Vinay Kola
Choreographer Jani: ప్రస్తుతం జానీ మాస్టర్ వివాదం సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంత కాదు. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనపై కేసు నమోదయ్యింది.
Choreographer Jani: ప్రస్తుతం జానీ మాస్టర్ వివాదం సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంత కాదు. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనపై కేసు నమోదయ్యింది.
Vinay Kola
ప్రస్తుతం జానీ మాస్టర్ వివాదం టాలీవుడ్ లో సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంత కాదు. ఓ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనపై కేసు నమోదయ్యింది. ఈ వివాదంపై అనేక వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై ఈ కేసు నమోదు కావడం జరిగింది. వేధింపులకు గురైన బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై మొదట మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బాధితురాలు స్టేట్మెంట్ రికార్డు తర్వాత జానీ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఆయనపై విచారణ కొనసాగుతుంది. ఈ కేసుపై ఇప్పటికే దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు.
గురువారం నాడు జానీని గోవాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈరోజు ఉదయం 4 గంటలకు హైదరాబాద్ తీసుకువచ్చి నార్సింగి పోలీసులకు అప్పగించారు. డీసీపీ ఆఫీస్‌లో జానీ మాస్టర్‌ను విచారించారు. ఈ విచారణ ముగిశాకా ఆయాన్ని రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో తాజాగా జానీ మాస్టర్ కి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ కేసుపై ఉప్పరపల్లిలోని ఫోక్సో కోర్టు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో వచ్చే నెల 3 వ తేదీ దాకా జానీ మాస్టర్ కు రిమాండ్ విధించనున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
అసలు తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని, తనని కావాలనే ఈ కేసులో ఇరికించారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు జానీ మాస్టర్. కొంత మంది కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని కామెంట్స్ చేశారు. తాను ఇరుకున్న ఈ కేసులో పోరాడి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు జానీ మాస్టర్. ప్రస్తుతం జానీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక జానీపై వచ్చిన ఈ ఆరోపణలన్ని అసత్యమే అని ఆయన భార్య అయేషా కూడా అంతకముందు కామెంట్స్ చేశారు. తన భర్తను ఇండస్ట్రీలో ఎదగనీయకుండా కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మరి చూడాలి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో. మరి జానీ మాస్టర్ చేసిన ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.