iDreamPost
android-app
ios-app

వీడియో: NTRకు ఫ్యాన్స్ మాస్ ట్రిబ్యూట్.. సముద్రంలో రియల్ షార్క్​తో!

  • Published Sep 24, 2024 | 9:11 PM Updated Updated Sep 24, 2024 | 9:11 PM

Jr NTR Fans Take Devara Movie Celebrations To The Sea: బాక్సాఫీస్ బెండు తీయడానికి వస్తున్నాడు ‘దేవర’. ఇంకో మూడ్రోజుల్లో ఈ మూవీతో థియేటర్లలో జాతర చేయనున్నాడు ఎన్టీఆర్. ఈ తరుణంలో తారక్​కు అతడి అభిమానులు మాస్ ట్రిబ్యూట్ ఇచ్చారు.

Jr NTR Fans Take Devara Movie Celebrations To The Sea: బాక్సాఫీస్ బెండు తీయడానికి వస్తున్నాడు ‘దేవర’. ఇంకో మూడ్రోజుల్లో ఈ మూవీతో థియేటర్లలో జాతర చేయనున్నాడు ఎన్టీఆర్. ఈ తరుణంలో తారక్​కు అతడి అభిమానులు మాస్ ట్రిబ్యూట్ ఇచ్చారు.

  • Published Sep 24, 2024 | 9:11 PMUpdated Sep 24, 2024 | 9:11 PM
వీడియో: NTRకు ఫ్యాన్స్ మాస్ ట్రిబ్యూట్.. సముద్రంలో రియల్ షార్క్​తో!

బాక్సాఫీస్ బెండు తీయడానికి వచ్చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్​ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. ఇంకో మూడ్రోజుల్లో ‘దేవర’ మూవీతో థియేటర్లలో జాతర చేయనున్నాడు. పాత రికార్డులను పాతర వేయడానికి సిద్ధమవుతున్నాడు తారక్. ఆకాశమంత అంచనాలతో బరిలోకి దిగుతున్న ‘దేవర’ కోసం అభిమానులతో పాటు జనరల్ ఆడియెన్స్, మూవీ లవర్స్ కూడా ఎంతో ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు. వాళ్లు ఏ రేంజ్​లో సినిమా కోసం ఎదురు చూస్తున్నారో టికెట్ బుకింగ్స్​ను బట్టి అర్థం చేసుకోవచ్చు. హాట్ కేక్స్​లా అమ్ముడుపోతున్నాయి టికెట్స్. టికెట్లు దొరికిన అభిమానులు సంబురాలకు రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో తారక్ మీద తమకు ఎంత ప్రేమ ఉందో చూపించారు ఓవర్సీస్ ఫ్యాన్స్.

ఎన్టీఆర్ మీద సముద్రం అంత ప్రేమను చూపించారు అభిమానులు. రియల్ షార్క్​తో అతడికి మాస్ ట్రిబ్యూట్ ఇచ్చారు. తారక్ ఫ్యాన్స్​ చేసిన ఓ ట్రిబ్యూట్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘దేవర’కు వెల్​కమ్ చెబుతూ రూపొందించిన ఈ వీడియో సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది. సముద్రంలో రియల్ షార్క్​ల మధ్య దీన్ని రికార్డు చేశారు. సముద్రం లోపల ‘దేవర’లోని ఎన్టీఆర్ పోస్టర్స్​ ఉండగా.. వాటి చుట్టూ షార్క్​లు తిరుగుతుండటాన్ని వీడియోలో చూడొచ్చు. ‘దేవర’లోని సముద్రం తాలూకు సీన్స్​కు సంబంధించిన సీన్స్, బ్యాగ్రౌండ్​లో అనిరుధ్ కంపోజ్ చేసిన అద్భుతమైన బీజీఎంకు తోడు రియల్ షార్క్ సీన్స్ ఉన్న ఈ వీడియో తారక్ ఫ్యాన్స్​కు గూస్​బంప్స్ తెప్పిస్తోంది. తమ అభిమాన హీరో మీద ఫ్యాన్స్​కు ఉన్న లవ్ ఎలాంటిదో ఈ ట్రిబ్యూట్ వీడియో చెబుతోందని నెటిజన్స్ అంటున్నారు.

అభిమానులందు తారక్ అభిమానులు వేరని.. ఇంత ప్రేమ ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఇలాంటి ఫ్యాన్స్ ఉండటం నిజంగా ఎన్టీఆర్ అదృష్టమని అంటున్నారు. ఇక, సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న ‘దేవర’ మూవీ రన్​టైమ్​కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా టోటల్ రన్​టైమ్ 2 గంటల 50 నిమిషాల 58 సెకన్లుగా లాక్ అయింది. అయితే ఇందులో సోషల్ సేఫ్టీకి సంబంధించిన వార్నింగ్ యాడ్స్​ను జత చేశారు. వాటిని మినహాయిస్తే ఫిల్మ్ రన్​టైమ్​గా మాత్రమే చూసుకుంటే.. 2 గంటల 42 నిమిషాలు అని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన ఈ చిత్రంలో తారక్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్​గా యాక్ట్ చేసింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్​లో కనిపించనున్న ఈ మూవీలో శ్రీకాంత్, ప్రకాష్​రాజ్ తదితరులు కూడా నటించారు.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş