iDreamPost
android-app
ios-app

దేవరకు ఎన్టీఆర్ ఫ్యాన్సే విలన్స్.. అసలు కారణం ఇదే

  • Published Sep 28, 2024 | 1:24 PM Updated Updated Sep 28, 2024 | 1:34 PM

Devara Moive: దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా దేవర జాతర మారు మోగిపోతుంది. ముఖ్యంగా దేవర కత్తి పదునుకు ఇండస్ట్రీలు మొత్తం షేక్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మరి, అంతలా భారీ హైప్ వచ్చిన ఈ మూవీకి మొదట నెగిటివ్ టాక్ రావడం వెనుక అసలైన విలన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అదేలానో తెలుసుకుందాం.

Devara Moive: దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా దేవర జాతర మారు మోగిపోతుంది. ముఖ్యంగా దేవర కత్తి పదునుకు ఇండస్ట్రీలు మొత్తం షేక్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మరి, అంతలా భారీ హైప్ వచ్చిన ఈ మూవీకి మొదట నెగిటివ్ టాక్ రావడం వెనుక అసలైన విలన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అదేలానో తెలుసుకుందాం.

  • Published Sep 28, 2024 | 1:24 PMUpdated Sep 28, 2024 | 1:34 PM
దేవరకు ఎన్టీఆర్ ఫ్యాన్సే విలన్స్.. అసలు కారణం ఇదే

ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా దేవర ప్రభంజనం ఏ స్థాయిలో కొనసాగుతుందో అందరికి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల తర్వాత.. ఎన్టీఆర్ సోలోగా ప్రేక్షకుల ముందకు రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధలు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే థియేటర్స్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసిన దేవర మోత మోగిపోతుంది. ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ డే, ఫస్ట్ షో నుంచే మిక్సిడ్ టాక్ వినిపించాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేశాడంటూ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా దేవరతో ఎన్టీఆర్ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడని.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేయడం పక్కా అంటూ థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ చేసిన రచ్చ అందరికి తెలిసిందే.

ఇక అందుకు తగ్గట్టుగానే దేవర విడుదలైన మొదటి రోజే ( శుక్రవారం సెప్టెంబర్ 27వ తేదీ) భారీ కలెక్షన్స్ తో ఊచకోత మొదలైంది. మరి ఆ స్థాయిలో థియేటర్స్ లో దేవర జాతర కొనసాగుతున్న వేళ, మరోవైపు  నెగిటివ్ టాక్ కూడా వైరల్ అయ్యింది. అయితే ఇంత వరకు దేవర నెగిటివ్ రివ్యూకు కారణం.. ఈ మూవీని ముందు నుంచి టార్గెట్ చేసి ట్రోల్స్ చేసిన వారే అనుకున్నాం. కానీ, దేవరకు అసలైన విలన్స్.. ఎన్టీఆర్ ఫ్యాన్సే. అదేంటి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర మూవీకి విలన్స్ కావడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవరకు రిలీజ్ ముందే నుంచే భారీ హైప్ ఉంది. కనుక థియేటర్లలో దేవర విడుదలైతో మాస్ జాతర పక్కా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలకు తగ్గట్టుగానే దేవర బొమ్మ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయ్యింది. దేవర కత్తి పదునుకు ఇండస్ట్రీలు మొత్తం షేక్ అయ్యాయి. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే.. దేవర ఓవర్సీస్‌లో ఫస్ట్ డే రూ. 18 కోట్లు వరకూ షేర్ రాగా, వరల్డ్ వైడ్ గా రూ. 172 కోట్లకు పైగా వసూల్ రాబెట్టింది. మరి ఇంత క్రేజ్ ఉన్న దేవరకు ఫస్ట్ డే ఎందుకంత నెగిటివ్ వచ్చిందనే సందేహం అందరికీ తలెత్తింది. కానీ, నిజానికి దేవర నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసింది ఎన్టీఆర్ ఫ్యాన్సే. ఎందుకంటే.. ఈ సినిమాపై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో  అంచనాలు పెట్టుకున్నారు. కానీ, సినిమా విడుదలైన తర్వాత ఫ్యాన్స్ అంచనాలకు తగ్గ ఎలిమెంట్స్ లేకపోవడమే, మెప్పించలేకపోవడమో తెలియదు కానీ, సినిమాపై భారీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే దేవర మూవీపై నెగిటివ్ గా రివ్యూ ఇచ్చారు. కానీ, రాను రాను దేవర మాస్ ఆడియోన్స్ కు బాగా ఎక్కిపోవడంతో.. ఫస్ట్ రెండు, మూడు షోల తర్వాత దేవర రిజల్ట్ మారిపోయింది. ఎక్కడ చూసిన బ్లాక్ బస్టర్ హిట్ టాక్ నడుస్తోంది. కానీ, మొదట ఎన్టీఆర్ ఫ్యాన్సే మూవీపై ఇలా నెగిటివ్ టాక్ ప్రచారం చేయడం వెనుక కారణం.. వారు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోవడం. కానీ, ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ లో దేవర ను చూస్తే.. ఆడియోన్స్ కాదు.. ఫ్యాన్స్ కూడా ఇంప్రెస్ అవ్వడం ఖాయం. అలా అంచనాలు పెట్టుకోకుండా చూడటం వల్లే మళ్లీ దేవర నెగిటివ్ టాక్ నుంచి ఫ్యాన్స్ బయటపడ్డారని  చెప్పవచ్చు. మరి, దేవర మూవీకి మొదట ఎన్టీఆర్ ఫ్యాన్సే విలన్స్ కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom Girişbetvole girişHoliganbet Giriş