iDreamPost
android-app
ios-app

Jani Master: ముంబై జైలుకు జానీ మాస్టర్? కేసులో ఏం జరగబోతోంది?

  • Published Sep 19, 2024 | 5:14 PM Updated Updated Sep 19, 2024 | 5:27 PM

Jani Master Headed to Mumbai Jail: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​ను ఏ జైలుకు తీసుకెళ్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. అసలు ఈ కేసులో మున్ముందు ఏం జరగబోతోందని అంతా చర్చించుకుంటున్నారు.

Jani Master Headed to Mumbai Jail: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​ను ఏ జైలుకు తీసుకెళ్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. అసలు ఈ కేసులో మున్ముందు ఏం జరగబోతోందని అంతా చర్చించుకుంటున్నారు.

  • Published Sep 19, 2024 | 5:14 PMUpdated Sep 19, 2024 | 5:27 PM
Jani Master: ముంబై జైలుకు జానీ మాస్టర్? కేసులో ఏం జరగబోతోంది?

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అవడం సంచలనంగా మారింది. బాధితురాలి ఫిర్యాదుతో అన్వేషణ ప్రారంభించిన సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు గోవాలోని ఓ లాడ్జిలో అతడ్ని అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టాక.. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్​లోని ఉప్పరపల్లి కోర్టుకు తీసుకొస్తున్నారు. అయితే జానీ మాస్టర్​ను ఏ జైలుకు తీసుకెళ్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. దీనిపై తాజాగా ఓ సమాచారం బయటకు వచ్చింది. అతడ్ని ముంబై జైలుకు తీసుకెళ్తారని తెలుస్తోంది. దీనికి సాలిడ్ రీజన్స్ కూడా కనిపిస్తున్నాయి. జానీ మాస్టర్​పై రాయదుర్గం పోలీసు స్టేషన్​లో జీరో ఎఫ్​ఐఆర్ నమోదైంది. అలాంటప్పుడు అతడ్ని హైదరాబాద్​ జైలుకే తరలించాలి. కానీ ముంబై జైలుకు ఎందుకు పంపాలని అనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..

జానీ మాస్టర్ కేసులో రాయదుర్గం పోలీస్ స్టేషన్​లో జీరో FIR నమోదైంది. అక్కడి నుండి నార్సింగి పోలీస్ స్టేషన్​కు బదిలీ చేశారు. ఆ పీఎస్​లోనే కేసును రిజిస్టర్ చేశారు. అయితే.. బాధితురాలు చెబుతున్న దాని ప్రకారం ముంబై హోటల్​లో ఎఫెన్స్ జరిగింది. ప్లేస్ ఆఫ్ ది ఎఫెన్స్ లెక్క ప్రకారం అయితే.. జానీ మాస్టర్​ను ముంబైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ.. ఈ కేసు ప్రత్యేకం. ఎందుకంటే, పోక్సో చట్టం కేసు కింద ఫైల్ అయింది. బాధితురాలు ఉండేది ఇక్కడే కాబట్టి జానీ మాస్టర్​ను ఇక్కడి జైలుకు పంపుతారా? ఒకవేళ ఇలా చేసినా ముంబైకి వెళ్లి సాక్ష్యాలు స్వీకరించాల్సి ఉంటుంది! టోటల్​గా జానీ మాస్టర్​ను ఏ జైలుకు తరలిస్తారో చూడాలి. ఇక, జానీ మాస్టర్​ను పోలీసులు తీసుకురాక ముందే ఓ పోలీసు స్టేషన్​లో అతడి భార్య ఆయేషా రచ్చ రచ్చ చేసింది.

నార్సింగి పోలీసు స్టేషన్​కు హడావుడిగా చేరుకున్న ఆయేషా.. జానీ ఎక్కడంటూ రచ్చ చేసింది. తన భర్తను చూపించాలంటూ హంగామా చేసింది. అయితే జానీ ఇంకా హైదరాబాద్ రాలేదని, తీసుకొస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బయటకు వచ్చిన ఆయేషా.. మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు. ఈ పీఎస్​లోనే జానీ ఉన్నాడంటూ ఫేక్ కాల్ రావడంతో క్లారిటీ కోసం వచ్చానని తెలిపింది. ఆమె పోలీసు స్టేషన్​లో జానీ ఎక్కడ అంటూ రచ్చ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. కాగా, జానీ మాస్టర్ అరెస్ట్​కు ఆమె భార్యనే కారణమంటూ పుకార్లు వస్తున్నాయి. భర్త జాడ ఆమె బయటపెట్టడంతో పోలీసులు ఆ లొకేషన్​కు వెళ్లి అదుపులోకి తీసుకున్నారని వినిపిస్తోంది. ఇదే తరుణంలో జానీ మాస్టర్​ను ఏ జైలుకు తీసుకెళ్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి ఈ కేసులో ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.