Nidhan
35 Chinna Katha Kaadu OTT Release: ప్రముఖ హీరోయిన్ నివేదా థామస్ నటించిన ‘35 చిన్న కథ కాదు’ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. ఏ ప్లాట్ఫామ్లో ఎప్పటి నుంచి ఈ ఫిల్మ్ అందుబాటులో ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
35 Chinna Katha Kaadu OTT Release: ప్రముఖ హీరోయిన్ నివేదా థామస్ నటించిన ‘35 చిన్న కథ కాదు’ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. ఏ ప్లాట్ఫామ్లో ఎప్పటి నుంచి ఈ ఫిల్మ్ అందుబాటులో ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
Nidhan
ప్రముఖ హీరోయిన్ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘35: చిన్న కథ కాదు’. నందకిషోర్ ఇమాని డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్‌ను హ్యాండ్సమ్ హంక్ రానా ప్రొడ్యూస్ చేశారు. తెలుగు, తమిళంతో పాటు మలయాళంలోనూ సెప్టెంబర్ 6వ తేదీన రిలీజైంది మూవీ. ఈ చిత్రంలో నివేదా తల్లి క్యారెక్టర్ పోషించారు. స్మాల్ ఫిల్మ్‌గా విడుదలైన ‘35: చిన్న కథ కాదు’ క్రిటిక్స్ నుంచి కూడా మంచి అప్లాజ్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయింది.
తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది ‘35: చిన్న కథ కాదు’. అక్టోబర్ 2వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ మొదలవనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. చిన్న కథ వెనుక పెద్ద పాఠం ఉంది.. ఇది మన ఇంటి కథలా అనిపిస్తుంది అంటూ ఒక పోస్టర్‌ను ఆడియెన్స్‌తో షేర్ చేసుకుంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇక ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అవ్వాల్సిందే. బిగ్ స్క్రీన్స్‌లో చూసి ఎంజాయ్ చేసిన వారు కూడా ఇంకోసారి చూడాలంటే ఓటీటీలో రెడీగా ఉంటుంది. ఇక, ఈ సినిమా కథ విషయానికొస్తే.. ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ) ఒక బస్ కండక్టర్. ఆయన వైఫ్ సరస్వతి (నివేదా థామస్).
భర్త ప్రసాద్‌తో పాటు పిల్లలు అరుణ్, వరుణ్ ప్రపంచంగా బతుకుతూ ఉంటుంది సరస్వతి. చిన్నోడు బాగానే చదవినా, పెద్దోడు అరుణ్‌కు మాత్రం మ్యాథ్స్ బొత్తిగా అంతుపట్టదు. అతడు అడిగే క్వశ్చన్స్కు టీచర్ల దగ్గర కూడా ఆన్సర్స్ ఉండవు. దీంతో మ్యాథ్స్ టీచర్ చాణక్య (ప్రియదర్శి) ఫండమెంటల్స్‌ను ప్రశ్నించొద్దు అంటాడు. అలా చేస్తే మిగిలేది జీరోనే అంటూ అరుణ్‌కు అదే పేరు పెట్టి లాస్ట్ బెంచ్‌కు పంపిస్తాడు. ఆరో తరగతిలో అతడ్ని ఫెయిల్ చేసేస్తాడు. దీంతో అతడు వెళ్లి తన తమ్ముడి క్లాస్‌లో కూర్చోవాల్సి వస్తుంది. స్కూల్లో ఉండాలంటే మ్యాథ్స్‌లో మినిమం 35 మార్కులు తెచ్చుకోవాలి. ఈ సిచ్యువేషన్ నుంచి అరుణ్‌ను తల్లి సరస్వతి ఎలా బయటపడేసింది? అతడ్ని జీరో నుంచి హీరోగా ఎలా మార్చింది? అన్నది మిగతా స్టోరీ. ఫుల్ ఎంగేజింగ్‌గా, ఎంటర్టైనింగ్, ఎమోషనల్‌గా సాగే ఈ రోలర్‌కోస్టర్ రైడ్‌ను ఓటీటీలో చూడాలంటే అక్టోబర్ 2 వరకు వెయిట్ చేయక తప్పదు. మరి.. ‘35: చిన్న కథ కాదు’ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం మీరెంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.
ఈ చిన్న కథలో వెనుక పెద్ద పాఠం ఉంది!
మన ఇంటి కథలా అనిపిస్తుంది…😍Beautiful Blockbuster #35Movie Premieres 2nd October only on aha! @i_nivethathomas @imvishwadev @PriyadarshiPN @Nanduemani @RanaDaggubati @nikethbommi pic.twitter.com/r9qFyCpaJq
— ahavideoin (@ahavideoIN) September 27, 2024