iDreamPost
android-app
ios-app

Sri Tej: నటుడు శ్రీ తేజ్‌పై కేసు! లైంగిక వేధింపులతో పాటు హత్య నేరం కూడా..!

  • Published Nov 26, 2024 | 2:39 PM Updated Updated Nov 26, 2024 | 2:39 PM

Sri Tej: టాలీవుడ్ నటుడు శ్రీ తేజ్ పై పోలీసు కేసు నమోదయ్యింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై అతని మీద కేసు ఫైల్ అయ్యింది.

Sri Tej: టాలీవుడ్ నటుడు శ్రీ తేజ్ పై పోలీసు కేసు నమోదయ్యింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై అతని మీద కేసు ఫైల్ అయ్యింది.

  • Published Nov 26, 2024 | 2:39 PMUpdated Nov 26, 2024 | 2:39 PM
Sri Tej: నటుడు శ్రీ తేజ్‌పై కేసు! లైంగిక వేధింపులతో పాటు హత్య నేరం కూడా..!

గత కొంతకాలం నుంచి టాలీవుడ్ సెలెబ్రెటీలపై పోలీస్ కేసులు ఎక్కువ అయిపోతున్నాయి. ముఖ్యంగా అక్రమ కేసుల్లో ఎక్కువగా దొరికిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ యాక్టర్ శ్రీ తేజ్‌పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళితే.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో శ్రీ తేజ్ పై ఈ కేసు నమోదు అయినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతుంది.

ఇకపోతే శ్రీ తేజ్ పై ఇలా పోలీస్ కేసు నమోదు కావడం ఇది ఫస్ట్ టైమ్ కాదట. గతంలో కూడా ఇతనిపై పోలీస్ కేసు ఫైల్ అయ్యిందట. అది కూడా పెళ్లయిన వివాహితతో ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. ఇక ఆమె ఓ ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ ఎంప్లాయ్ భార్య ఆట. ఇక అంతేకాదు వీరిద్దరి అక్రమ సంబంధం తెలుసుకున్న ఆ ఎంప్లాయ్ పాపం గుండెపోటుతో మరణించినట్లు తెలిసింది. ఈ ఘటనలో కూడా శ్రీ తేజ్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేస్ నమోదు కావడం షాకింగ్ విషయం. ఇక ఇలా ఒకవైపు లైంగిక వేధింపులతో పాటు హత్యా నేరం కింద కూడా అతనిపై కేసు నమోదయ్యింది. దీంతో అతని గురించి ఈ విషయాలు తెలిసిన సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఇదిలా ఉండగా నేరారోపణల కారణంగా శ్రీ తేజ్ పై బి.ఎన్.ఎస్ 69, 115(2),318(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఇకపోతే ప్రస్తుతం శ్రీ తేజ్ ఒక పెద్ద సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.శ్రీతేజ్ గతంలో మంచి నటుడిగా టాలీవుడ్‌లో గుర్తింపు సంపాదించుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబు పాత్రలో నటించి బాగా ఆకట్టుకున్నాడు. పరంపరం, బహిష్కరణ లాంటి వెబ్ సిరీస్‌లో కూడా ఇంపార్టెంట్ రోల్స్ చేశాడు. యాక్టర్ గా తానెంటో నిరూపించుకున్నాడు. ఇలా ఇప్పుడిప్పుడే సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ఎక్కువ అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్న శ్రీ తేజ్ ఇలా కేసుల్లో ఇరుక్కపోవడం అతని కెరీర్ కి బిగ్గెస్ట్ డ్యామేజ్ అని చెప్పవచ్చు. మరి ఈ కేసుల నుంచి శ్రీతేజ్ ఎలా బయటపడతాడు? అసలు వీటిల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే శ్రీతేజ్ నోరు విప్పే దాకా ఆగాల్సిందే. మరి ఈ ఘటన గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş