iDreamPost
android-app
ios-app

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖ నటుడు అభిషేక్ అరెస్ట్

టాలీవుడ్ ఇండస్ట్రీ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. పలు కేసుల్లో హేమ, రాజ్ తరుణ్, జానీ మాస్టర్, అమన్ ప్రీత్ పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు మరో నటుడు అరెస్టు అయ్యాడు

టాలీవుడ్ ఇండస్ట్రీ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. పలు కేసుల్లో హేమ, రాజ్ తరుణ్, జానీ మాస్టర్, అమన్ ప్రీత్ పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు మరో నటుడు అరెస్టు అయ్యాడు

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖ నటుడు అభిషేక్ అరెస్ట్

వరుస వివాదాలతో తెలుగు ఇండస్ట్రీ వార్తల్లో నిలుస్తుంది. డ్రగ్స్, అమ్మాయిలపై అత్యాచారం వంటి ఘటనలపై గత నాలుగు నెలలుగా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. సీనియర్ నటి హేమ డ్రగ్స్ కేసులో అరెస్టై బెయిల్ పై విడుదలైన సంగతి విదితమే. ఈ కేసు కొనసాగుతుండగానే.. డ్రగ్స్ కేసులో వర్దమాన నటుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్టు అయ్యాడు. ఇవి కాకుండా ప్రియురాలిని మోసం చేసిన కేసులో రాజ్ తరుణ్, జూనియర్ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని జానీ మాస్టర్ పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా ప్రముఖ యూట్యూబర్, అప్ కమింగ్ హీరో హర్షసాయి తనను మోసం చేశాడంటూ నటి ఆరోపణలు చేసిన సంగతి విదితమే. జానీ మాస్టర్ ప్రస్తుతం పోలీసులు విచారణలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఇండస్ట్రీని మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది.

తాజాగా డ్రగ్స్ కేసులో సినీ నటుడు అభిషేక్ మరోసారి అరెస్టు అయ్యాడు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు గోవాలో అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారు. 2012 డిసెంబరులో అభిషేక్‌ డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యాడు. అభిషేక్, జి. శ్రీనివాసులు అనే వ్యక్తితో స్కోడా కారులో ప్రయాణిస్తుండగా పోలీసులు వారి కారును చెక్ చేయగా అందులో 10 ప్యాకెట్ల కొకైన్ దొరికింది. దీంతో అతడిని అరెస్టు చేశారు. ఎస్ఆర్ నగర్, జూబీహిల్స్ పోలీస్ స్టేషన్లలో ఆయనపై డ్రగ్స్ కేసులు నమోదైయ్యాయి.  అయితే అప్పట్లో బెయిల్ పై విడుదలయ్యి.. కోర్టు విచారణకు హాజరు కావడం లేదు. బెయిల్ పై బయటకు వచ్చిన నటుడు హైదరాబాద్ నుండి మకాం మార్చి.. గోవాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది.

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టీజీ న్యాబ్ పోలీసులు.. గోవాలో అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని భాగ్యనగరికి తీసుకు వస్తున్నారు. అభిషేక్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్. తండ్రి చనిపోవడంతో డిగ్రీ చదువు మధ్యలోనే వదిలేసి హైదరాబాదుకు వచ్చాడు. 2003లో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఐతే సినిమా ద్వారా సినిమాలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నలుగురు హీరోల్లో ఒకడిగా నటించాడు. తర్వాత అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో వచ్చిన నేను చిత్రంలో ముఖ్య పాత్ర పోషించాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషించాడు. డేంజర్ సినిమాలో కూడా నలుగురు హీరోల్లో ఒకడిగా నటించాడు. శశిరేఖా పరిణయం సినిమాలో హీరో తరుణ్ తమ్ముడి పాత్రలో నటించాడు. ఎలా చెప్పను, కాళిదాసు, గగనం వంటి సినిమాల్లో నటించాడు.