నట్టు ఆధారాలు కానీ, సాక్ష్యాలు కానీ చూపించలేదు. రాహుల్ సిప్లిగుంజ్ తానే తప్పు చేయలేదని […]