Keerthi
Jr NTR: ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే చెన్నై ప్రమోషన్స్ లో పాల్గొన్న ఎన్టీఆర్ అక్కడ తనకు ఎంతో ఇష్టమైన తలప్పకట్టి బిర్యానీ కోసం ప్రస్తావించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంతకీ ఎన్టీఆర్ చెప్పిన ఈ తలప్పకట్టి బిర్యానీ అంటే ఏమిటి? అది ఎందుకంత చెన్నైలో ఎందుకంత ఫేమస్? అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Jr NTR: ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే చెన్నై ప్రమోషన్స్ లో పాల్గొన్న ఎన్టీఆర్ అక్కడ తనకు ఎంతో ఇష్టమైన తలప్పకట్టి బిర్యానీ కోసం ప్రస్తావించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంతకీ ఎన్టీఆర్ చెప్పిన ఈ తలప్పకట్టి బిర్యానీ అంటే ఏమిటి? అది ఎందుకంత చెన్నైలో ఎందుకంత ఫేమస్? అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Keerthi
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా దేవర. ప్రస్తుతం ఏ నోట విన్నా, ఎక్కడ చూసిన దేవర హడావుడే ఎక్కువగా కనిపిస్తుంది. పైగా అందుకు తగ్గట్టుగానే దేవర నుంచి తరుచు ఏదో ఒక అప్డేట్ వైరల్ అవుతూ.. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో రోజు రోజుకి భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. కాగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడు దేవరని తెరపై చూద్దామనని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఆసక్తి ఎదురుచూస్తున్నారు.
ఇక ఆ రోజు రానే వచ్చేసింది. దేవర సినిమా వరల్డ్ వైడ్ గా ఈ సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం ఎన్టీఆర్ అండ్ మూవీ టీమ్ వరుస ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే చెన్నై ప్రమోషన్స్ లో పాల్గొన్న ఎన్టీఆర్ అక్కడ తనకు ఎంతో ఇష్టమైన దిండిగుల్ తలప్పకట్టి బిర్యానీ కోసం ప్రస్తావించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంతకీ ఎన్టీఆర్ చెప్పిన ఈ దిండిగుల్ తలప్పకట్టి బిర్యానీ అంటే ఏమిటి? అది ఎందుకంత ఫేమస్? అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తనకిష్టమైన ఆహారాన్ని ఆరాగించడంలో తారక్ ఎప్పుడు రాజీ పడేవారు కాదు. అయితే ఇప్పుడంటే ఫిట్ నెస్ కోసం ఆలోచించి కాస్త మొహమాట పడతున్నారు కానీ, అప్పట్లో తారక్ తినే విషయంలో ఓ పట్టు పట్టేవారని చెప్పవచ్చు. ఇక అందుకు తగ్గట్టు ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో బావర్చీ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒక్కడినే తినేస్తానని చెప్పిన వీడియో కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఇటీవలే దేవర ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్ లో యాకంర్.. ఎన్టీఆర్ కు వరుస ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. అప్పుడు ఎన్టీఆర్ వెంటనే.. ‘మీరు నా ఫ్లాన్స్ మొత్తం నాశనం చేస్తున్నారు. నేను ఇక్కడ నుంచి వెళ్లిన్నప్పుడు దిండిగుల్ తలప్పకట్టి బిర్యానీ ప్యాక్ పట్టుకెళ్లాలని అనుకున్నాను. కానీ, మీ వాళ్ల అది మిస్ అవుతుందోమో, కనుక దేవర మూవీ రిలీజ్ అయిన్నప్పుడు మనమిద్దరం వెళ్లి తలప్పకట్టి బిర్యాని తిందాం అంటూ’ యాంకర్ తో చెప్పుకొచ్చారు. నిజానికి ఎన్టీఆర్ ఆసక్తిగా చెప్పిన ఈ దిండిగళ్ తలప్పకట్టి బిర్యానీ ఎందుకంతా ఫేమస్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ లో దమ్ బిర్యానీ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే తమిళనాడులో కూడా ఈ దిండిగళ్ తలప్పకట్టి బిర్యానీ అంతే ఫేమస్. ఇక దీనిని 1957 నుంచి తయారు చేస్తున్నారు. అయితే ఈ బిర్యానీ చిట్టి ముత్యలా బియ్యంతో చేస్తారు. పేరకు ఇది బిర్యానీ అంటారు కానీ, ఇది ఫలావ్ లా ఉంటుంది. దీనిని తొలిసారిగా నాగస్వామి నాయుడు అనే వ్యక్తి అన్నదాన విలాస్ బిర్యానీ హోటల్ పేరిట ప్రారంభించారు. అయితే ఆయన ఎప్పుడు తలకు తలపాగా చుట్టుకొని ఉంటారు. ఈ క్రమంలోనే.. కొన్నాళ్లకు తలపాగా పేరుతో బ్రాండ్ గా కూకింగ్ స్టైల్స్ తో చేస్తున్నా బిర్యానీ ఫేమస్ అయింది. ఇక అప్పటి నుంచి బిర్యానీ మాత్రమే కాదు.. రెస్టారెంట్స్ పేరు కూడా తలప్పకట్టి హోటల్ గా మారిపోయింది. ఇక మొదటి నుంచి నాయుడు రుచుల విషయంలో ఏమాత్రం రాజీ పడేవారు కాదట.
ఆ తర్వాత ఆయన వారసులు కూడా అదే కంటిన్యూ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఆ రుచితో తయారైయ్యే బిర్యానీ, అందులో వినియోగించే మసాల దినుసులు, ఆ ఫ్లేవర్ మరెక్కడ దొరకదని సమాచారం. గతంలో ఈ బిర్యానీ సౌత్ ఇండియాలోన హై క్వాలిటీ బిర్యానీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలోనే.. దక్షిణాది సిని ప్రముఖులు, రాజకీయ నాయుకులు, సైతం ఈ బిర్యానీ టేస్ట్ చేసే వెళ్లేవారట. అందుకే ఎన్టీఆర్ కూడా ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టమని, అందుకే ఈ బిర్యానీ కోసం స్పెషల్ గా ప్రమోషన్స్ లో ప్రస్తావించినట్లు సమాచారం. మరీ, ఎన్టీఆర్ చెప్పిన ఈ దిండిగుల్ తలప్పకట్టి బిర్యానీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.