iDreamPost
android-app
ios-app

‘దేవర’కు వరంగా మారిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు.. మైనస్ అనుకుంటే బిగ్ ప్లస్ అయింది!

  • Published Sep 23, 2024 | 7:22 PM Updated Updated Sep 23, 2024 | 7:22 PM

Devara Movie, Jr NTR, Devara Pre Release Event: మరో నాలుగు రోజుల్లో మ్యాన్ ఆఫ్​ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ జాతర మొదలవనుంది. ఆయన నటించిన ‘దేవర’ మూవీ ఈ నెల 27వ తేదీన థియేటర్లలోకి రానుంది.

Devara Movie, Jr NTR, Devara Pre Release Event: మరో నాలుగు రోజుల్లో మ్యాన్ ఆఫ్​ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ జాతర మొదలవనుంది. ఆయన నటించిన ‘దేవర’ మూవీ ఈ నెల 27వ తేదీన థియేటర్లలోకి రానుంది.

  • Published Sep 23, 2024 | 7:22 PMUpdated Sep 23, 2024 | 7:22 PM
‘దేవర’కు వరంగా మారిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు.. మైనస్ అనుకుంటే బిగ్ ప్లస్ అయింది!

మరో నాలుగు రోజుల్లో మ్యాన్ ఆఫ్​ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ జాతర మొదలవనుంది. ఆయన నటించిన ‘దేవర’ మూవీ ఈ నెల 27వ తేదీన థియేటర్లలోకి రానుంది. బాక్సాఫీస్​ను బద్దలు కొట్టేందుకు తారక్ రెడీ అవుతున్నాడు. పాత రికార్డులకు పాత పెట్టేందుకు ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడు. ఈసారి పాన్ ఇండియా లెవల్​లో వసూళ్ల ఊచకోత కోసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. సినిమా నుంచి టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ రూపంలో బయటకు వచ్చిన కంటెంట్​కు హ్యూజ్ రెస్పాన్స్ రావడం, ప్రమోషన్స్​తో ‘దేవర’ గురించి తారక్ కాన్ఫిడెంట్​గా మాట్లాతున్న తీరుతో మూవీపై ఎక్స్​పెక్టేషన్స్​ ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతో ఈగర్​గా వెయిట్ చేసిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు అయింది. దీంతో అంతా నిరాశలో మునిగిపోయారు. అభిమానులతో పాటు ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో డిజప్పాయింట్ అయ్యాడు. కానీ ఈవెంట్ రద్దు ‘దేవర’కు బిగ్ ప్లస్ అవడంతో ఇప్పుడంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

‘దేవర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు వల్ల అభిమానులు, తారక్​తో పాటు మూవీ టీమ్ నిరుత్సాహానికి లోనయ్యారు. ఈవెంట్ జరిగి ఉంటే ఎన్టీఆర్ మాటలు వినే వాళ్లమని, సినిమా గురించి ఆయన చెప్పే మాటలు మరింత హైప్ పెంచేవని అభిమానులు చెబుతున్నారు. ఫిల్మ్ ప్రమోషన్స్​కు భారీ దెబ్బ పడిందని మేకర్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. కానీ ఒకరకంగా ఈవెంట్ రద్దవడం సినిమాకు బాగా హెల్ప్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈవెంట్ రద్దు గురించి మీడియాలో భారీగా కథనాలు వస్తున్నాయి. ఎన్టీఆర్​కే ఎందుకు ఇలా జరిగిందంటూ మూవీ లవర్స్​తో పాటు జనరల్ ఆడియెన్స్​ కూడా డిస్కస్ చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ ‘దేవర’ మీద చర్చలు మరింత పెరిగాయి. మూవీకి ఇంకా హైప్ పెంచడంలో ఇది ఉపయోగపడిందని నెటిజన్స్ అంటున్నారు.

ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు కారణంగా ఒక్కసారిగా మీడియా ఫోకస్ మొత్తం ‘దేవర’ మీద పడిందని నెటిజన్స్ చెబుతున్నారు. ఈవెంట్ జరిగి ఉంటే అది టెలికాస్ట్ చేసి వదిలేసేవారని.. కానీ రద్దు కారణంగా సినిమా చుట్టూ డిస్కషన్స్ మొదలయ్యాయని అంటున్నారు. ఇది మూవీకి హెల్ప్ చేసిందని.. దీని వల్ల ‘దేవర’ మీద హైప్ మరింత పెరిగిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఆల్ ఇండియా వైడ్ టికెట్ బుకింగ్స్​లో సినిమా రాకెట్​ స్పీడ్​తో దూసుకెళ్తుండటమే దీనికి ఎగ్జాంపుల్ అని చెబుతున్నారు. మరికొందరు నెటిజన్స్ మాత్రం.. ఈవెంట్ ఉన్నా లేకపోయినా తారక్ చిత్రం మీద ఉండే బజ్, హైప్, ఎక్స్​పెక్టేషన్స్​లో ఏమాత్రం తేడా ఉండదని అంటున్నారు. ఆయనకు ఉన్న మాస్ ఫాలోయింగ్​ అలాంటిదని చెబుతున్నారు. మరి.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడం ‘దేవర’కు మంచే చేసిందా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.